ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ విడుదలపై కీలక వివరాలు వెల్లడి.. పవర్‌ఫుల్ చిప్‌సెట్, లేటెస్ట్ OS!
iQOO 15 Smartphone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఐకూ నుంచి త్వరలో స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. ఐకూ 15 పేరుతో ఈ హ్యాండ్‌సెట్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ ఫోన్ కు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ చైనాలో ఈ నెల 20 వ తేదీన విడుదల కానుంది. అయితే తాజాగా ఈ ఫోన్ ఇండియా విడుదల గురించి కీలక వివరాలను సంస్థ సీఈవో వెల్లడించారు.
భారత్‌లో ఈ ఫోన్ ఎప్పుడు విడుదల కానుంది? :
ఐకూ ఇండియా సీఈవో నిపున్ మార్యా సోషల్ మీడియా పోస్ట్ ఆధారంగా.. ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ భారత్ లో నవంబర్ నెలలో విడుదల కానుంది. అయితే కచ్చితమైన తేదీ వెల్లడి కాలేదు. సంస్థ సీఈవో షేర్ చేసిన ప్రొమోషనల్ ఇమేజ్ ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ కీలక స్పెసిఫికేషన్‌ల వివరాలు వెల్లడయ్యాయి.

శక్తివంతమైన చిప్‌సెట్, లేటెస్ట్ OS :
భారత్ లో ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 Elite జెన్ 5 చిప్‌సెట్ ను కలిగి ఉంటుంది. మరియు ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 16 (out of the box) పైన పనిచేస్తుంది. దీంతోపాటు Q3 గేమింగ్ చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఫ్రేమ్ రేట్, విజువల్ అప్టిమైజ్ చేస్తుంది.
ఈ చిప్‌సెట్ LPDDR5x ర్యామ్, UFS 4.1 స్టోరేజీతో జతచేసి ఉంటుందని తెలుస్తోంది. ఫలితంగా ఫోన్ వినియోగిస్తున్న సమయంలో మెరుగైన అనుభూతి కలుగుతుందని తెలుస్తోంది. ఈ ఐకూ హ్యాండ్‌సెట్ 144Hz రీఫ్రేష్ రేట్ తో 6.85 అంగుళాల 2K ఫ్లాట్ LTPO అమోలెడ్ డిస్‌ప్లే ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
A new chapter in flagship performance, coming soon! #iQOO15 #BeTheGOAT pic.twitter.com/pst7W8Wahx
— Nipun Marya (@nipunmarya) October 16, 2025
భారీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు :
ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ భారీ బ్యాటరీతో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అంచనా వివరాల ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
అల్ట్రాసోనిక్ ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ :
డిజైన్ పరంగానూ ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకొనే అవకాశం ఉంది. ప్రీమియం మెటల్ గ్లాస్ ఫినిష్ తో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు IP68, IP69 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుందని సమాచారం. ఈ హ్యాండ్‌సెట్ అల్ట్రాసోనిక్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ను కలిగి ఉంటుంది.
టెలిఫోటో లెన్స్! :
ఐకూ 15 హ్యాండ్‌సెట్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ( OIS ) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ మరియు 3x ఆప్టికల్ జూమ్, 100x వరకు డిజిటల్ జూమ్ తో 50MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications