Home
Mobile

ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ ధర వివరాలు లీక్‌.. 7000mAh భారీ బ్యాటరీ, పవర్‌ఫుల్‌ చిప్‌సెట్‌ సహా...!

iQOO 15 Smartphone : ఐకూ 15 స్మా్ర్ట్‌ఫోన్ భారత్‌ మార్కెట్‌ లో నవంబర్ 26 వ తేదీన విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 ఇలైట్‌ జెన్‌ 5 ప్రాసెసర్‌ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ తో ఇప్పటికే వన్‌ప్లస్‌ 15, రియల్‌మి GT 8 ప్రో మోడల్స్‌ భారత్‌ లో లాంచ్‌ అయ్యాయి. తాజాగా ఈ ఫోన్‌ ధర వివరాలు లీక్‌ అయ్యాయి. ఈ ఫోన్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు.

ధర వివరాలు లీక్‌ :
ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ ధర వివరాలను టిప్‌స్టర్‌ డిబయన్‌ రాయ్‌ (గ్యాడ్జెట్స్‌డేటా) వెల్లడించారు. ఈ ఫోన్‌ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.72999, 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.79999 గా ఉంటుందని తెలిపారు.

iQOO 15 Smartphone

భారత్‌ మార్కెట్‌లో ఇటీవల విడుదల అయిన వన్‌ప్లస్‌ 15, రియల్‌మి GT 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌ లు ఇదే ధరలో అందుబాటులోకి వచ్చాయి. అయితే ఐకూ ఫోన్‌ ధరపై సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఈ ఫోన్‌ ముందస్తు బుకింగ్‌ చేసుకొనేందుకు అందుబాటులో ఉంది.

ఐకూ 15 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
ఈ హ్యాండ్‌సెట్‌ శాంసంగ్‌ 2K M14 OLED డిస్‌ప్లేతో అందుబాటులో ఉంటుంది. 2600 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. డాల్బీ విజన్‌ సపోర్టు చేస్తుంది. మిగిలిన వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

క్వాల్‌కాం లేటెస్ట్‌ చిప్‌సెట్‌ :
ఈ హ్యాండ్‌సెట్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్‌ జెన్ 5 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌ LPDDR5x ‌అల్ట్రా ర్యామ్‌, UFS 4,1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌ సూపర్ కంప్యూటింగ్‌ చిప్‌ Q3 ను కూడా కలిగి ఉంటుంది. దీంతోపాటు 8000 sq mm వేపర్‌ ఛాంబర్‌ను కూడా కలిగి ఉంటుంది.

ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 16 OS ఆధారిత OriginOs 6 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 5 సంవత్సరాల వరకు OS అప్‌డేట్స్‌ను పొందుతుంది. దీంతోపాటు 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తుంది. రెండు స్టోరేజీ వేరియంట్స్‌లో లాంచ్ కానుందని తెలుస్తోంది.

మూడు కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. 50MP సోనీ IMX921 ప్రైమరీ కెమెరా, 3x ఆప్టికల్‌ జూమ్‌తో 50MP పెరిస్కోప్‌ టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రావైడ్‌ కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరా ఉంటుంది.

ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ 100W వైర్‌ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 40W వైర్‌లెస్ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. ఇండియా మార్కెట్‌లో ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ అల్ఫా, లెజెంట్‌ కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. మరియు నవంబర్ 27 వ తేదీన సేల్‌ ప్రారంభం కానుందని తెలుస్తోంది.

Best Mobiles in India

English summary
iQOO 15 Smartphone price leaked ahead of launch on november 26 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X