iQOO 3 5G ఫోన్ రిలీజ్... ఇండియాలో 5G శకం ప్రారంభం...

|

ఇండియాలో ఇప్పుడు 5G హ్యాండ్‌సెట్ స్మార్ట్‌ఫోన్‌ల శకం మొదలయింది. నిన్న ఇండియా యొక్క మొదటి 5G స్మార్ట్ ఫోన్ రియల్‌మి X50 ప్రో 5G ఇప్పుడు మరొక ఫోన్ iQOO3 5G స్మార్ట్‌ఫోన్‌ను ఈ రోజు ఇండియాలో లాంచ్ చేసారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను సంస్థ 4G,5G రెండు వేరియంట్ లలో రిలీజ్ చేసింది. ధరల విభాగంలో దీని యొక్క 5G వెర్షన్ కోసం రూ.44,990 గా మరియు 4G వెర్షన్ కోసం రూ.37,999 లుగా నిర్ణయించబడింది.

iQOO3 5G
 

iQOO3 5G

iQOO3 5G స్మార్ట్‌ఫోన్‌ లేబుల్‌ విషయంలో నిన్న లాంచ్ అయిన రియల్‌మి X50 ప్రో 5G తో ఈ హ్యాండ్‌సెట్ పోటీ పడనుంది. తాజా iQOO 3 యొక్క మొదటి అమ్మకాలు మార్చి 4 మధ్యాహ్నం 12:00 గంటలకు ఫ్లిప్‌కార్ట్ ద్వారా మొదలు కానున్నాయి. స్నాప్‌డ్రాగన్ 865 చిప్‌సెట్,48 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరాలు, 55W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో 4,400mAh బ్యాటరీ వంటి ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉన్న దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

WhatsApp హిడెన్ ఫీచర్ యొక్క పూర్తి సమాచారం

ఇండియాలో  iQOO3 5G స్మార్ట్‌ఫోన్‌ ధరల వివరాలు

ఇండియాలో iQOO3 5G స్మార్ట్‌ఫోన్‌ ధరల వివరాలు

iQOO3 5G స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో మూడు మోడళ్లలో రెండు 5G మరియు ఒకటి 4G వేరియంట్ లలో అందిస్తోంది. iQOO3 యొక్క 5G 12 జిబి ర్యామ్ + 256 జిబి స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.44,990 నిర్ణయించబడింది. ఇదే స్టోరేజ్ గల 4G వేరియంట్ యొక్క ధర రూ.36,990గా నిర్ణయించబడింది. వినియోగదారులు 8 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ యొక్క 5G మోడల్ ను రూ.36,990 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ యొక్క 4G వేరియంట్ యొక్క ధర రూ .39,990గా నిర్ణయించబడింది.

Netflix యాప్ లో "టాప్ 10" ఫీచర్‌...

సేల్స్ వివరాలు

సేల్స్ వివరాలు

iQOO3 5G స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో మార్చి 4 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ యొక్క మొదటి సేల్స్ లో భాగంగా ఐసిఐసిఐ డెబిట్ మరియు క్రెడిట్ కార్డులపై రూ.3,000 క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

Realme X50 Pro 5G రిలీజ్... సేల్స్ ఆఫర్స్ బ్రహ్మాండం...

స్పెసిఫికేషన్స్
 

స్పెసిఫికేషన్స్

iQOO3 5G స్మార్ట్‌ఫోన్‌ రియల్‌మి X50 ప్రో మాదిరిగానే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 12GB వరకు LPDDR5 RAM తో మరియు 256GB వరకు గల UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ తో జతచేయబడి వస్తుంది. ఈ 5G స్మార్ట్‌ఫోన్‌ ఆధునిక పంచ్-హోల్ HD + AMOLED డిస్ప్లే 6.44-అంగుళాలతో వస్తుంది. ప్రైవసీ కోసం డిస్ప్లేలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉండడమే కాకుండా ఫేస్ అన్‌లాక్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ఇది డ్యూయల్ సిమ్‌లకు మద్దతు ఇస్తుంది మరియు ఆండ్రాయిడ్10- ఆధారిత iQOO UI 1.0తో రన్ అవుతుంది.

Nokia 9 PureView స్మార్ట్ ఫోన్ మీద భారీ ధర తగ్గింపు...

డిస్ప్లే

డిస్ప్లే

IQOO 3 6.44-అంగుళాల FHD + సూపర్ AMOLED స్క్రీన్‌తో HDR + మద్దతుతో మరియు 91.40% స్క్రీన్ టు బాడీ రేషియోతో వస్తుంది. పరికరం పోలార్ వ్యూ డిస్ప్లేతో వస్తుంది. iQOO3 5G స్మార్ట్‌ఫోన్‌ కార్బన్ ఫైబర్ pc లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీకి మద్దతు ఇస్తుంది. ఇది వాల్కనో ఆరెంజ్, క్వాంటం సిల్వర్ మరియు బ్లాక్ అనే మూడు కలర్ లలో లభిస్తుంది.

Rs.35,000 ధరల లోపు ఉత్మమమైన స్మార్ట్‌ఫోన్‌లు

కెమెరా సెటప్

కెమెరా సెటప్

iQOO 3 5G హ్యాండ్‌సెట్‌ యొక్క వెనుక భాగంలో క్వాడ్-రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఈ కెమెరా సెటప్ లో 48 మెగాపిక్సెల్ సెన్సార్ తో మెయిన్ కెమెరాను కలిగి ఉంటుంది. 48MP (సోనీ IMX582, f / 1.79), 13MP టెలిఫోటో (f / 2.46), 13MP వైడ్ యాంగిల్ (f / 2.2) మరియు 2MP డెప్త్ సెన్సార్ తో (f / 2.4) లెన్స్ లను కలిగి ఉంటాయి. వీడియో కాలింగ్ మరియు సెల్ఫీల కోసం ముందు భాగంలో పంచ్-హోల్ డిస్ప్లేలో 16MP షూటర్ ఉంది. హ్యాండ్‌సెట్ 1x, 5x మరియు 20x జూమ్‌లకు మద్దతు ఇస్తుంది. అల్ట్రావైడ్, డెప్త్ మరియు టెలిఫోటో కోసం ప్రత్యేక సెన్సార్లు ఉంటాయి. iQOO 3 హ్యాండ్‌సెట్‌ 55W iQOO ఫ్లాష్ ఛార్జ్ మద్దతుతో 4,440mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 5G కి మద్దతు ఇస్తుంది మరియు అన్ని ఇతర బ్యాండ్‌లకు కూడా అనుకూలంగా ఉంటుంది.

గేమ్ వైబ్రేషన్‌

గేమ్ వైబ్రేషన్‌

గేమర్స్ కోసం iQOO 3 హ్యాండ్‌సెట్‌ 180Hz టచ్ రెస్పాన్స్ రేట్, మాన్స్టర్ టచ్ మరియు 4D గేమ్ వైబ్రేషన్‌తో వస్తుంది. మాన్స్టర్ టచ్ బటన్లు సైడ్ ఫ్రేమ్‌లో పొందుపరచి ఉంటాయి. ఇవి ఆటలో త్వరగా అన్ని రకాల వేళ్ళతో ఆపరేషన్లను సాధించడంలో వినియోగదారులకు సహాయపడతాయి. పరికరంలోని 4D వైబ్రేషన్ షూటింగ్ చేసేటప్పుడు పున:స్థితిని అనుకరించగలదు మరియు డ్రైవింగ్ చేసేటప్పుడు స్టీరింగ్ వీల్ యొక్క కంపనం మొదలైనవి ఆట అనుభవాన్ని మరింత వాస్తవికంగా చేస్తాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
IQOO 3 5G Smartphone Launched in India: Price,Specifications,Features,Sales Date,Offers

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X