ఐకూ 15R స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 16 సహా..!
iQOO 15R Smartphone : భారత్ మార్కెట్‌లో ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ నవంబర్ నెలలో లాంచ్ అయింది. డిసెంబర్ తొలివారంలో సేల్ ప్రారంభం అయింది. అయితే త్వరలో ఐకూ 15R స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. ఇటీవలే సంస్థ దీన్ని ధ్రువీకరించింది. అయితే ఎప్పుడు విడుదల కానుందనే వివరాలను మాత్రం వెల్లడి కాలేదు. కేవలం డిజైన్ మాత్రమే వెల్లడయింది. ఈ ఫోన్ గీక్‌బెంచ్‌లో లిస్టింగ్ అయినట్లు తెలిసింది.
స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ :
టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ఈ వివరాలను వెల్లడించారు. ఈ ఐకూ 15R స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలను X హ్యాండిల్ ద్వారా టిప్‌స్టర్ షేర్ చేశారు. దీని ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌తో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

ఈ లిస్టింగ్ ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 16 OS ఆధారిత OriginOS 6 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ Adreno 829 GPU ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇటీవల చైనా మార్కెట్‌లో విడుదల అయిన ఐకూ Z11 టర్బో మోడల్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఐకూ 15R స్మార్ట్‌ఫోన్ వస్తుందని తెలుస్తోంది.
1.5k అమోలెడ్ డిస్‌ప్లే :
ఐకూ 15R స్మార్ట్‌ఫోన్ 144Hz రీఫ్రెష్ రేట్‌తో 6.59 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేలతో విడుదల కానుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుందని సమాచారం.
200MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 200MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్, 32MP సెల్ఫీ కెమెరాతో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ 100W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7600mAh బ్యాటరీతో లాంచ్ కానుందని సమాచారం.
ఐకూ 15R స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలపై ఐకూ ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడించలేదు. దీంతోపాటు విడుదల తేదీని కూడా వెల్లడించలేదు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ :
గత సంవత్సరం చివర్లో అందుబాటులోకి వచ్చిన ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ 144Hz రీఫ్రెష్ రేట్‌తో 6.85 అంగుళాల శాంసంగ్ M14 8T LTPO 2K అమోలెడ్ ను కలిగి ఉంది. IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ లెజెండ్, అల్ఫా బ్లాక్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.
ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ జెన్ 5 చిప్‌సెట్ ను కలిగి ఉంది. Adreno GPU, సూపర్ కంప్యూటింగ్ Q3 చిప్ కూడా ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 పైన పనిచేస్తోంది. 5 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
కెమెరా విభాగం పరంగా 50MP సోనీ IMX921 ప్రైమరీ కెమెరా (OIS), 3x ఆప్టికల్ జూమ్, 3.7x లాస్‌లెస్ జూమ్, 100x జూమ్‌తో 50MP సోనీ IMX882 టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాలున్నాయి. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP సెల్ఫీ కెమెరా ఉంది. 100W వైర్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








