ఈ ఫోన్ పై రూ.3000 ధర తగ్గింది! కొత్త ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
వివో యొక్క సబ్ బ్రాండ్ అయిన iQoo భారతదేశంలో iQoo 9 SE ధరను తగ్గించింది. 8GB RAM మోడల్‌కు ప్రారంభ ధర ₹33,990తో గతేడాది ఫిబ్రవరిలో ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయబడిన ఈ ఫోన్ ధరను, కంపెనీ ఇప్పుడు ₹3,000 తగ్గించింది. ధర తగ్గింపు తర్వాత, ఈ వేరియంట్‌ను ₹30,990 వద్ద కొనుగోలు చేయవచ్చు.
ఐక్యూ 9 SE రెండు RAM మోడల్‌లు కలిగి ఉంటుందని అభిమానులు గమనించాలి. వీటిలో 8GB + 128GB మరియు 12GB+ 256GB ఉన్నాయి. అయితే, ప్రస్తుతం 8GB RAM వేరియంట్ ధర తగ్గించబడింది. ఐక్యూ 9 SE రెండు రంగుల ఎంపికలలో అందించబడుతుంది. అవి స్పేస్ ఫ్యూజన్ మరియు సన్‌సెట్ సియెర్రా రంగు.ఈ కొత్త ధర ఇప్పటికే ఇ-కామర్స్ సైట్ అమెజాన్‌లో అప్డేట్ చేయబడింది.

ఐక్యూ 9 SE స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల విషయానికొస్తే, ఐక్యూ 9 SE స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 1080x2400 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.62 అంగుళాల పూర్తి HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది, గరిష్ట ప్రకాశం 1300 నిట్‌ల వరకు ఉంటుంది.
ఇక కెమెరా వివరాలు గమనిస్తే, ఐక్యూ 9 SE స్మార్ట్ ఫోన్ వెనకవైపు మూడు కెమెరాల సెటప్‌ను కలిగి ఉంది. వీటిలో ఇది 13MP వైడ్ యాంగిల్ లెన్స్ మరియు 2MP మోనోక్రోమ్ లెన్స్‌తో జత చేయబడిన 48MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఇక ముందు వైపు సెల్ఫీల కోసం, స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో 16MP కెమెరాతో వస్తుంది.
పైన చెప్పినట్లుగా, ఈ ఫోన్ 12GB RAM మోడల్ తో కూడా వస్తుంది. ఇది 256GB ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యాన్ని అందిస్తుంది. ఐక్యూ 9 SE ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా కంపెనీ యొక్క స్వంత ఫన్ టచ్ OS 12 పై పనిచేస్తుంది.
ఇంకా ఈ ఫోన్ 4,500mAh బ్యాటరీ తో వస్తుంది. ఇది 66వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఐక్యూ 9 SE భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5G సపోర్ట్ కలిగి ఉంది.
ఇటీవలే గత వారంలో, ఐక్యూ Z7 5G భారతదేశంలో మార్చి 21 న లాంచ్ చేయబడింది. ఐక్యూ Z7 5G అనేది భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన బ్రాండ్ యొక్క మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ అని పేర్కొంది.దీని పోటీ క్యాటగిరీ లోని ఫోన్లకంటే కొనుగోలుదారులకు ఉత్తమ ఇన్ క్లాస్ హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్ ఫీచర్లను అందించడానికి ఈ ఫోన్ తయారుచేయబడింది.
భారతదేశంలో ఐక్యూ Z7 5G ధర, లభ్యత వివరాలు గమనిస్తే, ఈ ఫోన్ రెండు స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో లభిస్తుంది 6GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ మరియు 8GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ లలో వస్తుంది. ఐక్యూ Z7 5G యొక్క తక్కువ వేరియంట్ భారతదేశంలో రూ. 18,999, అయితే 8GB వేరియంట్ రూ. 19,999 గా ఉంది.వీటిపై ప్రత్యేకమైన బ్యాంక్ ఆఫర్‌ల ధర 6GB + 128GB మోడల్‌కు రూ.17,499 మరియు 8GB + 128GB మోడల్ కోసం రూ.18,499 గా ఉంది.


Click it and Unblock the Notifications








