iQOO 15R స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు వెల్లడి.. సూపర్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు..!
iQOO 15R Smartphone : ఐకూ 15R స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్ లో ఫిబ్రవరి 24 వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ గురించి అనేక స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్ అమెజాన్ ద్వారా అందుబాటులోకి వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ డార్క్ నైట్, ట్రయంఫ్ సిల్వర్ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది. తాజాగా ఈ హ్యాండ్‌సెట్ గురించి మరిన్ని వివరాలు వెల్లడయ్యాయి.
శక్తివంతమైన చిప్! :
ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వివరాల ఆధారంగా ఐకూ 15R స్మార్ట్‌ఫోన్ 3nm స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్ ను కలిగి ఉంటుంది. సంస్థ అందించిన వివరాల ఆధారంగా ఈ చిప్ 35,00,000 AnTuTu స్కోర్ ను కలిగి ఉంది. దీంతోపాటు ఈ ఫోన్ Q2 సూపర్ కంప్యూటింగ్ చిప్ ను కలిగి ఉంటుంది.

10 నిమిషాల్లో :
మల్టీ టాస్కింగ్ సహా గేమింగ్ సమయాల్లో ఈ హ్యాండ్‌సెట్ వేడెక్కకుండా ఉండేలా 6.5K ఐస్ కోర్ VC కూలింగ్ సిస్టమ్ ను కలిగి ఉంటుంది. సంస్థ చెబుతున్న వివరాల ఆధారంగా కేవలం 10 నిమిషాల్లో 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది.
5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ :
అయితే తాజాగా వెల్లడయిన వివరాల ఆధారంగా ఈ స్మార్ట్‌ఫోన్ 144Hz రీఫ్రెష్ రేట్, 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తో 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే HDR10+ కంటెంట్ ను సపోర్టు చేస్తుంది. IP68, IP69 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.

7600mAh భారీ బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్ 100W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్ సపోర్టుతో 7600mAh భారీ బ్యాటరీతో లాంచ్ కానుంది. ఈ బ్యాటరీని ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 3.1 గంటలపాటు గేమింగ్ లేదా 7.1 గంటలపాటు సోషల్ మీడియా బ్రౌజింగ్ లేదా 16.3 గంటలపాటు వీడియో ప్లేబ్యాక్ ను పొందవచ్చని చెబుతోంది.
కనెక్టివిటీ పరంగా ఐకూ 15R స్మార్ట్‌ఫోన్ 5G, 4G, బ్లూటూత్ 6, వైఫై 7, NFC, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంటుంది. దీంతోపాటు IR బ్లాస్టర్ సపోర్టు కూడా ఉంటుంది. సెక్యూరిటీ కోసం ఈ ఫోన్ 3D ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంటుంది.
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ LYT 700 కెమెరాను కలిగి ఉంటుంది. మరిన్ని కెమెరాల వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు ఈ ఫోన్ ఎన్ని సంవత్సరాలపాటు అప్‌డేట్స్ ను అందిస్తుందో వెల్లడి కావాల్సి ఉంది.
అయితే ఐకూ 15R స్మార్ట్‌ఫోన్ ఎన్ని స్టోరేజీ వేరియంట్స్ లో అందుబాటులోకి వస్తుంది, భారత్ మార్కెట్‌లో ఎంత ధర సెగ్మెంట్ లో అందుబాటులోకి వస్తుందనే వివరాలు వెల్లడి కాలేదు. త్వరలో ఈ వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








