50MP + 50MP + 50MP కెమెరాలు, శక్తివంతమైన ప్రాసెసర్, 7000mAh బ్యాటరీ ఫోన్‌పై రూ.4000 డిస్కౌంట్!
iQOO 15 Smartphone : ఐకూ ఇండియా నుంచి ఫిబ్రవరి 24 వ తేదీన ఐకూ 15R స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్ లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ గురించి అనేక వివరాలు వెల్లడయ్యాయి. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. దీంతోపాటు భారీ బ్యాటరీతో పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే గత సంవత్సరం చివర్లో లాంచ్ అయిన ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ ను ప్రస్తుతం భారీ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు.
రూ.4000 డిస్కౌంట్ :
ప్రస్తుతం అమెజాన్ లో ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.72,998, 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.79,998 గా ఉంది. ఐకూ క్వస్ట్ సేల్ లో భాగంగా ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.4000 డిస్కౌంట్ ను పొందవచ్చు.

ఫలితంగా ఈ ఫోన్‌ను రూ.68998, రూ.75998 ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఐకూ స్మార్ట్‌ఫోన్ లెజెండ్, అల్పా కలర్ వేరియంట్స్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. వేరియంట్‌ను బట్టి గ్లాస్, ఫైబర్ గ్లాస్ ప్యానల్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ IP68, IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ 6.85 అంగుళాల శాంసంగ్ M14 8T LTPO 2K అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 144Hz రీఫ్రెష్ రేట్, 6000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 508 ppi పిక్సెల్ డెన్సిటీని కలిగి ఉంది. దీంతోపాటు Always On Display, వెట్ టచ్ ఫీచర్ కూడా ఉంది.
7 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ జెన్ 5 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 16GB LPDDR5X ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 పైన పనిచేస్తోంది. 5 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టు :
ఈ ఫోన్ Adreno GPU, Q3 సూపర్ కంప్యూటింగ్ చిప్‌ను అమర్చి ఉంది. థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం 8000 mm Sq తో 8K VC కూలింగ్ సిస్టమ్ ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 100W వైర్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
50MP + 50MP + 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ IMX921 ప్రైమరీ కెమెరా ఉంది. దీంతోపాటు 3X ఆప్టికల్ జూమ్, 100X జూమ్‌తో 50MP సోనీ IMX882 టెలిఫోటో లెన్స్ ఉంది. 50MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను అమర్చారు. ఈ కెమెరా 4K వీడియో రికార్డింగ్ సపోర్టును కలిగి ఉన్నాయి.


Click it and Unblock the Notifications








