iQOO 13 స్మార్ట్‌ఫోన్ విడుదల తేదీ లీక్.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ ఐకూ (iQOO) నుంచి త్వరలో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఐకూ 13 లాంచ్ కానుంది. ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించి ఇప్పటికే అనేక వివరాలు లీక్ అయ్యాయి. ఈ ఫోన్ ఐకూ 12 హ్యాండ్‌సెట్‌కు తర్వాత తరం వెర్షన్‌గా అందుబాటులోకి వస్తుంది. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ విడుదల తేదీ లీక్ అయింది. అయితే దీనిపై సంస్థ ఎలాంటి అధికారిక సమాచారం విడుదల చేయలేదు. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్‌సెట్‌తో లాంచ్ కానుందని తెలుస్తోంది.
ఐకూ 13 స్మార్ట్‌ఫోన్ ఎప్పుడు విడుదల కానుందంటే?
ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్‌కు (iQOO 13 Smartphone Launch Date) సంబంధించి అనేక వివరాలు లీక్ అయ్యాయి. స్మార్ట్‌ప్రిక్స్, యోగేష్ బ్రార్.. ఐకూ 13 లాంచ్ వివరాలను లీక్ చేశారు. ఈ వివరాల ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ భారత్ మార్కెట్‌లో డిసెంబర్ 5 వ తేదీన లాంచ్ కానుందని తెలుస్తోంది. అయితే ఐకూ ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఐకూ 13 స్మార్ట్‌ఫోన్ అంచనా వివరాలు :
ఐకూ 13 స్మార్ట్‌ఫోన్ (iQOO 13 Smartphone Specifications) 6.78 అంగుళాల 2k LTPO అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ మెరుగైన డిజైన్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. 16GB LPDDR5X ర్యామ్ మరియు 512GB UFS 4.0 స్టోరేజీ తో జతచేయబడి ఉంటుంది. దీంతోపాటు ఈ చిప్‌సెట్ ఐకూ Q2 సూపర్ కంప్యూటింగ్ చిప్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. ఫలితంగా మెరుగైన గేమింగ్ అనుభూతిని పొందవచ్చని తెలుస్తోంది.
50MP + 50MP +50MP కెమెరాలు!
కెమెరా విభాగం పరంగా వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా, 2X జూమ్ సామర్థ్యంతో 50MP టెలిఫోటో లెన్స్‌తో విడుదల కానుందని తెలుస్తోంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ 32MP కెమెరాను కలిగి ఉంటుంది తెలుస్తోంది.
దీంతోపాటు ఐకూ 13 హ్యాండ్‌సెట్ 120W ఛార్జింగ్ సపోర్టుతో 6150mAh భారీ బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది. కనెక్టివిటీ పరంగా డ్యూయల్ సిమ్ కార్డు, 5G, 4G, బ్లూటూత్, IP68 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంటుంది. మరియు భద్రత కోసం అల్ట్రాసోనిక్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
ఐకూ 13 ధర వివరాలు :
ఐకూ 12 స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.52999 గా ఉండగా.. త్వరలో లాంచ్ కానున్న ఐకూ 13 స్మార్ట్‌ఫోన్ ధర రూ.55,000 గా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఎన్ని వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుందో తెలియాల్సి ఉంది. అయితే భారత్ కంటే ముందే ఈ హ్యాండ్‌సెట్ చైనాలో విడుదలయ్యే అవకాశం ఉంది. విడుదలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








