Home
Mobile

ఐకూ 15R స్మార్ట్‌ఫోన్‌ చిప్‌సెట్‌ వివరాలు వెల్లడి.. స్పెసఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు..!

iQOO 15R Smartphone : ఐకూ 15R స్మార్ట్‌ఫోన్ భారత్‌ మార్కెట్‌ లో ఫిబ్రవరి 24 వ తేదీన విడుదల కానుంది. ఈ ఫోన్‌ బ్యాక్‌ ప్యానల్‌ డిజైన్‌ ను కూడా ఇటీవల షేర్‌ చేశారు. తాజాగా ఈ ఫోన్‌ చిప్‌సెట్‌ వివరాలు వెల్లడయ్యాయి. X ప్లాట్‌ఫాం ద్వారా ఈ వివరాలను షేర్‌ చేశారు. అయితే చిప్‌సెట్‌ ఆధారంగా ధర వివరాలను అంచనా వేస్తున్నారు.

స్నాప్‌డ్రాగన్‌ చిప్‌ :
ఐకూ 15R స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 5 చిప్‌సెట్‌ తో (Snapdragon 8 Gen 5 Chip) పనిచేస్తుంది. ఈ చిప్‌ 3.5 మిలియన్‌ పాయింట్ల AnTuTu స్కోర్‌ ను కలిగి ఉంటుందని ఐకూ చెబుతోంది. ఐకూ హ్యాండ్‌సెట్‌ భారత్‌ మార్కెట్‌ లో రూ.45 వేల ధర సెగ్మెంట్‌ లో అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.

iQOO 15R smartphone

అమెజాన్ :
భారత్‌ మార్కెట్‌ లో ఐకూ 15R స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌ ద్వారా అందుబాటులోకి వస్తుంది. చైనా మార్కెట్‌ లో ఇటీవల లాంచ్‌ అయిన ఐకూZ11 టర్బో మోడల్‌ కు రీబ్రాండెడ్‌ వెర్షన్‌ గా లాంచ్‌ కానుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ అంశంపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఐకూ 15R స్మార్ట్‌ఫోన్‌ అంచనా స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 144Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.59 అంగుళాల 1.5K ఫ్లాట్‌ LTPS OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ డిస్‌ప్లే 1800 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 4320 PWM డిమ్మింగ్‌ ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఈ హ్యాండ్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్‌ చిప్‌సెట్‌తోపాటు Q2 గేమింగ్‌ చిప్‌ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ స్నాప్‌డ్రాగన్‌ చిప్‌ LPDDR5x అల్ట్రా చిప్‌, UFS 4.1 స్టోరేజీతో జతచేసి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు Adreno 829 GPU ను కూడా కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

200MP కెమెరా! :
ఈ హ్యాండ్‌సెట్ ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలేజైషన్‌ (OIS) సపోర్టుతో 200MP శాంసంగ్ S5KHP5 కెమెరాను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతోపాటు 8MP అల్ట్రావెడ్‌ లెన్స్‌ ఉంటుందని భావిస్తున్నారు. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP కెమెరాతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

7600mAh బ్యాటరీ! :
మెరుగైన కెమెరా ఫీచర్లే కాకుండా భారీ బ్యాటరీని కూడా కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. 100W వైర్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 7600mAh బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది. IP68 + IP69 రేటింగ్‌ తో డస్ట్, వాటర్‌ రెసిస్టెంట్, భద్రత కోసం 3D ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్‌ సెన్సార్‌ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ఐకూ 15R స్మార్ట్‌ఫోన్ విడుదల తేదీ, చిప్‌సెట్‌ వివరాలు మినహా ఇతర స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లపై ఐకూ సంస్థ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ ఫోన్‌ ఫిబ్రవరి 24 న విడుదల కానుంది. అప్పటిలోగా అనేక వివరాలు అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
iQOO 15R smartphone confirmed to launch with snapdragon 8 gen 5 Chip in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X