Home
Mobile

శక్తివంతమైన చిప్, భారీ బ్యాటరీతో ఐకూ 15 స్మార్ట్‌ఫోన్‌ విడుదల.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు!

ఐకూ 15 స్మా్ర్ట్‌ఫోన్‌ చైనాలో విడుదల అయింది. ఇటీవలే అందుబాటులోకి వచ్చిన స్నాప్‌డ్రాగన్‌ 8 ఇలైట్‌ జెన్‌ 5 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 7000mAh భారీ బ్యాటరీని కూడా కలిగి ఉంది. డిజైన్‌ పరంగానూ ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకుంటుంది. కెమెరా విభాగం పరంగా 50MP టెలిఫోటో కెమెరా సహా మరిన్ని కెమెరాలున్నాయి. ఈ ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల పూర్తి వివరాలు.

ఐకూ 15 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఈ స్మార్ట్‌ఫోన్‌ (iQOO 15 Smartphone) 6.85 అంగుళాల 2K శాంసంగ్‌ M14 అమోలెడ్‌ 8T LTPO డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 144Hz రీఫ్రెష్‌ రేట్‌, 2600 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌, 2160PWM డిమ్మింగ్‌ ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ యాంటీ రిఫ్లెక్షన్‌ కోటింగ్‌ ను కలిగి ఉంది.

iQOO 15 Smartphone with snapdragon 8 Elite Gen 5 chipset launched  full details

శక్తివంతమైన చిప్‌సెట్! :
ఈ ఐకూ స్మార్ట్‌ఫోన్‌ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 8 Elite జెన్‌ 5 SoC చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ 16GB LPDDR4x అల్ట్రా ర్యామ్, 1TB UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌ Adreno 840 GPU, Q3 గేమింగ్‌ చిప్‌సెట్‌ను కూడా కలిగి ఉంది. గేమింగ్‌, గ్రాఫిక్స్‌ టాస్క్‌ల కోసం అమర్చారు.

ఆండ్రాయిడ్ 16, 7000mAh బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత Origin OS 6 పైన పనిచేస్తుంది. అయితే ఈ ఫోన్ 100W వైర్‌ ఛార్జింగ్‌, 40W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 7000mAh భారీ బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ పవర్‌ అడాప్టర్‌లతో తక్కువ సమయంలోనే ఛార్జింగ్‌ పూర్తి చేయవచ్చు.

మూడు కెమెరాలు సహా :
కెమెరా విభాగం పరంగా ఈ ఐకూ 15 స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP సోనీ IMX921 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 50MP శాంసంగ్‌ JN1 అల్ట్రావైడ్‌ లెన్స్‌ మరియు 3x జూమ్‌తో 50MP సోనీ IMX882 టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది.

సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌ ముందు వైపు 32MP కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ ఫోన్‌ అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను కలిగి ఉంది. IP68, IP69 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్‌ 8.28 mm థిక్‌నెస్‌ను కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్ బ్లూటూత్‌ 6.0, వైఫై 7, NFC, IR బ్లాస్టర్‌ వంటి ఫీచర్లను కలిగి ఉంది. మెరుగైన ఆడియో అవుట్‌పుట్ కోసం డ్యూయల్‌ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. భద్రత కోసం 3D అల్ట్రాసోనిక్‌ ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ను అమర్చి ఉంది.

ఐకూ 15 స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం చైనాలోనే అందుబాటులోకి వచ్చింది. చైనా మార్కెట్‌లో 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర 4199 Yuan (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.51,775), 16GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర 4499 Yuan (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.55,474) గా ఉంది.

ఈ ఫోన్ 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర 4699 Yuan (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.61,639) గా ఉంది. అయితే ఈ ఫోన్ భారత్‌ మార్కెట్‌లో నవంబర్‌ నెలలో విడుదల కానుంది. అయితే కచ్చితమైన విడుదల తేదీ వెల్లడి కాలేదు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
iQOO 15 Smartphone with snapdragon 8 Elite Gen 5 chipset launched, full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X