Home
Mobile

7600mAh బ్యాటరీ, శక్తివంతమైన చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 16 OS తో 5G ఫోన్‌.. ధర వివరాలు లీక్‌..!

iQOO 15R Smartphone : ఐకూ 15R స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌ లో ఫిబ్రవరి 24 వ తేదీన లాంచ్‌ కానుంది. గతంలో చైనా మార్కెట్‌లో లాంచ్‌ అయిన ఐకూ Z11 టర్బో మోడల్‌కు రీబ్రాండెడ్‌ వెర్షన్‌గా ఐకూ 15R ఫోన్‌ అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 5 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది.

ధర వివరాలు లీక్! :
తాజాగా ఈ ఐకూ ఫోన్‌ ధర వివరాలు లీక్‌ అయ్యాయి. PassionateGeekz.com ఆధారంగా ఐకూ 15R స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.45999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.47999, 12GB ర్యామ్‌ + 512GB స్టోరేజీ ధర రూ.52999 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

iQOO 15R Smartphone price leaked

ఈ హ్యాండ్‌సెట్ డార్క్ నైట్, ట్రయంఫ్ సిల్వర్‌ కలర్‌ వేరియంట్స్‌ అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్‌ విడుదల అనంతరం ఐకూ ఇండియా వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్‌ ద్వారా సేల్‌ ప్రారంభం కానుంది.

ఐకూ 15R స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
ఈ ఫోన్‌ 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.59 అంగుళాల 1.5K అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 5000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, HDR10+ కంటెంట్‌ను సపోర్టు చేస్తుంది. కంటికి హానికలగకుండా ప్రత్యేక ప్రొటెక్షన్‌ కూడా ఉంటుందని. ఈ ఫోన్‌ గ్లాస్‌ ప్రొటెక్షన్‌తో కూడిన మెటల్‌ ఫ్రేమ్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

శక్తివంతమైన చిప్‌సెట్! :
ఈ హ్యాండ్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్ 8 జెన్‌ 5 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌ LPDDR5x ర్యామ్, UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. దీంతోపాటు Q2 గేమింగ్‌ చిప్‌ను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 పైన పనిచేస్తుంది.

6 సంవత్సరాల అప్‌డేట్స్‌, 7600mAh బ్యాటరీ :
ఈ ఫోన్ 4 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని ఐకూ చెబుతోంది. ఈ హ్యాండ్‌సెట్ 100W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 7600mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ అడ్వాన్స్‌డ్‌ బైపాస్‌ ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉంటుంది.

కెమెరాల వివరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలుంటాయి. ఇందులో 50MP OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌) ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ ఉంటాయి. 32MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ప్రైమరీ కెమెరా 60fps వద్ద 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది.

ఈ ఫోన్ IP68 + IP69 రేటింగ్‌ తో డస్ట్‌, వాయిస్‌ రెసిస్టెంట్‌ గా ఉంటుంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్ 6.0, వైఫై 7, NFC, IR బ్లాస్టర్, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంటుంది. భద్రత కోసం అల్ట్రాసోనిక్ 3D ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ ను కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
iQOO 15R Smartphone with snapdragon 8 Gen 5 Chip price leaked ahead of launch on February 24 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X