Home
Mobile

ఐకూ 15 స్మార్ట్‌ఫోన్‌ను ముందస్తు బుకింగ్‌.. అదనపు వారంటీ సహా అనేక ప్రయోజనాలు..!

iQOO 15 Smartphone : ఐకూ 15 స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌ లో నవంబర్‌ 26 వ తేదీన లాంచ్‌ కానుంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్‌ కు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఇటీవలే ధర వివరాలు లీక్‌ అయ్యాయి. అయితే ఐకూ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ హ్యాండ్‌సెట్‌ ను విడుదలకు ముందే బుకింగ్‌ చేసుకొనే అవకాశం కల్పించింది.

ఈ తేదీ నుంచి ముందస్తు బుకింగ్‌ చేసుకోవచ్చు :
ఐకూ 15 స్మార్ట్‌ఫోన్‌ ను నవంబర్‌ 20 నుంచి ముందస్తు బుకింగ్‌ చేసుకోవచ్చని సంస్థ వెల్లడించింది. ప్రయారిటీ పాస్‌ను (Priority Pass) రూ.1000 చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చని ఐకూ చెబుతోంది. ఈ పాస్‌లను పరిమిత సంఖ్యలోనే అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపింది.

iQOO 15 Smartphone Pre Bookings

అదనపు వారంటీ :
ఈ పాస్‌ కొనుగోలు చేసినవారు 12 నెలలపాటు అదనపు వారంటీని పొందవచ్చు. ఐకూ TWS 1e ఇయర్‌బడ్స్‌ను ఉచితంగా పొందవచ్చని తెలిపింది. ఐకూ 15 స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర సుమారుగా రూ.60,000 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
ఈ హ్యాండ్‌సెట్ 2K M14 LEAD OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్‌ లో తొలి 2K డిస్‌ప్లే మోడల్‌గా ఐకూ 15 నిలుస్తుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే 144Hz రీఫ్రెష్‌ రేట్‌, 6000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే డాల్బీ విజన్‌ను సపోర్టు చేస్తుంది.

స్నాప్‌డ్రాగన్‌ లేటెస్ట్‌ ప్రాసెసర్ :
ఈ హ్యాండ్‌సెట్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 8 ఇలైట్‌ జెన్‌ 5 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. మరియు ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOs 6 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 5 సంవత్సరాల OS అప్‌డేట్స్‌, 7 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని తెలుస్తోంది.

గేమింగ్‌ చిప్‌! :
ఈ హ్యాండ్‌సెట్‌ Q3 సూపర్‌ కంప్యూటింగ్‌ చిప్‌ను కూడా కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతో తక్కువ లేటెన్సీలో 144fps ను అందిస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ ఫోన్‌ 8K VC కూలింగ్‌ సిస్టమ్‌, రే ట్రాసింగ్‌ టెక్నాలజీని కూడా కలిగి ఉంటుంది.

కెమెరాల వివరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 50MP సోనీ IMX921 VCS ప్రైమరీ కెమెరా, 50MP సోనీ IMX882 పెరిస్కోప్‌ టెలిఫోటో లెన్స్‌, 50MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP కెమెరాను అమర్చి ఉంటుంది.

ఈ హ్యాండ్‌సెట్‌ 40W వైర్‌లెస్‌ ఛార్జింగ్, 100W ఫ్లాష్‌ స్టోరేజీ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ IP68, IP69 రేటింగ్‌ తో కూడిన డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంటుంది. ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ను కలిగి ఉంటుంది. 5G, 4G, బ్లూటూత్‌, వైఫై, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
iQOO 15 Smartphone Pre Bookings to open from november 20 in india, check full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X