Home
Mobile

శక్తివంతమైన చిప్‌, భారీ బ్యాటరీతో ఐకూ 15 స్మార్ట్‌ఫోన్‌.. భారత్‌లో ఎప్పుడు విడుదల కానుందంటే?

ఐకూ 15 స్మార్ట్‌ఫోన్‌ వచ్చే వారం చైనాలో విడుదల కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ గురించి ఇప్పటికే అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8 Elite జెన్‌ 5 చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ ఇటీవలే విడుదల అయింది. ఈ ఐకూ స్మార్ట్‌ఫోన్‌ భారత్ మార్కెట్‌ లోనూ (iQOO 15 Smartphone) విడుదల కానుంది. ఇందుకు సంబంధించిన కీలక వివరాలు ఇటీవలే విడుదల అయ్యాయి.

భారత్‌లో ఎప్పుడు విడుదల కానుంది? :
చైనాలో ఈ ఫోన్‌ అక్టోబర్‌ 20 వ తేదీన విడుదల కానుంది. తాజా లీక్స్ ఆధారంగా భారత్‌ మార్కెట్‌ లో ఐకూ 15 స్మార్ట్‌ఫోన్‌ నవంబర్‌ నెల మధ్యలో లేదా చివర్లో విడుదల అయ్యే అవకాశం ఉంది. భారత్‌ లోనూ ఈ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 ఇలైట్‌ జెన్‌ 5 చిప్‌ తో పనిచేస్తుంది. భారత్‌ మార్కెట్‌ లో ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.60,000 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

iQOO 15 Smartphone launch timeline tipped in india

అమోలెడ్‌ డిస్‌ప్లే :
ఇప్పటికే ఈ ఫోన్‌ గురించి అనేక వివరాలు వెల్లడయ్యాయి. దీని ఆధారంగా ఈ ఫోన్ 144Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.85 అంగుళాల 2K ఫ్లా్‌ట్‌ LTPO అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మల్టీమీడియా, గేమింగ్‌ కోసం అనుకూలంగా ఉంటుందని సంస్థ చెబుతోంది.

శక్తివంతమైన చిప్‌సెట్‌తోపాటు :
ఈ హ్యాండ్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్‌ జెన్ 5 ప్రాసెసర్‌ తో పనిచేస్తుంది. దీంతోపాటు Q3 గేమింగ్‌ చిప్‌ ను కూడా అమర్చి ఉంటుంది. ఫలితంగా మెరుగైన గేమింగ్‌ తోపాటు రిటైల్ టైం ఫెర్ఫార్మెన్స్‌ కూడా బాగుంటుందని తెలుస్తోంది. ఈ చిప్‌సెట్ LPDDR5x ర్యామ్, UFS 4.1 స్టోరేజీతో జతచేసి ఉంటుంది.

7000mAh భారీ బ్యాటరీ :
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 16 పైన పనిచేస్తుంది. భారత్‌ లో ఈ OS ఫుల్‌ వెర్షన్‌ విడుదల కావాల్సి ఉంది. ఈ ఫోన్‌ 100W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఫలితంగా ఎక్కువ సమయం బ్యాటరీ లైఫ్‌ ను అందిస్తుంది.

నాలుగు 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు మూడు కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (OIS) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్, 3x జూమ్‌ తో పెరిస్కోప్‌ టెలిఫోటో లెన్స్‌ ను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఐకూ ఫోన్ 50MP కెమెరాను అమర్చి ఉంటుంది.

IP68. IP69 రేటింగ్‌ :
ఈ ఐకూ హ్యాండ్‌సెట్ సెక్యూరిటీ కోసం అల్ట్రాసోనిక్‌ ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ను కలిగి ఉంటుంది. మరియు ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌ కూడా ఉంటుంది. ఈ ఫోన్ IP68, IP69 రేటింగ్‌ తో వాటర్‌, డస్ట్‌ రెసిస్టెంట్‌ గా ఉంటుంది. అయితే ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
iQOO 15 Smartphone launch timeline tipped in india here are the specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X