Home
Mobile

శక్తివంతమైన ప్రాసెసర్‌, 7400mAh బ్యాటరీ, సూపర్‌ డిస్‌ప్లే, కెమెరాలతో ఐకూ 15 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ విడుదల..!

iQOO 15 Ultra Smartphone : ఐకూ 15 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. మెరుగైన పనితీరును అందించే విధంగా ఈ హ్యాండ్‌సెట్‌ను తీసుకొచ్చింది. ఈ హ్యాండ్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్‌ జెన్‌ 5 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 2K డిస్‌ప్లేను కలిగి ఉంది. 50MP పెరిస్కోప్‌ టెలిఫోటో లెన్స్‌ ఉంది. 7400mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు.

2K డిస్‌ప్లే :
ఐకూ 15 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.85 అంగుళాల 2k శాంసంగ్‌ అమోలెడ్‌ M14 LTPO డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 2600 నిట్స్‌ పీక్ బ్రైట్‌నెస్‌, 508 PPI డెన్సిటిని కలిగి ఉంది.

iQOO 15 Ultra smartphone

శక్తివంతమైన చిప్‌ :
ఈ హ్యాండ్‌సెట్‌ 3nm స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్‌ జెన్‌ 5 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌ LPDDR5x ర్యామ్, UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. దీంతోపాటు Adreno 840 GPU, Q3 గేమింగ్‌ చిప్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత Origin OS 6 పైన పనిచేస్తుంది.

50MP, 50MP, 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా OIS సపోర్టుతో 50MP సోనీ IMX921 ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్‌ లెన్స్ మరియు 3x ఆప్టికల్ జూమ్‌, OIS సపోర్టుతో 50MP పెరిస్కోప్‌ టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాతో అందుబాటులోకి వచ్చింది.

7400mAh బ్యాటరీ :
ఐకూ 15 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ 100W వైర్‌, 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్టుతో 7400mAh బ్యాటరీని కలిగి ఉంది. USB-C 3.2 జెన్ 1 ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. IP68, IP69 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ను కలిగి ఉంది.

ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ చైనా మార్కెట్‌లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. భారత కరెన్సీ ప్రకారం ప్రారంభ ధర రూ.74300 గా ఉంది. 16GB/256GB, 16GB/512GB, 16GB/1TB, 24GB/1TB స్టోరేజీ వేరియంట్స్‌లో చైనా మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. భారత్‌లో విడుదలపై ప్రస్తుతానికి ఎటువంటి సమాచారం లేదు.

* భారత్ మార్కెట్‌లో ఐకూ 15R స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి 24 వ తేదీన విడుదల కానుంది. ఈ ఫోన్ ఫ్లాగ్‌షిప్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్ 8 జెన్‌ 5 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీంతోపాటు Q2 సూపర్‌ కంప్యూటింగ్‌ చిప్‌ను కూడా కలిగి ఉంటుంది. BGMI 144 FPS ను సపోర్టు చేస్తుంది.

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 పైన పనిచేస్తుంది. 4 ఆండ్రాయిడ్ OS, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 6.5k ఐస్‌కోర్‌ వీసీ కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఏకంగా 7600mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 100W ఫ్లాష్‌ ఛార్జింగ్‌, అడ్వాన్సడ్‌ బైపాస్‌ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
iQOO 15 Ultra smartphone with snapdragon 8 gen 5 Chipset launched in china
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X