ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ విడుదల తేదీ వచ్చేసింది.. ఆండ్రాయిడ్ 16 OS, భారీ బ్యాటరీ, పవర్‌ఫుల్ ప్రాసెసర్!
iQOO 15 Smartphone india Launch Date : ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్ లో విడుదల తేదీ వెల్లడయింది. ఈ ఫోన్ నవంబర్‌లోనే విడుదల కానుందని ఇప్పటికే వెల్లడి కాగా.. తాజాగా లాంచ్ తేదీ వచ్చేసింది. ఐకూ ఇండియా సీఈవో నిపుల్ మార్యా ఈ వివరాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఈ ఫోన్ ఐకూ ఇండియా ఇ-స్టోర్ తోపాటు అమెజాన్ ద్వారా అందుబాటులోకి రానుంది. త్వరలో విడుదల కానున్న రియల్‌మి, వన్‌ప్లస్ ఫోన్‌లకు పోటీనిచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇండియాలో ఎప్పుడు విడుదల కానుంది? :
ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ నవంబర్ 27, 2025 వ తేదీన ఇండియాలో లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ ఫోన్ అమెజాన్ లో లిస్టింగ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ రూ.60,000 ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ 144Hz రీఫ్రెష్ రేట్ తో 6.85 అంగుళాల 2K శాంసంగ్ M14 అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 2600 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 2160 PWM డిమ్మింగ్ రేటింగ్ ను కలిగి ఉంటుంది. అవుట్‌డోర్ లోనూ మెరుగైన విజిబిలిటీ ఉండేలా యాంటీ రిఫ్లక్షన్ కోటింగ్ ను కలిగి ఉంటుంది.
స్నాప్‌డ్రాగన్ లేటెస్ట్ చిప్‌సెట్ :
ఈ ఐకూ హ్యాండ్‌సెట్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ జెన్ 5 SoC చిప్‌సెట్ ను కలిగి ఉంటుంది. దీంతోపాటు Adreno 840 GPU ను కూడా అమర్చి ఉంటుంది. వీటితోపాటు గేమింగ్, గ్రాఫిక్స్ కోసం Q3 గేమింగ్ చిప్ తో అందుబాటులోకి రానుంది.
Drop your guesses! 👇🏻#BeTheGOAT #iQOO15 pic.twitter.com/wxnvaxYNII
— Nipun Marya (@nipunmarya) October 26, 2025
ఆండ్రాయిడ్ 16 :
ఈ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ 16GB LPDDR5x అల్ట్రా ర్యామ్. 1TB UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత Origin OS 6 పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఎన్ని వేరియంట్స్ లో అందుబాటులోకి రానుందో తెలియాల్సి ఉంది.
ట్రిపుల్ కెమెరా యూనిట్ :
ఈ ఫోన్ మెరుగైన కెమెరాలను కలిగి ఉంటుంది. వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో OIS ( ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ) తో 50MP సోనీ IMX921 ప్రైమరీ కెమెరా, 50MP శాంసంగ్ JN1 అల్ట్రా వైడ్ లెన్స్, జూమింగ్ సామర్థ్యంతో 50MP సోనీ IMX882 టెలిఫోటో లెన్స్ తో లాంచ్ కానుంది. 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.
7000mAh బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్ 100W వైర్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా బ్లూటూత్ 6.0, వైఫై 7, NFC, IR బ్లాస్టర్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ IP68, IP69 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.


Click it and Unblock the Notifications








