ఐకూ 13 చైనా మోడల్‌తో పోలిస్తే భారత్‌లో విడుదల కానున్న స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి మార్పులున్నాయి?
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ల తయారీ సంస్థ ఐకూ నుంచి భారత్ మార్కెట్ లోకి (iQOO 13 Smartphone India launch) డిసెంబర్ 3వ తేదీన ఐకూ 13 విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్ చైనాలో గత నెలలో లాంచ్ అయింది. ఈ ఫోన్ భారత్ మార్కెట్‌లో స్నాప్‌డ్రాగన్ 8 Elite ప్రాసెసర్, Q2 గేమింగ్ చిప్‌సెట్‌తో లాంచ్ కానుంది. దీంతోపాటు మరిన్ని వివరాలు వెల్లడయ్యాయి. అయితే తాజాగా బ్యాటరికి సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి. చైనా వేరియంట్‌తో పోలిస్తే భారత్ ఐకూ 13 స్మార్ట్‌ఫోన్ తక్కువ సామర్థ్యం కలిగిన బ్యాటరీని కలిగి ఉంటుంది.
దీంతోపాటు భారత్ మార్కెట్ లో (iQOO india) ఐకూ కొత్త స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో (amazon) అందుబాటులో ఉంటుంది. దీని ఆధారంగా ఐకూ 13 హ్యాండ్‌సెట్ 2K LTPO అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 144Hz రీఫ్రెష్ రేట్‌తో లాంచ్ కానుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత FuntouchOS 15 తో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. IP68 మరియు IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.

అయితే తాజా వివరాల ఆధారంగా చైనా వేరియంట్ కంటే భారత్ మోడల్ చిన్న బ్యాటరీని కలిగి ఉంటుంది. ఐకూ 13 స్మార్ట్‌ఫోన్ చైనా మార్కెట్‌లో 6150mAh బ్యాటరీతో లాంచ్ అయింది. అయితే భారత్ మార్కెట్‌లో మాత్రం 6000mAh బ్యాటరీతో లాంచ్ కానుంది. అయితే బ్యాటరీ స్పెసిఫికేషన్‌లు మినహా మిగిలిన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లతో పెద్దగా మార్పులు ఉండవని తెలుస్తోంది.
ఐకూ 13 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
గత నెలలో చైనా మార్కెట్‌లో ఐకూ 13 స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది. 144Hz రీఫ్రెష్ రేట్‌తో 6.82 అంగుళాల 2K BOE Q10 8T LTPO 2.0 OLED డిస్‌ప్లేతో విడుదల అయింది. స్నాప్‌డ్రాగన్ 8 Elite SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.
ఈ చిప్‌సెట్‌తోపాటు Q2 గేమింగ్ చిప్‌సెట్‌ను కూడా కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OriginOS 5 తో పనిచేస్తోంది. ఈ ఐకూ స్మార్ట్‌ఫోన్ IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ సెన్సార్‌ను కలిగి ఉంది.
ఐకూ 13 చైనా వేరియంట్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరాతోపాటు 50MP టెలిఫోటో, 50MP అల్ట్రావైడ్ కెమెరాలతో అందుబాటులో ఉంది. ముందువైపు 32MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ హ్యాండ్‌సెట్‌సెట్ 120W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6150mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
భారత్‌లో ఐకూ 13 స్మార్ట్‌ఫోన్ డిసెంబర్ 3 వ తేదీన లాంచ్ కానుంది. అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇందుకు సంబంధించిన లైవ్ పేజీ కూడా అందుబాటులోకి వచ్చింది. డిస్‌ప్లే, చిప్‌సెట్ మినహా ఇతర స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లపై సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








