అదిరిపోయే స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లతో ఇవాళే ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ విడుదల...!
iQOO 15 Smartphone Launch : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ ఐకూ భారత్ మార్కెట్‌లో ఇవాళ ఐకూ 15 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ అక్టోబర్ నెలలోనే చైనా మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. భారత్‌లో ఇవాళ లాంచ్ కానుంది. ఈ ఫోన్ గురించి ఇప్పటికే అనేక వివరాలు వెల్లడయ్యాయి.
ఎప్పుడు లాంచ్ కానుంది? :
భారత్ లో ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ లాంచ్ ఈవెంట్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. ఐకూ ఇండియా యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ చూడవచ్చు. అమెజాన్ ద్వారా ఈ ఫోన్ భారత్ మార్కెట్‌లో అందుబాటులోకి వస్తుంది.

ఇటీవల వచ్చిన కొన్ని లీక్స్ ఆధారంగా భారత్‌లో ఐకూ 15 ఫోన్ 12GB ర్యామ్+ 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.72,999, 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.79,999 గా ఉంటుందని అంచనా వేస్తు్న్నారు.
ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ ఫోన్ శాంసంగ్ అడ్వాన్స్‌డ్ 2K M14 LEAD OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 2000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. డాల్బీ విజన్‌ను సపోర్టు చేస్తుంది.
7 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్ LPDD5x అల్ట్రా ర్యామ్, UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 5 సంవత్సరాల వరకు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని ఐకూ చెబుతోంది.
ట్రిపుల్ కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 50MP IMX921 ప్రైమరీ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరా కూడా ఉంటుంది.
ఈ హ్యాండ్‌సెట్ 100W వైర్, 40W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు ఐకూ సంస్థకు చెందిన సూపర్‌కంప్యూటింగ్ చిప్ Q3 కూడా ఉంటుంది. దీంతోపాటు 8000 Sq mm వేపర్ కూలింగ్ ఛాంబర్‌ను కూడా కలిగి ఉంటుంది.
గేమింగ్ కోసం గేమ్ లైవ్ స్ట్రీమింగ్ అసిస్టెంట్ కూడా ఉంటుంది. దీని ద్వారా ఎటువంటి అదనపు గేమింగ్ హార్డ్‌వేర్ అవసరం లేదని తెలుస్తోంది. ఇవాళ విడుదల సమయంలో మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. దీంతోపాటు డిస్‌ప్లే సైజ్, స్టోరేజీ సహా ధర వివరాలను తెలియనున్నాయి.
స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ జెన్ 5 చిప్‌సెట్ తో ఇప్పటికే భారత్‌లో ఒప్పో, వన్‌ప్లస్, రియల్‌మి సంస్థలు తమ ఫోన్‌లను లాంచ్ చేశాయి. మరియు సుమారుగా ఇదే ధర రేంజ్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఇవాళ మధ్యా్హ్నం 12 గంటల తర్వాత ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ గురించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.


Click it and Unblock the Notifications








