Home
Mobile

ఏకంగా 7000mAh బ్యాటరీ, పెరిస్కోప్‌ టెలిఫోటో లెన్స్‌తో స్మార్ట్‌ఫోన్‌.. ఎప్పుడు విడుదల కానుంది?

ఐకూ నుంచి ఇటీవల ఐకూ 13 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయింది. ఈ ఫోన్ ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌లో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం నెక్ట్స్‌ జనరేషన్‌ హ్యాండ్‌సెట్‌ కోసం ఐకూ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ ఫోన్ గురించి అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఐకూ నుంచి త్వరలో ఐకూ 15 సిరీస్‌ లాంచ్‌ కానుందని తెలుస్తోంది. ఈ సిరీస్‌లో భాగంగా బేస్‌ వేరియంట్, ప్రో మోడళ్లు విడుదల అయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఐకూ 13 మోడల్‌ అందుబాటులో ఉంది. అనంతరం ఐకూ 14 వస్తుందని అంతా భావించారు. అయితే కొన్ని ప్రాంతాల్లో 14 నంబర్‌ను అన్‌లక్కీ గా భావిస్తారని తెలుస్తోంది. అందుకే ఐకూ 14కు బదులుగా ఐకూ 15 సిరీస్‌ను (iQOO 15 Pro Smartphone) లాంచ్‌ చేస్తారని తెలుస్తోంది.

iQOO 15 Pro Smartphone

భారీ అప్‌గ్రేడ్‌లతో :
దీంతోపాటు మరో ఆసక్తికర అంశం కూడా వెలుగులోకి వచ్చింది. చాలా సంవత్సరాల తర్వాత ఐకూ నుంచి ప్రో పేరుతో కొత్త ఫోన్‌ విడుదల కానుంది. ఐకూ 11 ప్రో తర్వాత.. సంస్థ ప్రో పేరుతో హ్యాండ్‌సెట్‌లను విడుదల చేయలేదు. అయితే ఐకూ కొత్త స్మార్ట్‌ఫోన్ భారీ అప్‌గ్రేడ్‌లతో లాంచ్‌ కానుందని తెలుస్తోంది.

చిప్‌సెట్‌ వివరాలు :
ఐకూ 15 ప్రో మోడల్‌కు సంబంధించి ప్రస్తుతం అనేక వివరాలు లీక్‌ అయ్యాయి. Smart pikachu ఆధారంగా స్నాప్‌డ్రాగన్ 8 Elite 2 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ ఏకంగా 7000mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది.

కెమెరా విభాగం పరంగానూ భారీ అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ పెరిస్కోప్‌ టెలిఫోటో లెన్స్‌తో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అనేక ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌లు ఈ కెమెరాను కలిగి ఉంటున్నాయి. అయితే బేస్ వేరియంట్‌లో ఈ లెన్స్‌ వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.

దీంతోపాటు ఈ ఫోన్ బ్యాటరీ 7000mAh గా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఛార్జింగ్ స్పీడ్‌ 100W లేదా 120W గా ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు ఐకూ 15 ప్రో మోడల్‌ OLED 2K రిజల్యూషన్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ డిస్‌ప్లే ఐ ప్రొటెక్షన్‌ ఫీచర్‌లను కలిగి ఉంటుంది.

ఐకూ 15 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 2025 నాలుగో త్రైమాసికంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే తొలుత చైనా మార్కెట్‌లో లాంచ్‌ కానుందని తెలుస్తోంది. అనంతరం భారత్‌లో లాంచ్‌ సహా ఇతర గ్లోబల్‌ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు అల్ట్రాసోనిక్‌ ఇన్ స్క్రీన్‌ ఫింగర్ ప్రింట్‌ సెన్సార్‌తో లాంచ్‌ కానుందని తెలుస్తోంది.

అయితే ఐకూ 15 ప్రో స్మార్ట్‌ఫోన్‌ విడుదల తేదీ, చిప్‌సెట్‌, బ్యాటరీ, డిస్‌ప్లే సహా ఇతర స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు పై ఐకూ ఎటువంటి ప్రకటన చేయలేదు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే ఐకూ 13 తరహాలో ఐకూ 15 సిరీస్ చైనాలో తొలుత విడుదల కానుందని తెలుస్తోంది.

* భారత్ మార్కెట్లో మార్చి 11 వ తేదీన ఐకూ నియో 10R స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ఈ హ్యాండ్‌సెట్‌ గురించి ఇప్పటికే అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్‌ 8s జెన్‌ 3 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు 6400mAh బ్యాటరీతో పనిచేయనుంది.

కెమెరా విభాగం పరంగా డ్యూయల్‌ కెమెరాలతోపాటు LED ఫ్లాష్‌ లైట్‌ను కలిగి ఉంటుంది. ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (OIS) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ సెన్సార్‌లో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్‌ 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 1.5K OLED డిస్‌ప్లేను అమర్చి ఉంటుందని సమాచారం.

నియో 10R ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.35,999 గా ఉంటుందని తెలుస్తోంది. అయితే బేస్‌ వేరియంట్ మరింత తక్కువ ధరకు అందుబాటులో ఉంటుందని సమాచారం. అయితే బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ.30000 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చని సమాచారం.

More from GizBot

Best Mobiles in India

English summary
iQOO 15 Pro Smartphone expected to launch with 7000mAh battery and periscope telephoto lens
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X