Home
Mobile

ఐకూ 15R స్మార్ట్‌ఫోన్‌ విడుదల తేదీ వెల్లడి.. 200MP కెమెరా, 7600mAh భారీ బ్యాటరీ?

iQOO 15R Smartphone : ఐకూ 15R స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌లో విడుదల చేస్తామని ఇటీవలే సంస్థ తెలిపింది. తాజాగా విడుదల తేదీని కూడా వెల్లడించింది. ఈ హ్యాండ్‌సెట్‌ అమెజాన్‌ ద్వారా అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన అమెజాన్‌ మైక్రోసైట్‌ ఇప్పటికే లైవ్‌లోకి వచ్చింది. అయితే ఇటీవలే ఈ హ్యాండ్‌సెట్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు లీక్‌ అయ్యాయి.

ఎప్పుడు విడుదల కానుంది? :
ఐకూ X హ్యాండిల్‌ ఆధారంగా ఐకూ 15R స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి 24 వ తేదీ విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రీమియం సెగ్మెంట్‌లో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్ 5 ప్రాసెసర్‌ తో పనిచేస్తుందని తెలుస్తోంది.

iQOO 15R Smartphone india launch

ఐకూ ఇండియా టీజర్‌ ఆధారంగా ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంటుంది. వృత్తాకార ఎడ్జ్‌లతో కూడిన స్క్వేర్‌ ఆకారంలో కెమెరా మాడ్యూల్‌ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇటీవలే బ్లూటూత్‌ SIG, గీక్‌బెంచ్, SIRIM డేటాబేస్‌లో కనిపించింది.

స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
టిప్‌స్టర్‌ డిబయన్‌ రాయ్‌ (Gadgetsdata) ఐకూ 15R స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను వెల్లడించారు. ఈ వివరాల ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌ 144Hz రీఫ్రెష్‌ రేట్‌లో 6.59 అంగుళాల 1.5k LTPS OLED ఫ్లాట్‌ డిస్‌ప్లే ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 1800 నిట్స్‌, 4320Hz PWM డిమ్మింగ్‌ ను కలిగి ఉండే అవకాశం ఉంది.

ఈ ఐకూ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్‌ 5 ప్రాసెసర్‌ ను కలిగి ఉంటుందని టిప్‌స్టర్‌ చెబుతున్నాయి. ఈ ప్రాసెసర్‌ LPDDR5x అల్ట్రా ర్యామ్‌, UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. దీంతోపాటు Q2 గేమింగ్‌ చిప్‌, Adreno 829 GPU ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత Origin OS 6 పైన పనిచేస్తుంది.

200MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్‌ వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంటాయని తెలుస్తోంది. ఇందులో OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్) సపోర్టుతో 200MP S5KHP5 కెమెరా, 8MP సెకండరీ లెన్స్‌ ఉంటుందని తెలుస్తోంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP కెమెరాలతో లాంచ్‌ కానుందని అంచనా వేస్తున్నారు.

7600mAh బ్యాటరీ :
ఐకూ 15R స్మార్ట్‌ఫోన్‌ 100W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 7600mAh బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్ USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంటుంది. IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంటుందని సమాచారం.

కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్ 5G, 4G, బ్లూటూత్‌ 5.4, వైఫై 7 ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. భద్రత కోసం 3D అల్ట్రాసోనిక్‌ ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ స్కానర్‌ను అమర్చి ఉంటుందని తెలుస్తోంది. 202 గ్రాముల బరువు ఉంటుందని తెలుస్తోంది.

టిప్‌స్టర్ లీక్‌ చేసిన వివరాల ఆధారంగా ఐకూ 15R స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌లో రూ.40 వేల ధర రేంజ్‌లో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

More from GizBot

Best Mobiles in India

English summary
iQOO 15R Smartphone india launch date revealed, expected specifications and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X