ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ విడుదలపై కీలక వివరాలు.. ఆండ్రాయిడ్ 16 OS, లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్!
iQOO 15 Smartphone India Launch : ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ చైనాలో ఇటీవల విడుదల అయింది. స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ జెన్ 5 చిప్ సెట్ తో పనిచేస్తుంది. మరియు భారీ బ్యాటరీని కలిగి ఉంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్ లో త్వరలో విడుదల కానుంది. తాజాగా ఈ ఫోన్ అమెజాన్ లో లిస్టింగ్ అయింది. దీని ఆధారంగా మరిన్ని కీలక వివరాలు వెల్లడయ్యాయి.
ఎప్పుడు విడుదల కానుంది :
ఐకూ 15 స్మార్ట్‌ఫో న్ విడుదలపై ఇటీవల ఐకూ ఇండియా సీఈవో నిపున్ మార్యా కీలక ప్రకటన చేశారు. భారత్ లో ఈ ఫోన్ నవంబర్ నెలలో విడుదల కానుందని తెలిపారు. అయితే తాజాగా అమెజాన్ లిస్టింగ్ ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ నవంబర్ విడుదలను ధ్రువీకరించినట్లు అయింది. అయితే ఏ తేదీన విడుదల కానుందనే కచ్చితమైన వివరాలు వెల్లడి కాలేదు.

ఆండ్రాయిడ్ 16 ఆధారిత OS :
ఐకూ 15 హ్యాండ్‌సెట్ ఇండియాలో క్వాల్‌కాం నుంచి ఇటీవలే లాంచ్ అయిన స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ జెన్ 5 చిప్ సెట్ తో పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే అమెజాన్ లిస్టింగ్ ఆధారంగా ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.60,000 గా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇటీవలే చైనాలో విడుదల :
చైనాలో మార్కెట్ లో ఈ ఫోన్ ఇటీవలే విడుదల అయింది. ఈ ఫోన్ చైనా వేరియంట్ 144Hz రీఫ్రెష్ రేట్‌తో 6.85 అంగుళాల 2K శాంసంగ్ M14 అమోలెడ్ 8T LTPO డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 2160PWM డిమ్మింగ్ ను కలిగి ఉంది.
స్నాప్‌డ్రాగన్ లేటెస్ట్ చిప్‌సెట్ :
చైనా వేరియంట్ హ్యాండ్‌సెట్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 Elite జెన్ 5 SoC ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 16GB LPDDR4x అల్ట్రా ర్యామ్, 1TB UFS 4.1 స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత Origin OS 6 పైన పనిచేస్తుంది.

కెమెరా విభాగం పరంగా ట్రిపుల్ కెమెరా యూనిట్ తో అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ( OIS ) సపోర్టుతో 50MP సోనీ IMX921 ప్రైమరీ కెమెరా, 50MP శాంసంగ్ JN1 అల్ట్రావైడ్ లెన్స్, 3x జూమ్ తో 50MP సోనీ IMX882 టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. 32MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.
7000mAh బ్యాటరీ :
ఈ ఫోన్ 100W వైర్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh భారీ బ్యాటరీతో పనిచేస్తుంది. IP68, IP69 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. సెక్యూరిటీ కోసం 3D అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో అందుబాటులోకి వచ్చింది.


Click it and Unblock the Notifications







