Home
Mobile

7600mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌, 1.5k అమోలెడ్ డిస్‌ప్లేతో ఐకూ 15R స్మార్ట్‌ఫోన్‌ విడుదల..

iQOO 15R Smartphone Launch : ఐకూ 15R స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌లో లాంచ్‌ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్ 5 చిప్‌ తో పనిచేస్తుంది. దీంతోపాటు 7600mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. ఇవాళ్టి నుంచే ఈ హ్యాండ్‌సెట్‌ను ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ను పొందుతుంది. తొలి సేల్‌లో భాగంగా గరిష్ఠంగా రూ.4000 డిస్కౌంట్‌ను అందిస్తామని ఐకూ తెలిపింది.

ఐకూ 15R స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు :
ఈ ఐకూ స్మార్ట్‌ఫోన్ 6.59 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 5000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 4320Hz PWM డిమ్మింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. HDR10+ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.

iQOO 15R Smartphone

స్నాప్‌డ్రాగన్‌ లేటెస్ట్‌ చిప్‌సెట్ :
ఐకూ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 5 చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఈ చిప్‌ 12GB LPDDR5x ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. దీంతోపాటు 826 GPU కూడా ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 పైన పనిచేస్తుంది.

6 సంవత్సరాల అప్‌డేట్స్‌, 7600mAh బ్యాటరీ :
ఈ ఫోన్ 4 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. ఈ హ్యాండ్‌సెట్ 144Hz ఫ్రేమ్ రేట్‌ను కలిగి ఉంది. 100W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 7600mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ బైపాస్‌ ఛార్జింగ్‌ ను కూడా సపోర్టు చేస్తుంది.

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (OIS) సపోర్టుతో 50MP సోనీ LYT-700V ప్రైమరీ కెమెరా ఉంది. 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP కెమెరా ఉంది.

iQOO 15R Smartphone

కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్‌ 6, వైఫై 7, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. భద్రత కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ను కలిగి ఉంది. ట్రయంఫ్‌ సిల్వర్‌, డార్క్‌ నైట్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

ఐకూ 15R స్మార్ట్‌ఫోన్ ధర, సేల్‌ వివరాలు :
ఐకూ 15R స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.44999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.47999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.52999 గా ఉంది.

ఐకూ ఇండియా స్టోర్‌, అమెజాన్‌ ద్వారా ఈ ఫోన్‌ను ఇవాళ్టి నుంచే ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. ఫోన్‌ సేల్‌ మార్చి 3 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. యాక్సెస్‌ బ్యాంకు, HDFC బ్యాంకు కార్డులపై రూ.4000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుపై TWS ఇయర్‌బడ్స్‌ను కూడా పొందవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
iQOO 15R Smartphone launched with snapdragon 8 gen 5 Chip, 7600mAh Battery in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X