Home
Mobile

అమెజాన్‌ ప్రైమ్‌ డే 2025 సేల్‌.. ఈ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లు.. నో కాస్ట్‌ EMI కూడా.!

అమెజాన్ ప్రైమ్‌ డే 2025 సేల్‌ జులై 12 నుంచి 14 వరకు జరగనుంది. ఇప్పటికే ఈ సేల్‌ గురించి అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఈ సేల్‌లో భాగంగా డిస్కౌంట్‌లతోపాటు ICICI, SBI బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ ను పొందవచ్చు. అయితే ఐకూ సంస్థ (iQOO India) కీలక ప్రకటన చేసింది. ఇటీవల విడుదలైన అనేక మోడల్స్‌ను డిస్కౌంట్‌ ధరకు అందించనున్నట్లు తెలిపింది.

అమెజాన్ ప్రైమ్‌ డే 2025 సేల్‌ లో ఐకూ Z10 లైట్‌, ఐకూ Z10x, ఐకూ Z10, ఐకూ నియో 10R, ఐకూ నియో 10, ఐకూ 13 వంటి స్మార్ట్‌ఫోన్‌లను భారీ డిస్కౌంట్ ధరలకు సొంతం చేసుకోవచ్చని తెలిపింది. దీంతోపాటు ఎంపిక చేసిన మోడల్స్‌పై నో కాస్ట్‌ EMI ఆఫర్‌ ను కూడా అందిస్తున్నట్లు పేర్కొంది.

iQOO announces best smartphone deals on amazon prime day 2025 sale

ఐకూ Z10 లైట్‌, Z10x స్మార్ట్‌ఫోన్‌లు :
అమెజాన్ సేల్‌లో భాగంగా ఐకూ Z10 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌ను రూ.9499 కే కొనుగోలు చేయవచ్చు. అదే ఐకూ Z10x స్మార్ట్‌ఫోన్‌ను రూ.12,749 కే సొంతం చేసుకోవచ్చని ఐకూ చెబుతోంది. సేల్ ఆఫర్లు, బ్యాంకు డిస్కౌంట్‌లతో ఈ ధరకు అందుబాటులోకి రానున్నాయి.

ఐకూ Z10 స్మార్ట్‌ఫోన్‌ :
దీంతోపాటు ఐకూ Z10 స్మార్ట్‌ఫోన్‌ ను రూ.19999 ధరకు సొంతం చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఫోన్‌ను 3 మరియు 6 నెలల వరకు నో కాస్ట్‌ EMI ఆప్షన్‌ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 7300mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. 6.78 అంగుళాల భారీ డిస్‌ప్లే, 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది.

ఐకూ నియో 10R స్మార్ట్‌ఫోన్‌ :
ఐకూ నియో 10R స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్ ప్రైమ్‌ డే 2025 సేల్‌లో భాగంగా రూ.23499 కే కొనుగోలు చేయవచ్చని ఐకూ చెబుతోంది. 3 లేదా 6 నెలల నో కాస్ట్ EMI ఆప్షన్‌తో కొనుగోలు చేయవచ్చు. 6.78 అంగుళాల 1.5K అమోలెడ్‌ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15, స్నాప్‌డ్రాగన్‌ 8s జెన్‌ 3 ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. 6400mAh బ్యాటరీ, 50MP పైమరీ కెమెరాను కలిగి ఉంది.

ఐకూ నియో 10 స్మార్ట్‌ఫోన్‌ :
ఐకూ నియో 10 స్మార్ట్‌ఫోన్‌ను ఈ అమెజాన్ సేల్‌లో రూ.29999 కే కొనుగోలు చేయవచ్చు. 3 లేదా 6 నెలల వరకు నో కాస్ట్‌ EMI ఆప్షన్‌లో కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. 6.78 అంగుళాల 1.5k అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 8s జెన్ 4 చిప్‌సెట్, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Funtouch OS 15 ను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 7000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది.

అలాగే ఐకూ 13 ఫోన్‌ను రూ.52999 కే సొంతం చేసుకోవచ్చు. నో కాస్ట్‌ EMI ఆప్షన్‌ కూడా ఉంది. అమెజాన్ ప్రైమ్‌ డే 2025 సేల్‌ను గతంలో కేవలం ఒక్కరోజు మాత్రమే నిర్వహించేవారు. అయితే ఈసారి ప్రత్యేకంగా 3 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. కేవలం ప్రైమ్‌ మెంబర్లు మాత్రమే సేల్‌ లో పాల్గొనేందుకు అవకాశం ఉంది. బ్యాంకు కార్డులపై అదనంగా 10 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
iQOO announces best smartphone deals on amazon prime day 2025 sale here is the list
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X