Home
Mobile

50MP కెమెరా, అమోలెడ్‌ డిస్‌ప్లేతో ఐకూ Z సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌.. లాంచ్‌ వివరాలు!

ఐకూ తన కొత్త Z సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ (iQoo Z9 Smartphone) ను మార్చి 12వ తేదీన భారత్‌లో లాంచ్‌ చేయనుంది. అయితే విడుదలకు ముందే ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్లను ఐకూ సంస్థ ధ్రువీకరించింది. ఈ ఫోన్‌ ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7200 చిప్‌సెట్‌పైన పనిచేస్తుందని సంస్థ వెల్లడించింది.

ఈ సెగ్మెంట్‌లో ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7200 చిప్‌సెట్‌ను కలిగి ఉన్న తొలి ఐకూ ఫోన్‌ Z9 అని సంస్థ వెల్లడించింది. దీంతోపాటు ఈ ఐకూ హ్యాండ్‌సెట్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే సహా 1800 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంటుందని ఐకూ వెల్లడించింది.

iQoo confirmed Z9 Smartphone specs

దీంతోపాటు ఐకూ Z9 స్మార్ట్‌ఫోన్‌ 50MP ప్రైమరీ సోనీ IMX882 కెమెరాను కలిగి ఉంటుందని పేర్కొంది. ఈ కెమెరా OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సామర్థ్యంతో వస్తుందని తెలిపింది. మెరుగైన ఆడియో కోసం ఈ హ్యాండ్‌సెట్‌ డ్యూయల్‌ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంటుందని తెలిపింది. దీంతోపాటు 7.83mm సొగసైన డిజైన్‌తోపాటు 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని పేర్కొంది.

** ఐకూ నుంచి భారత్ మార్కెట్‌లో ఫిబ్రవరి 22న ఐకూ నియో 9 ప్రో లాంచ్‌ అయింది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Funtouch OS 14 అవుట్‌ ఆఫ్‌ ది బాక్స్‌తో పనిచేస్తుంది. మరియు ఈ హ్యాండ్‌సెట్‌ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల LTPO అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు సోనీ IMX920 సెన్సార్‌ 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది.

ఐకూ నియో 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.37,999 గా ఉంది. 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీతో హ్యాండ్‌సెట్‌ ధర రూ.39,999 కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ కాంకరర్‌ బ్లాక్‌ మరియు ఫియరీ రెడ్‌ రంగుల్లో లభిస్తుంది.

ఈ నియో 9 ప్రో స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్‌ 14 ఆధారంగా Funtouch OS 14 పైన పనిచేస్తుంది. మరియు 3 సంవత్సరాలపాటు OS అప్‌డేట్ల మరియు 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తుందని సంస్థ పేర్కొంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.78 అంగుళాల 1.5k LTPO అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

ఈ ఫోన్‌ వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాలున్నాయి. OIS సపోర్టుతో 50MP కెమెరా మరియు 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాను అమర్చారు. 120W సూపర్‌వోక్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5160mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
iQoo confirmed Z9 Smartphone specs and key features ahead of launch in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X