iQOO 15 Smartphone Sale : ఇవాళ్టి నుంచే ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ సేల్.. ఏకంగా 7 వేల డిస్కౌంట్ సహా..!
iQOO 15 Smartphone Sale : ఐకూ నుంచి భారత్ మార్కెట్‌లో ఇటీవలే ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ జెన్ 5 చిప్, 7 సంవత్సరాల అప్‌డేట్స్, ఆండ్రాయిడ్ 16 OS, 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ సేల్ ఇవాళ్టి మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌లు, సేల్ పూర్తి వివరాలు.
రూ.7 వేల డిస్కౌంట్ :
ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.72,999, 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.79,999 గా ఉంది. ఐకూ ఇండియా, అమెజాన్ లో కొనుగోలు చేయవచ్చు. HDFC, యాక్సెస్ బ్యాంకు కార్డులపై రూ.7000 డిస్కౌంట్‌ను అందిస్తోంది.

దీంతోపాటు అన్ని బ్యాంకుల కార్డులపై అదనంగా రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. అంటే మొత్తంగా రూ.8 వేల వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఎక్స్చేంజీపై రూ.7 వేల తగ్గింపును పొందవచ్చు. 24 నెలల వరకు నోకాస్ట్ EMI సదుపాయాన్ని అందిస్తోంది.
2K డిస్‌ప్లే :
ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ 144Hz రీఫ్రెష్ రేట్‌తో 6.85 అంగుళాల శాంసంగ్ M14 8T LTPO 2K అమోలెడ్ ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 6000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 508 ppi పిక్సెల్ డెన్సిటీ, Always On Display ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే వెట్ ఫింగర్ కంట్రోల్ ఫీచర్‌ను కలిగి ఉంది.
ఈ డిస్‌ప్లే డాల్బీ విజన్ సపోర్టును కూడా కలిగి ఉంది. IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ లెజెండ్ కలర్ వేరియంట్ వెనుక వైపు గ్లాస్ ప్యానల్‌ను కలిగి ఉంది. అదే అల్ఫా బ్లాక్ వేరియంట్ ఫైబర్ గ్లాస్ ప్యానల్‌ను కలిగి ఉంది.

శక్తవంతమైన చిప్‌సెట్! :
ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ ఇటీవల లాంచ్ అయిన క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 16GB LPDDR5x ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. Adreno GPU, సూపర్ కంప్యూటింగ్ Q3 చిప్ కూడా ఉంది.
7 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ ఫోన్ థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం 8000 sq mm తో 8K VC కూలింగ్ సిస్టమ్ ను కలిగి ఉంది. PC గ్రేడింగ్ రే ట్రేసింగ్ టెక్నాలజీ, గేమ్ లైవ్ స్ట్రీమింగ్ అసిస్టెంట్ ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 పైన పనిచేస్తుంది. 5 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
కెమెరా విభాగం పరంగా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP సోనీ IMX921 ప్రైమరీ కెమెరా ఉంది. దీంతోపాటు 3x ఆప్టికల్ జూమ్, 3.7x లాస్‌లెస్ జూమ్, 100x జూమ్‌తో 50MP సోనీ IMX882 టెలిఫోటో లెన్స్ ఉంది. 50MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ కెమెరాలు 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తాయి.
7000mAh బ్యాటరీ :
ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ 100W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. 40W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ ను కూడా సపోర్టు చేస్తుంది. 5G, 4G, బ్లూటూత్, వైఫై, USB-C ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








