Home
Mobile

6.85 అంగుళాల భారీ డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్‌ జెన్‌ 5 చిప్‌సెట్‌తో 5G స్మార్ట్‌ఫోన్..!

iQOO 15 Smartphone Launched : ఐకూ 15 స్మా్ర్ట్‌ఫోన్ భారత్‌ మార్కెట్లో లాంచ్‌ అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ 7000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్‌ 8 ఇలైట్‌ జెన్‌ 5 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీంతోపాటు 144Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 16 OS పైన పనిచేస్తుంది. మరియు ఏకంగా 7 సంవత్సరాల వరకు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌ను పొందుతుంది. ఈ ఫోన్‌ తొలి సేల్‌లో భాగంగా భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు.

ఐకూ 15 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ హ్యాండ్‌సెట్‌ 6.85 అంగుళాల శాంసంగ్‌ M14 8T LTPO 2K అమోలెడ్‌ తో లాంచ్ అయింది. ఈ డిస్‌ప్లే 144Hz రీఫ్రెష్‌ రేట్‌, 6000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 508 ppi పిక్సెల్‌ డెన్సిటీ ను కలిగి ఉంది. ఈ ఫోన్ 1Hz Always On Display ను కలిగి ఉంది.

iQOO 15 Smartphone with snapdragon 8 elite gen 5 chip launched in india

ఈ ఫోన్‌ అల్ఫా బ్లాక్‌ కలర్‌ వేరియంట్ ఫోన్‌ వెనుక వైపు ఫైబర్‌ గ్లాస్‌ ప్యానల్‌, అదే లెజెండ్‌ కలర్‌ వేరియంట్‌ వెనుక వైపు గ్లాస్‌ ప్లానల్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే యాంటీ రీఫ్లెక్టి్వ్‌ ఫిల్మ్, వెట్‌ ఫింగర్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. దీంతోపాటు ట్రిపుల్‌ యాంబియంట్‌ లైట్‌ సెన్సర్‌లను కలిగి ఉంది.

స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్‌ జెన్‌ 5 చిప్‌సెట్‌ :
ఈ ఫోన్‌ క్వాల్‌కాం ఆక్టా కోర్‌ 3nm స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్‌ జెన్‌ 5 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌ 16GB LPDDR5x ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. దీంతోపాటు Adreno GPU ను కూడా కలిగి ఉంది. ఈ ఫోన్‌ 4.18 మిలియన్‌ AnTuTU స్కోర్‌ను కలిగి ఉందని ఐకూ తెలిపింది.

iQOO 15 Smartphone with snapdragon 8 elite gen 5 chip launched in india

7 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 పైన పనిచేస్తుంది. ఈ ఐకూ ఫోన్ 5 సంవత్సరాల ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. దీంతోపాటు థర్మల్‌ మేనేజ్‌మెంట్‌ కోసం 8000 sq mm తో 8K VC కూలింగ్‌ సిస్టమ్‌ ను కలిగి ఉంది.

కెమెరాల వివరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP సోనీ IMX921 ప్రైమరీ కెమెరా ఉంది. 3x ఆప్టికల్‌ జూమ్‌, 3.7x లాస్‌లెస్‌ జూమ్‌, 10x జూమ్‌ సామర్థ్యాలతో 50MP సోనీ IMX882 కెమెరా, 50MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా కూడా ఉంది.

ఈ ఫోన్‌ సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 90 డిగ్రీల ఫీల్డ్ వ్యూతో 32MP కెమెరాను అమర్చి ఉంది. ఈ కెమెరాలు 60fps వద్ద 4K వీడియోలను రికార్డు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ ఫోన్‌ 100W వైర్‌, 40W వైర్‌లెస్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh సిలికాన్ కార్బన్‌ బ్యాటరీని కలిగి ఉంది.

ఏకంగా రూ.7 వేల డిస్కౌంట్‌తోపాటు :
ఐకూ 15 స్మార్ట్‌ఫోన్‌ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.72,999, 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.79,999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.7000 డిస్కౌంట్‌ను పొందవచ్చని ఐకూ తెలిపింది. దీంతోపాటు కూపన్‌ రూ.1000 డిస్కౌంట్‌ ను కూడా అందిస్తోంది.

ఈ డిస్కౌంట్‌లతో ఫోన్‌ను రూ.64999 ధరకే కొనుగోలు చేయవచ్చు. అదే టాప్ ఎండ్‌ వేరియంట్‌ను రూ.71999 ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ అల్ఫా బ్లాక్‌, లెజెండ్ కలర్‌ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది.

ఈ ఐకూ 15 స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ డిసెంబర్‌ 1 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ప్రయారిటీ పాస్ కొనుగోలు చేసిన యూజర్లు నవంబర్ 27 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచే ఈ ఫోన్‌ అందుబాటులో ఉంటుంది. IP68, IP69 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
iQOO 15 Smartphone with snapdragon 8 elite gen 5 chip, 7000mAh battery launched in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X