iQOO 15R స్మార్ట్‌ఫోన్ డిజైన్ విడుదల.. లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్‌ల అంచనా వివరాలు..!
iQOO 15R Smartphone : భారత్ మార్కెట్ లో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ ఐకూ నుంచి ఇటీవలే ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. ఈ ఫోన్ క్వాల్‌కాం లేటెస్ట్ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 తో పనిచేస్తోంది. దీంతోపాటు ఆకట్టుకొనే డిజైన్, స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లను కలిగి ఉంది. ఇదే సిరీస్ లో ఐకూ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. తాజాగా ఇందుకు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించింది.
ఐకూ 15R స్మార్ట్‌ఫోన్‌ను భారత్ మార్కెట్ లో విడుదల కానుంది. ఐకూ ఇండియా సీఈవో సీఈవో నిపున్ మార్య ఈ వివరాలను వెల్లడించారు. ఈ ఫోన్ విడుదల తేదీ వివరాలను వెల్లడించకపోయినా, వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

రూ.45 వేల ధర రేంజ్‌లో :
ఐకూ 15R డిజైన్‌ను సంస్థ విడుదల చేసింది. ఈ డిజైన్ ఇటీవల చైనా మార్కెట్‌లో విడుదల అయిన ఐకూ Z11 టర్బో మోడల్ తరహాలో ఉంది. ఫలితంగా చైనా వేరియంట్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. భారత్ మార్కెట్‌లో ఐకూ 15R స్మార్ట్‌ఫోన్ సుమారుగా రూ.45 వేల ధర రేంజ్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఐకూ 15R స్మార్ట్‌ఫోన్ అంచనా స్పెసిఫికేషన్‌ల వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్ 144Hz రీఫ్రెష్ రేట్‌తో 6.59 అంగుళాల 1.5K ఫ్లాట్ OLED LPPS డిస్‌ప్లేను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ డిస్‌ప్లే 5000 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది.
Power that fits just right, #ComingSoon! #iQOO15R pic.twitter.com/uJ4DYGQoOr
— Nipun Marya (@nipunmarya) January 20, 2026
స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్ :
ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌తో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఈ చిప్ 16GB LPDDR5x అల్ట్రా ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజీతో జతచేసి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 పైన పనిచేస్తుందని తెలుస్తోంది.
దీంతోపాటు గేమింగ్ చిప్‌ను కూడా అమర్చి ఉంటుందని తెలుస్తోంది. గ్రాఫిక్ టాస్క్‌లను సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా ఈ చిప్‌ను వినియోగిస్తున్నట్లు సమాచారం.
కెమెరా విభాగం పరంగానూ ఈ హ్యాండ్‌సెట్ ఏకంగా 200MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ ప్రైమరీ కెమెరా OIS )ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టును కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు 8MP అల్ట్రావైడ్ లెన్స్, 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
బ్యాటరీ పరంగా ఈ హ్యాండ్‌సెట్ 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7600mAh బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది. IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే 3D అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను అమర్చి ఉంటుందని తెలుస్తోంది.
ఐకూ 15R అంచనా స్పెసిఫికేషన్లు, ఫీచర్లపై ఐకూ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. త్వరలో ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








