ఐకూ 13 స్మార్ట్ఫోన్ భారత్ మార్కెట్లో ఎప్పుడు విడుదల కానుందంటే.. డిజైన్, డిస్ప్లే, ప్రాసెసర్ వివరాలు!
భారత్ మార్కెట్లో ఐకూ 13 స్మార్ట్ఫోన్ విడుదల వివరాలు (iQOO 13 Smartphone Launch Date) ఎట్టకేలకు వెల్లడయ్యాయి. లాంచ్ వివరాలను ఐకూ ఇండియా తన అధికారిక X ఖాతా ద్వారా వెల్లడించింది. ఇప్పటికే ఈ హ్యాండ్సెట్కు సంబంధించి కొన్ని కీలక వివరాలు వెల్లడయ్యాయి. ఈ హ్యాండ్సెట్ చిప్సెట్ సహా డిస్ప్లే వివరాలు ఇటీవలే వెల్లడయ్యాయి. ఐకూ 13 స్మార్ట్ఫోన్ చైనా వేరియంట్ తరహానే భారత్లో విడుదల కానున్న హ్యాండ్సెట్ డిజైన్, కొన్ని స్పెసిఫికేషన్లు ఉండనున్నాయని తెలుస్తోంది. ఇటీవలే చైనాలో ఈ హ్యాండ్సెట్ లాంచ్ అయింది.
అమెజాన్ ద్వారా అందుబాటులోకి :
ఐకూ ఇండియా X పోస్ట్ ఆధారంగా ఐకూ 13 స్మార్ట్ ఫోన్ డిసెంబర్లో భారత్ మార్కెట్లోకి విడుదల కానుంది. అయితే ఏ తేదీన లాంచ్ కానుందనే వివరాలు వెల్లడించలేదు. ఐకూ ఇండియా మరియ బీఎండబ్ల్యూ మోటార్స్పోర్ట్ (BMW)భాగస్వా్మ్యంతో బ్లూ బ్లాక్ రెడ్ రంగుల ప్యాట్రన్లో లెజెండ్ ఎడిషన్ లాంచ్ కానుందిని తెలిపింది.

భారత్ మార్కెట్లో సేల్ వివరాలను కూడా ఈ ఐకూ 13 హ్యాండ్సెట్ వెల్లడించింది. ఐకూ అధికారిక ప్లాట్ఫాం సహా అమెజాన్ ద్వారా అందుబాటులోకి రానుందని తెలిపింది. ఇప్పటికే ఈ హ్యాండ్సెట్ సంబంధించి అమెజాన్ మైక్రోసైట్ లైవ్లో ఉంది. దీని ద్వారా కొన్ని స్పెసిఫికేషన్ల వివరాలు వెల్లడయ్యాయి.
భారత్ మార్కెట్లో :
అమెజాన్ మైక్రోసైట్ ఆధారంగా ఐకూ 13 స్మార్ట్ఫోన్ 144Hz రీఫ్రెష్ రేట్తో 2K LTPO అమోలెడ్ డిస్ప్లే ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ హ్యాండ్సెట్ స్నాప్డ్రాగన్ 8 Elite SoC చిప్సెట్లో విడుదల కానుంది. ఈ ప్రాసెసర్ Q2 గేమింగ్ చిప్సెట్ జతచేసి ఉంటుంది. భారత్ మార్కెట్లో ఆండ్రాయిడ్ 15 ఆధారిత FuntouchOS 15 (Skin On Top) ను కలిగి ఉండే అవకాశం ఉంది.

ఇటీవలే చైనాలో ఐకూ 13 స్మార్ట్ఫోన్ విడుదల అయింది. 6.82 అంగుళాల 2K BOE Q10 8T LTPO 2.0 OLED డిస్ప్లేను కలిగి ఉంది. ఈ డిస్ప్లే 144Hz రీఫ్రెష్ రేట్ సహా HDR ను సపోర్టు చేస్తుంది. IP69 రేటింగ్తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్గా ఉంది. భద్రత కోసం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ను కలిగి ఉంది.
చైనా వేరియంట్ ఐకూ 13 హ్యాండ్సెట్ స్నాప్డ్రాగన్ 8 Elite SoC చిప్సెట్తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్ Q2 గేమింగ్ చిప్సెట్, గరిష్ఠంగా 16GB ర్యామ్ మరియు 1TB స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OriginOS 5 తో పనిచేస్తోంది. ఇన్ డిస్ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ సెన్సార్ను కలిగి ఉంది.
#iQOO, in a premium partnership with @BMWMotorsport, brings you the all-new #iQOO13 Legend Edition featuring tricolor patterns that embody the ultimate pursuit of performance and control. Launching this December exclusively at @amazonIN and https://t.co/bXttwlYQef. Stay tuned!… pic.twitter.com/QPWsMHtCNC
— iQOO India (@IqooInd) November 6, 2024
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్సెట్ ట్రిపుల్ కెమెరా యూనిట్ను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా కెమెరాలను కలిగి ఉంది. ముందువైపు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను అమర్చి ఉంది. 120W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6150mAh బ్యాటరీని కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








