iQOO 3: నెట్‌వర్క్‌ కనెక్టివిటీ,గేమ్ ఛేంజర్ స్మార్ట్‌ఫోన్‌లలో రారాజు

|

ఇండియా యొక్క స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 2020 సంవత్సరంలో రిలీజ్ కు ముందు అధికంగా హైప్ వచ్చిన వాటిలో ఐక్యూ 3 ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఒకటి. ఇప్పుడు ఇండియాలో దీని యొక్క అమ్మకాలు మొదలుకానున్నాయి. రూ.36,990 ప్రారంభ ధర గల ఈ ఫోన్ అద్భుతమైన హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్ ఫీచర్లను కలిగి ఉంది.

iQOO 3

గేమింగ్ కోసం కూడా ఉత్తమైన ఫీచర్లను కలిగి ఉన్న iQOO 3 ను మాస్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ యొక్క ఉత్తమ పనితీరును గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

Vivo Z6 5G యొక్క ఫీచర్స్ ఇవే... 5G స్మార్ట్‌ఫోన్‌లలో గట్టి పోటీVivo Z6 5G యొక్క ఫీచర్స్ ఇవే... 5G స్మార్ట్‌ఫోన్‌లలో గట్టి పోటీ

ఇండియా యొక్క రెండవ వాణిజ్య 5G స్మార్ట్‌ఫోన్

ఇండియా యొక్క రెండవ వాణిజ్య 5G స్మార్ట్‌ఫోన్

ఇండియాలో వాణిజ్యపరంగా అందుబాటులో గల రెండవ 5G స్మార్ట్‌ఫోన్‌గా IQOO 3 ఉన్నది. నెట్‌వర్క్ విషయంలో ప్రస్తుతం ఉన్న దాని కంటే 5రెట్లు వేగవంతమైన 5G నెట్‌వర్క్‌ కనెక్టివిటీ దేశంలో అమలులోకి వచ్చిన తరువాత ఐక్యూ 3 యూజర్లు ఇందులో ఉపయోగించగలరు. IQOO 3 ను కొనుగోలు చేసే వినియోగదారులు డౌన్‌లోడ్ మరియు అప్‌లోడ్ వేగం ఇప్పుడున్న దాని కంటే 5రెట్లు ఎక్కువగా, బఫర్ లేని వీడియో స్ట్రీమింగ్ మరియు లాగ్-ఫ్రీ గేమ్‌ప్లేని అనుభవిస్తారు. క్లౌడ్ మరియు ఇంటర్నెట్ ఆధారిత సేవలను మరింత నమ్మదగిన కనెక్షన్‌తో పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో అధునాతన యాప్ లు మరియు క్లౌడ్ ఆధారిత గేమ్ లను అమలు చేయగలరు. మొత్తంమీద iQOO 3 రిఫ్రెష్ స్మార్ట్ఫోన్ యూజర్లకు అధునాతన కమ్యూనికేషన్ మరియు సున్నితమైన అనుభవాన్ని అందిస్తుంది.

 

 

Tata Sky, Airtel Digital TV ఆపరేటర్ల టీవీ కనెక్షన్ కొత్త ధరలు ఇవే...Tata Sky, Airtel Digital TV ఆపరేటర్ల టీవీ కనెక్షన్ కొత్త ధరలు ఇవే...

భారతదేశపు మొట్టమొదటి స్నాప్‌డ్రాగన్ 865 స్మార్ట్‌ఫోన్ లైన్-అప్

భారతదేశపు మొట్టమొదటి స్నాప్‌డ్రాగన్ 865 స్మార్ట్‌ఫోన్ లైన్-అప్

భారత మార్కెట్లో IQOO 3 తాజా స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్ ఆధారంగా వస్తున్న స్మార్ట్‌ఫోన్లలో ఒకటి. 7nm చిప్‌సెట్ వేగవంతమైన ఇంటర్నెట్, డెస్క్‌టాప్-స్థాయి గేమింగ్, కాంప్లెక్స్ AI మరియు మల్టీ-గిగాబిట్ 5G కనెక్టివిటీని అనుమతిస్తుంది. SD865 ఆన్-డివైస్ AI ని అమలుచేస్తుంది. ఇది హై-ఎండ్ క్లౌడ్-బేస్డ్ గేమింగ్, AI- ఎనేబుల్డ్ ఫోటోగ్రఫీ, రియల్ టైమ్ AI ట్రాన్సలేషన్ వంటి మరెన్నో ఫీచర్లు iQOO 3 హ్యాండ్‌సెట్ లో అమలుచేయబడి ఉంటాయి. ఇది సరికొత్త A77 ఆర్కిటెక్చర్, క్రియో 585 CPU డిజైన్ మరియు అడ్రినో 650 GPUలతో కూడిన స్నాప్‌డ్రాగన్ 865 ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ యొక్క పనితీరును 25%కు పెంచుతుంది మరియు శక్తి వినియోగాన్ని 30%కు తగ్గిస్తుంది. దీని అర్థం స్నాప్‌డ్రాగన్ 855 శక్తితో పనిచేసే హ్యాండ్‌సెట్‌లలో ఐక్యూఓ3 ఉత్తమ పనితీరును కలిగి ఉంది.

 

 

Airtel కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లతో ప్రత్యర్థులకు చెమటలుAirtel కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లతో ప్రత్యర్థులకు చెమటలు

LPDDR5 ర్యామ్ మరియు UFS 3.1 ఫ్లాష్ స్టోరేజ్

LPDDR5 ర్యామ్ మరియు UFS 3.1 ఫ్లాష్ స్టోరేజ్

IQOO 3 స్మార్ట్‌ఫోన్ వేగవంతమైన తాజా LPDDR5 RAM మరియు UFS 3.1 ఫ్లాష్ స్టోరేజ్ CPUతో జతచేయబడి వస్తుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 855 + 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ కలయికలతో iQOO 3 మార్కెట్లో అత్యంత సమర్థవంతమైన స్మార్ట్‌ఫోన్‌గా ఉన్నది. మేము వినియోగించిన దాని ఆధారంగా ఈ స్మార్ట్‌ఫోన్ పనితీరులో నిజానికి రాక్షసుడిలా ఉంది అని మాత్రం చెప్పగలను. IQOO 3తో ఫైల్ బదిలీను మరింత వేగవంతంగా అందిస్తుంది. దీని అద్భుతమైన పనితీరులో భాగంగా అధిక గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ గేమ్‌లను కూడా సులభంగా ఆడడానికి అనుమతినిస్తుంది. LPDDR5 RAM మరియు UFS3.1 ఫ్లాష్ స్టోరేజ్ కూడా ఫోనెను వేగంగా అప్లికేషన్ రిట్రీవల్ మరియు కాష్ స్పీడ్ మరియు మల్టీ-టాస్కింగ్‌లో సహాయపడుతుంది.

 

 

Redmi K30 Pro 5G: కొత్త ఫోన్ ఫీచర్స్ ఇవే...Redmi K30 Pro 5G: కొత్త ఫోన్ ఫీచర్స్ ఇవే...

180Hz AMOLED డిస్ప్లే

180Hz AMOLED డిస్ప్లే

ఇండియా యొక్క మొబైల్ పరిశ్రమలో 180Hz సూపర్ టచ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో వస్తున్న మొదటి స్మార్ట్‌ఫోన్ IQOO 3. 5G-ఎనేబుల్ కనెక్టివిటీ గల ఈ స్మార్ట్‌ఫోన్ 6.4-అంగుళాల పోలార్ వ్యూ స్క్రీన్‌, E3 సూపర్ అమోలేడ్ ప్యానెల్,1200nits వరకు గరిష్ట ప్రకాశంను కలిగి ఉంటుంది. స్క్రీన్ రైన్ కంటి సౌకర్యం ధృవీకరించబడి వస్తుంది. IQOO 3 లోని డిస్ప్లే HDR 10+ HDR హై డైనమిక్ రేంజ్ వీడియో కంటెంట్ ప్లేబ్యాక్‌కు మద్దతు ఇవ్వడానికి ధృవీకరించబడింది.

 

 

నోకియా ఫోన్ల ప్రియులకు శుభవార్త: కొత్త ఫోన్లలో పాత ఫీచర్స్నోకియా ఫోన్ల ప్రియులకు శుభవార్త: కొత్త ఫోన్లలో పాత ఫీచర్స్

iQOO 3 ఈజ్ ఎ గేమర్స్ డిలైట్

iQOO 3 ఈజ్ ఎ గేమర్స్ డిలైట్

స్నాప్‌డ్రాగన్ 865 SoC, LPDDR5 RAM, వేగవంతమైన UFS3.1 స్టోరేజ్ మరియు 180Hz టచ్ రెస్పాన్స్ రేట్ ప్యానెల్ గల iQOO 3 స్మార్ట్ ఫోన్ అద్భుతమైన గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది. అయితే గేమ్ ప్లే అనుభవాన్ని మరింత పెంచడానికి కంపెనీ 'మాన్స్టర్ టచ్ బటన్'లను జోడించింది. ఈ ప్రెషర్-సెన్సిటివ్ బటన్లు హ్యాండ్‌సెట్ యొక్క సైడ్ ఫ్రేమ్‌లో అమర్చబడి ఉన్నాయి. గేమర్స్ యాక్షన్-ప్యాక్ ఆటలలో వేగంగా కదలడం కోసం క్విక్ మల్టీ-ఫింగర్ ఆపరేషన్లను సాధించడంలో సహాయపడతాయి.

ఉదాహరణకు మీరు ఈ ఫోన్ లో PUBG, కాల్ ఆఫ్ డ్యూటీ, అష్పాల్ట్ 9 వంటి గేమ్ లను ఆడుతున్నప్పుడు మీ ప్రత్యర్థులను వేగంగా ఎదురుకోవడానికి లేదా ఏదైనా చర్యను అతి త్వరగా తీసుకోవడానికి iQOO 3 లోని ఈ రాక్షస టచ్ బటన్లను అనుకూలీకరించవచ్చు.

 

గేమింగ్ అనుభవం

గేమింగ్ అనుభవం

iQOO 3 కి 4D వైబ్రేషన్‌ను జోడించింది. దీని వలన మీరు ఏదైనా గేమ్ లో బుల్లెట్‌లను కాల్చేటప్పుడు రికాయిల్ అనుభవాన్ని మరియు డ్రైవింగ్ చేసేటప్పుడు స్టీరింగ్ వీల్ యొక్క వైబ్రేషన్‌ను అనుభవించవచ్చు. అలాగే మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌లో రియల్ టైం అనుభవాన్ని మరింత గొప్పగా పొందుతారు. మాన్స్టర్ UI తో అల్ట్రా-గేమ్ మోడ్‌లోని అన్ని గేమ్-సెంట్రిక్ సెట్టింగ్‌లను మీరు సులభంగా ఉపయోగించవచ్చు. స్మార్ట్‌ఫోన్ వేడెక్కడం గురించి చింతించకుండా ఇందులో అన్ని రకాల ఆటలను ఆడవచ్చు. కార్బన్ ఫైబర్ వాపోర్ కూలింగ్ టెక్నాలజీతో ఈ హ్యాండ్‌సెట్‌ను సంస్థ తయారుచేసింది.

48MP AI- క్వాడ్-లెన్స్ కెమెరా

48MP AI- క్వాడ్-లెన్స్ కెమెరా

IQOO 3 వెనుక వైపు క్వాడ్-లెన్స్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఈ సెటప్ లో 48MP ప్రైమరీ లెన్స్‌తో పాటు 13 MP టెలిఫోటో లెన్స్ 20X డిజిటల్ జూమ్, 13 MP సూపర్ వైడ్ యాంగిల్ లెన్స్ మరియు 2 MP డెప్త్ సెన్సార్‌తో ఉంటుంది. 48MP లెన్స్ ఆకట్టుకునే డైనమిక్ పరిధితో అధిక-రిజల్యూషన్ తో చాలా చక్కగా ఫోటోలను తీయవచ్చు. 13MP టెలిఫోటో లెన్స్ దూరంగా ఉన్న వాటిని దగ్గరగా చూపడానికి వీలుగా 2x ఆప్టికల్‌గా మరియు 20x డిజిటల్‌గా జూమ్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. 13MP వైడ్-యాంగిల్ లెన్స్ డ్రమెటిక్ ల్యాండ్‌స్కేప్ షాట్‌లను సులభంగా తీయడానికి మరియు 2MP డీప్ సెన్సార్ ప్రొఫెషనల్-స్థాయి పోర్ట్రెయిట్‌లను సమర్థవంతంగా తీయడానికి ఉపయోగించవచ్చు.

 

 

Airtel Payments Bankలో ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్‌Airtel Payments Bankలో ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్‌

కెమెరా పనితీరు

కెమెరా పనితీరు

IQOO 3 స్టెబిలైజ్డ్ వీడియోలను సంగ్రహించగలదు. కెమెరా 'సూపర్ యాంటీ-షేక్' మోడ్‌ను కలిగి ఉన్నందున ఇది అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌లో వీడియోలను చిత్రీకరించడానికి సంక్లిష్టమైన EIS అల్గారిథమ్‌లను ఉపయోగిస్తుంది. అంతేకాకుండా మీరు తక్కువ-కాంతి గల ప్రాంతంలో ఫోటోలను 2.5 సెం.మీ క్లోజప్ దూరంతో మాక్రో షాట్లు, 4K రికార్డ్ వీడియోలు, టైమ్ లాప్స్ వీడియోలు మరియు స్లో-మోషన్ వీడియోలను కూడా సంగ్రహించవచ్చు.

 

 

WhatsApp Tips: వాట్సాప్‌లో మెసేజ్ లను ఎక్కువగా ఎవరికి పంపారో తెలుసుకోవడం ఎలా?WhatsApp Tips: వాట్సాప్‌లో మెసేజ్ లను ఎక్కువగా ఎవరికి పంపారో తెలుసుకోవడం ఎలా?

55W సూపర్ ఫ్లాష్‌ఛార్జ్ టెక్నాలజీతో 4,440mAh బ్యాటరీ

55W సూపర్ ఫ్లాష్‌ఛార్జ్ టెక్నాలజీతో 4,440mAh బ్యాటరీ

IQOO 3 స్మార్ట్‌ఫోన్ కూడా ఒక్క ఛార్జ్ మీద 24 గంటల వినియోగం కోసం పెద్ద 4,440mAh బ్యాటరీకు మద్దతును కలిగి ఉంది. దీని యొక్క సెగ్మెంట్ లో 55W సూపర్ ఫ్లాష్‌చార్జ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ ఫాస్ట్-ఛార్జ్ టెక్నాలజీ మద్దతుతో 4,440mAh పెద్ద బ్యాటరీ యొక్క ఛార్జింగ్ 50% వరకు కేవలం 15 నిమిషాల్లో ఛార్జ్ చేయగలదు. అంటే మీరు 35 నిమిషాల్లోపు iQOO 3 ని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.

 

 

Jio సెట్-టాప్ బాక్స్‌లో OTT యాప్ లను ఇన్‌స్టాల్ చేయడం ఎలా?Jio సెట్-టాప్ బాక్స్‌లో OTT యాప్ లను ఇన్‌స్టాల్ చేయడం ఎలా?

ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్

ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్

పనితీరు మరియు ఫీచర్లపై రాజీ పడకూడదనుకునే మిలీనియర్స్ కోసం iQOO 3 చక్కగా సరిపోతుంది. పనితీరులో మందగమనాల గురించి చింతించకుండా మీరు iQOO 3 లో అత్యంత లీనమయ్యే గేమ్‌ప్లే మరియు రోజువారీ పనితీరును అనుభవించవచ్చు. ఇది అత్యుత్తమ చిప్‌సెట్, వేగవంతమైన ర్యామ్-రామ్ కాన్ఫిగరేషన్, అధిక సామర్థ్యం గల కెమెరా, క్రేజీ ఫాస్ట్ ఛార్జింగ్ కలిగిన పెద్ద బ్యాటరీ, గేమ్-సెంట్రిక్ రాక్షస-టచ్ బటన్లు మరియు అపూర్వమైన నెట్‌వర్క్ పనితీరు కోసం 5G మద్దతును అందిస్తుంది.

 

 

గూగుల్ డుయో ద్వారా డూడుల్‌ మెసేజ్,నోట్స్ లను పంపడం ఎలా?గూగుల్ డుయో ద్వారా డూడుల్‌ మెసేజ్,నోట్స్ లను పంపడం ఎలా?

ధరల వివరాలు

ధరల వివరాలు

iQOO 3 ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 4G మరియు 5G వేరియంట్లలో లభిస్తుంది. IQOO 3 యొక్క 4G వేరియంట్ 8GB RAM + 128GB ROM యొక్క ధర రూ.36,990 కాగా, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ రామ్ మోడల్ వేరియంట్ యొక్క ధర రూ.39,990గా ఉన్నది. ఇందులో టాప్ ఎండ్ 5G వేరియంట్ 12GB RAM మరియు 256GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.44,990 గా ఉన్నది.

 

 

యూట్యూబ్‌ ద్వారా డబ్బును సంపాదించడం ఎలా? సులభమైన చిట్కాలుయూట్యూబ్‌ ద్వారా డబ్బును సంపాదించడం ఎలా? సులభమైన చిట్కాలు

టోల్ ఫ్రీ

టోల్ ఫ్రీ

ఆసక్తిగల కొనుగోలుదారులకు ఈ ఒప్పందాన్ని మరింత ఉత్తేజపరిచేందుకు దేశవ్యాప్తంగా మరమ్మత్తు సమస్యల కోసం 15000+ లకు పైగా iQOO ఉచిత పిక్ అండ్ డ్రాప్ సేవలను అందిస్తోంది. ఏదైనా సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800-572-4700 ద్వారా iQOO సేవా నిపుణులు 24 * 7 అందుబాటులో ఉన్నారు. మరింత సహాయం కోసం మీరు సంస్థ యొక్క మద్దతు వెబ్‌సైట్‌కు కూడా చేరుకోవచ్చు .

Best Mobiles in India

English summary
iQOO 3: Game Changer Flagship Smartphone For Unmatched Performance

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X