7600mAh బ్యాటరీ, శక్తివంతమైన చిప్‌సెట్ సహా సూపర్ ఫీచర్లతో 5G స్మార్ట్‌ఫోన్.. ఇవాళ్టి నుంచే సేల్..!
iQOO 15R Smartphone Sale : భారత్ లో ఐకూ సంస్థ గత నెలలో ఐకూ 15R స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ అనేక ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంది. శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్ తో పనిచేస్తుంది. ఈ చిప్ కలిగిన తొలి తక్కువ బడ్జెట్ ఫోన్ గా గుర్తింపు పొందింది. దీంతోపాటు 7600mAh భారీ బ్యాటరీ, 6 సంవత్సరాల అప్‌డేట్స్ ను పొందుతుంది. ఈ ఫోన్ సేల్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది.
ఇవాళ్టి నుంచే సేల్ :
ఐకూ 15R స్మార్ట్‌ఫోన్ సేల్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఐకూ ఇండియా స్టోర్, అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 8GB/256GB వేరియంట్ ధర రూ.44999, 12GB/256GB వేరియంట్ ధర రూ.47999, 12GB/512GB వేరియంట్ ధర రూ.52999 గా ఉంది.

తొలి సేల్ లో భాగంగా HDFC, Axis బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.4000 వరకు డిస్కౌంట్ ను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ ట్రయంఫ్ సిల్వర్, డార్క్ నైట్ కలర్ వేరియంట్స్ లో అందుబాటులో ఉంది.
1.5k డిస్‌ప్లే :
ఐకూ 15R స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.59 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 5000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 4320Hz PWM డిమ్మింగ్ రేట్, HDR10+ కంటెంట్ ను సపోర్టు చేస్తుంది. సెక్యూరిటీ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ను కలిగి ఉంది.
స్నాప్‌డ్రాగన్ డిస్‌ప్లే, 6 సంవత్సరాల అప్‌డేట్స్ :
ఐకూ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 12GB LPDDR5x ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. దీంతోపాటు 826 GPU కూడా ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 పైన పనిచేస్తోంది. 4 ఏళ్ల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుంది.
50MP ప్రైమరీ, 32MP సెల్ఫీ కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ( OIS ) సపోర్టుతో 50MP సోనీ LYT 700V ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాతో అందుబాటులో ఉంది.
7600mAh భారీ బ్యాటరీ :
ఐకూ 15R స్మార్ట్‌ఫోన్ 100W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7600mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ బైపాస్ ఛార్జింగ్ ను కూడా సపోర్టు చేస్తుంది. IP68 + IP69 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. 5G, 4G LTE, WiFi 7, బ్లూటూత్ 6, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








