50MP + 50MP +50MP కెమెరాలు, 6.82 అంగుళాల డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీతో iQOO 13 స్మార్ట్‌ఫోన్ విడుదల..!
ఐకూ నుంచి భారత్ మార్కెట్‌లోకి ఐకూ 13 స్మార్ట్‌ఫోన్ (iQOO 13 Smartphone Launched) విడుదల అయింది. ఈ స్మా్ర్ట్‌ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. డిజైన్ పరంగా ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకుంటుంది. ఈ హ్యాండ్‌సెట్ IP68, IP69 రేటింగ్‌తో కూడిన డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ఆండ్రాయిడ్ 15 OS, స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు, ధర, సేల్ పూర్తి వివరాలు
ఐకూ 13 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఐకూ 13 స్మార్ట్‌ఫోన్ 144Hz రీఫ్రెష్ రేట్‌తో 6.82 అంగుళాల 2K LTPO అమోలెడ్ డిస్‌ప్లేతో విడుదల అయింది. ఈ డిస్‌ప్లే 1440*3186 పిక్సల్స్ రిజల్యూషన్, 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 510ppi పిక్సల్ డెన్సిటీని కలిగి ఉంది. ఈ ఫోన్ వేపర్ ఛాంబర్ ను కూడా కలిగి ఉంటుంది.

ఐకూ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ 3nm స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ Q2 చిప్, 12GB LPDDR5X అల్ట్రా ర్యామ్ మరియు గరిష్టంగా 512GB UFS 4.1 స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS తో పనిచేస్తోంది.
మరియు ఈ హ్యాండ్‌సెట్ 4 ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, 5 సంవ్సరాలపాటు సెక్యూరిటి అప్‌డేట్‌లను పొందనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్‌లో లభిస్తుంది. 12GB + 256GB స్టోరేజీ మరియు 16GB + 512GB స్టోరేజీ వేరియంట్‌లో లభిస్తుంది.
50MP + 50MP + 50MP కెమెరాలు : కెమెరా విభాగం పరంగా ఐకూ 13 స్మార్ట్‌ఫోన్ (iQOO 13 Smartphone Camera Specifications) మెరుగైన ఫీచర్‌లను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్), EIS (ఎలక్ట్రికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్), f/1.88 అపేచర్‌తో 50MP సోనీ IMX921 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది.
దీంతోపాటు f/2.0 అపేచర్‌తో 50MP అల్ట్రావైడ్ శాంసంగ్ JN1 కెమెరా, 2x ఆప్టికల్ జూమ్ సామర్థ్యం, f/1.85 అపేచర్‌తో 50MP సోనీ IMX816 కెమెరాను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం f/2.5 అపేచర్‌తో 32MP కెమెరాతో ఐకూ 13 స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది.
ఐకూ 13 స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు : ఐకూ 13 స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.54,999 మరియు 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.59,999 గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ లెజెండ్, నార్డో గ్రే రంగుల్లో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ డిసెంబర్ 11 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది.
ప్రారంభ ఆఫర్‌లో భాగంగా ఐకూ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ICICI, HDFC బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.3,000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఐకూ ఇ-స్టోర్ మరియు ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఐకూ, వివో పాత ఫోన్లను ఎక్చ్సేంజీ చేయడం ద్వారా రూ.5,000 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు.
ఈ ఐకూ 13 హ్యాండ్‌సెట్ 5G, 4G LTE, బ్లూటూత్ 5.4, Wi-Fi 7, GPS, NFC, USB- C ఛార్జింగ్ పోర్టు వంటి కనెక్టింగ్ ఫీచర్‌ను కలిగి ఉంది. దీంతోపాటు ఈ ఫోన్ టెంపరేచర్ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఇ-కాంపాస్, గైరోస్కోప్, యాక్సెలిరోమీటర్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








