Home
Mobile

ఒక రోజు ముందుగానే విడుదలకానున్న iQOO 15 స్మార్ట్‌ఫోన్‌.. ఆండ్రాయిడ్‌ 16 OS సహా..!

iQOO 15 Smartphone : ఐకూ 15 స్మార్ట్‌ఫోన్‌ నవంబర్‌ నెలలో భారత్‌ మార్కెట్‌ లో విడుదల కానుంది. ఈ ఫోన్ నవంబర్‌ 27 వ తేదీన భారత్‌ లో లాంచ్‌ కానుందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ హ్యాండ్‌సెట్‌ విడుదల తేదీని X ప్లాట్‌ఫాం ద్వారా ఐకూ అధికారికంగా వెల్లడించింది. ఐకూ 13 స్మార్ట్‌ఫోన్‌ కు తర్వాత తరం వెర్షన్‌ గా ఈ హ్యాండ్‌సెట్‌ లాంచ్‌ అవుతోంది. ఈ హ్యాండ్‌సెట్‌ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 16 OS పైన పనిచేస్తుంది. ఈ ఐకూ ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.

ఎప్పుడు విడుదల కానుంది :
ఐకూ ఇండియా X హ్యాండిల్‌ ఆధారంగా ఐకూ 15 స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ లో నవంబర్‌ 26 వ తేదీన లాంచ్ కానుంది. ఈ ఫోన్ అమెజాన్ ద్వారా అందుబాటులోకి రానుంది. రూ.50 వేల ధర రేంజ్‌లో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ చైనాలో సేల్‌ ప్రారంభం అయింది. దీని ఆధారంగా అనేక వివరాలు వెల్లడయ్యాయి.

iQOO 15 Smartphone set to launch on November 26 in india

లేటెస్ట్‌ ప్రాసెసర్ :
భారత్‌లో ఐకూ 15 స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 ఇలైట్‌ జెన్ 5 చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ ఇటీవలే విడుదల అయింది. ప్రస్తుతం స్నాప్‌డ్రాగన్‌ లో శక్తివంతమైన చిప్‌ గా ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 పైన పనిచేస్తుంది.

చైనా వేరియంట్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ హ్యాండ్‌సెట్ ఇటీవలే చైనా మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. ఐకూ 15 చైనా వేరియంట్‌ 6.85 అంగుళాల 2K శాంసంగ్ M14 అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 144Hz రీఫ్రెష్‌ రేట్, 130Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌, 508 ppi పిక్సల్‌ డెన్సిటీని కలిగి ఉంది.

ఈ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 ఇలైట్ జెన్ 5 చిప్‌సెట్ ను కలిగి ఉంది. దీంతోపాటు Adreno 840 GPU, Q3 గేమింగ్‌ చిప్‌ను కూడా అమర్చి ఉంది. స్నాప్‌డ్రాగన్‌ చిప్‌.. 16GB LPDDR5x అల్ట్రా ర్యామ్, 1TB UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత Origin OS 6 పైన పనిచేస్తుంది.

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు మూడు కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 50MP పెరిస్కోప్‌ టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్‌ లెన్స్‌ ను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్‌ 100W వైర్, 40W వైర్‌లెస్‌ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. IP68, IP69 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది. చైనాలో 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 16GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్స్‌ లో అందుబాటులో ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
iQOO 15 Smartphone set to launch on November 26 in india with latest snapdragon chipset
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X