Home
Mobile

ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్‌.. శక్తివంతమైన ప్రాసెసర్‌, భారీ డిస్‌ప్లే సహా..!

ఐకూ నుంచి త్వరలో మరో స్మార్ట్‌ఫోన్‌ ఐకూ 15 లాంచ్ కానుంది. ఈ ఫోన్‌ చైనాలో లాంచ్‌ అయిన అనంతరం భారత్‌ సహా ఇతర గ్లోబల్ మార్కెట్ల లో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐకూ 13 స్మార్ట్‌ఫోన్‌కు తర్వాత తరం వెర్షన్‌గా ఐకూ 15 హ్యాండ్‌సెట్ (iQOO 15 Smartphone) లాంచ్ కానుంది. ఈ ఫోన్‌ భారీ డిస్‌ప్లేతోపాటు శక్తివంతమైన చిప్‌సెట్‌ తో అందుబాటులోకి వస్తుంది. ఈ ఐకూ ఫోన్‌ గురించి అనేక వివరాలు వెల్లడయ్యాయి.

భారీ బ్యాటరీ, ప్రత్యేక ఛార్జింగ్ టెక్నాలజీ :
ఇటీవలే విడుదల అయిన వివరాల ఆధారంగా ఐకూ 15 స్మార్ట్‌ఫోన్‌ 7000mAh బ్యాటరీతో లాంచ్ కానుంది. దీంతోపాటు ఛార్జింగ్ వివరాలు కూడా వెల్లడయ్యాయి. ఈ హ్యాండ్‌సెట్ వైర్‌లైస్ ఛార్జింగ్ సపోర్టుతో అందుబాటులోకి వస్తుంది. వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టు కలిగిన తొలి ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ గా నిలుస్తుందని తెలుస్తోంది.

iQOO 15 Smartphone key details leaked expected to launch soon  full details

ఈ హ్యాండ్‌సెట్‌ గ్లోబల్‌ డైరెక్ట్‌ డ్రైవ్‌ పవర్‌ సప్లై 2.0 ఛార్జింగ్ టెక్నాలజీని కలిగి ఉంటుందని ఐకూ అధికారికంగా వెల్లడించింది. బ్యాటరీని కాపాడడం సహా బ్యాటరీ జీవితకాలం పెంచుతుంది. ఇప్పటికే అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్‌ భారీ బ్యాటరీలో ఫ్లాగ్‌షిప్‌ మోడల్స్‌ ను లాంచ్‌ చేస్తుండగా.. ఈ జాబితాలో ఐకూ అప్‌కమింగ్‌ మోడల్‌ కూడా చేరుతుంది.

IP68, IP69 రేటింగ్‌తో :
ఐకూ 15 స్మార్ట్‌ఫోన్‌ గురించి తాజాగా కీలక వివరాలు వెల్లడయ్యాయి. చైనా మైక్రో బ్లాగింగ్‌ ప్లాట్‌ఫాం weibo ద్వారా వెల్లడైన వివరాల ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. IP68 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంటుంది.

అదే IP69 రేటింగ్‌ కారణంగా అధిక ఉష్ణోగ్రత, అధిక పీడనం కలిగిన జెట్స్‌ను నుంచి కూడా ప్రొటెక్షన్‌ను పొందుతుందని తెలుస్తోంది. ఈ ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ కొత్త జనరేషన్‌ 3D అల్ట్రాసోనిక్‌ ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ తడిచేతులతో కూడా అన్‌లాక్‌ చేసేందుకు అనువుగా ఉంటుంది.

శక్తివంతమైన ప్రాసెసర్ :
ఈ ఐకూ హ్యాండ్‌సెట్ ఇటీవల ఆవిష్కరించిన స్నాప్‌డ్రాగన్ 8 Elite జెన్ 5 చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. ప్రస్తుతం స్నాప్‌డ్రాగన్‌లో ఇదే శక్తివంతమైన ప్రాసెసర్‌గా ఉంది. ఈ ఫోన్ Q3 గేమింగ్‌ చిప్‌ ను కూడా అమర్చి ఉంటుంది. ఇతర వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

భారీ డిస్‌ప్లే :
ప్రస్తుతం అందుబాటులోకి ఉన్న వివరాల ఆధారంగా ఐకూ 15 స్మార్ట్‌ఫోన్‌ 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.85 అంగుళాల 2K 8T LTPO డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 2600 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌, 3200Hz టచ్‌ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంటుంది.

ఐకూ 15 భారత్‌ వేరియంట్ కచ్చితంగా ఎలాంటి ఫీచర్‌లను కలిగి ఉంటుందో త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. చైనాలో ఈ నెలలోనే లాంచ్‌ కానుందని తెలుస్తుండగా.. భారత్‌లో కచ్చితంగా ఎప్పుడు అందుబాటులోకి రానుందనే వివరాలు వెల్లడి కాలేదు.

More from GizBot

Best Mobiles in India

English summary
iQOO 15 Smartphone key details leaked expected to launch soon, full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X