Home
Mobile

iQOO 13 స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ ప్రారంభం.. మూడు 50MP కెమెరాలు, 6.82 అంగుళాల భారీ డిస్‌ప్లే సహా సూపర్ ఫీచర్‌లు..!

భారత్‌ మార్కెట్‌లో డిసెంబర్‌ తొలివారంలో ఐకూ 13 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకొనే డిజైన్‌ అందుబాటులో ఉంది. దీంతోపాటు ఆండ్రాయిడ్‌ 15 OS తోపాటు స్నాప్‌డ్రాగన్‌ 8 Elite చిప్‌సెట్‌తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ రెండు వేరియంట్‌లో ప్రస్తుతం లభిస్తుంది. ఈ ఐకూ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ ఇవాళ్టి (iQOO 13 Smartphone Sale) నుంచి ప్రారంభం అయింది. ఐకూ ఇండియా, అమెజాన్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ అనేక మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది.

ప్రస్తుతం ఐకూ 13 స్మార్ట్‌ఫోన్‌ రెండు స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ మరియు 16GB స్టోరేజీ + 512GB స్టోరేజీ వేరియంట్‌లో లభిస్తోంది. 12GB ర్యామ్ వేరియంట్ ధర రూ.54,999 గా ఉంది. అదే 16GB ర్యామ్ వేరియంట్ ధర రూ.59,999 గా ఉంది. స్మార్ట్‌ఫోన్‌ లెజెండ్‌ వైట్‌, నార్డో గ్రే రంగుల్లో లభిస్తుంది.

iQOO 13 Smartphone sale offers

ప్రారంభ ఆఫర్‌లో భాగంగా HDFC, ICICI బ్యాంకుల క్రెడిట్‌, డెబిట్‌ కార్డులపై రూ.3,000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఐకూ, వివో స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్చేంజ్‌ చేయడం ద్వారా గరిష్ఠంగా రూ.5,000 తగ్గింపును పొందవచ్చు. అదే ఇతర స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్చేంజీ చేయడం ద్వారా రూ.3,000 డిస్కౌంట్‌ లభిస్తుందని సంస్థ తెలిపింది. 9 నెలల వరకు నో కాస్ట్‌ EMI సదుపాయాన్ని పొందవచ్చు.

ఐకూ 13 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
ఐకూ 13 స్మార్ట్‌ఫోన్‌ 6.82 అంగుళాల 2K LTPO అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1440*3186 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, 144Hz రీఫ్రెష్‌ రేట్‌, 1800 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. IP68/IP69 రేటింగ్‌తో కూడిన డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

iQOO 13 Smartphone sale offers

ఐకూ కొత్త హ్యాండ్‌సెట్‌ క్వాల్‌కాం 3nm స్నాప్‌డ్రాగన్‌ 8 Elite చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. మరియు Q2 గేమింగ్‌ చిప్‌ సహా 12GB LPDDR5X అల్ట్రా ర్యామ్‌ మరియు 512GB UFS 4.1 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ, 16GB ర్యామ్‌ + 512GB స్టోరేజీ వేరియంట్‌లో లభిస్తుంది.

ఈ ఐకూ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Funtouch OS ను కలిగి ఉంది. ఐకూ 13 స్మార్ట్‌ఫోన్‌ 4 ఆండ్రాయిడ్‌ అప్‌డేట్‌లు, 5 సంవ్సరాలపాటు సెక్యూరిటి అప్‌డేట్‌లను పొందనుందని ఐకూ వెల్లడించింది. ఈ ఫోన్ ప్రత్యేక వేపర్‌ ఛాంబర్‌ను కలిగి ఉంటుంది. 120W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

ఈ హ్యాండ్‌సెట్ కెమెరాల పరంగా ఆకట్టుకుంటుంది. 50MP సోనీ IMX921 ప్రైమరీ కెమెరాను అమర్చారు. ఈ ప్రైమరీ కెమెరా OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌), EIS (ఎలక్ట్రికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) ఫీచర్‌లను సపోర్టు చేస్తాయి. మరియు 50MP అల్ట్రావైడ్‌ శాంసంగ్ JN1 కెమెరా, 2x ఆప్టికల్ జూమ్‌ సామర్థ్యం, 50MP సోనీ IMX816 కెమెరాను అమర్చారు. దీంతోపాటు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఐకూ 13 స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, Wi-Fi 7, బ్లూటూత్‌ 5.4, GPS, NFC, USB- C వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. దీంతోపాటు అనేక సెన్సార్‌లను కలిగి ఉంది. యాంబియంట్‌ లైట్‌ సెన్సార్‌, టెంపరేచర్‌ సెన్సార్‌, ప్రాక్సిమిటీ సెన్సార్‌, గైరోస్కోప్‌, యాక్సెలిరోమీటర్‌, ఇ-కాంపాస్‌ వంటి కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
iQOO 13 Smartphone sale is live on india and gets RS3000 discount on selected bank cards
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X