7000mAh భారీ బ్యాటరీ. 6.78 అంగుళాల భారీ డిస్‌ప్లే. రెండు చిప్‌సెట్‌లతో ఐకూ స్మార్ట్‌ఫోన్.. ఇవాళ్టి నుంచే..!
iQOO Neo 10 Smartphone : ఐకూ నియో 10 స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో విడుదల అయింది. ఈ ఫోన్ 7000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. 144Hz రీఫ్రెష్ రేట్‌తో 1.5k డిస్‌ప్లేను కలిగి ఉంది. గేమింగ్ కోసం ప్రత్యేకంగా చిప్‌సెట్‌ను కూడా కలిగి ఉంది. దీంతోపాటు భారీ వేపర్ కూలింగ్ ఛాంబర్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌ను ఇవాళ్టి నుంచే ప్రీ బుకింగ్ చేసుకొనేందుకు వీలుంది.
ఐకూ నియో 10 స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
ఈ ఐకూ స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల 1.5k అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 120Hz రీఫ్రెష్ రేట్, 5500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్, 4320Hz PWM డిమ్మింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ఇన్‌ఫెర్నో రెడ్, టైటానియం క్రోమ్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు.

రెండు చిప్‌సెట్‌లు :
ఈ హ్యాండ్‌సెట్ రెండు చిప్‌సెట్‌లతో పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 తోపాటు గేమింగ్ కోసం Q1 చిప్‌సెట్‌ను కూడా కలిగి ఉంది. ఈ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ గరిష్ఠంగా 16GB LPDDR5x ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత FuntouchOS 15 ను కలిగి ఉంది. 3 సంవత్సరాల OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతుంది.
కూలింగ్ ఛాంబర్ :
మల్టీ టాస్కింగ్, గేమింగ్ సమయాల్లో ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ఈ ఫోన్ 7000mm Sq కూలింగ్ ఛాంబర్‌ను కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ గేమింగ్ సమయంలో 144fps, 3000Hz ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్, బైపాస్ ఛార్జింగ్, నైట్ విజన్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఈ ఫోన్ సర్కిల్ టూ సెర్చ్, ఏఐ నోట్ అసిస్ట్, లైవ్ టెక్స్ట్, AI Erase, AI Photo Enhance, AI Magic Move, AI డాక్యుమెంట్, AI స్క్రీన్ ట్రాన్సిలేషన్, AI ట్రాన్స్‌క్రిప్ట్, AI సూపర్ లింక్, AI Image Expander వంటి అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంది.
కెమెరా వివరాలు :
కెమెరా విభాగం పరంగా ఐకూ ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ 32MP కెమెరాను అమర్చి ఉంది. ఈ కెమెరాల ద్వారా 60fps వద్ద 4K వీడియోలను రికార్డు చేయవచ్చు.
7000mAh భారీ బ్యాటరీ :
ఈ ఫోన్ 120W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. సింగిల్ ఛార్జింగ్‌తో రెండు రోజులపాటు వినియోగించుకొనే వీలుంది. ఈ ఫోన్ IP65 రేటింగ్‌తో డస్ట్ మరియు స్ల్పాష్ రెసిస్టెంట్‌గా ఉంది. బ్లూటూత్ 5.4, వైఫై 7, NFC వంటి ఫీచర్‌లున్నాయి.
ఐకూ నియో 10 స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
ఐకూ నియో 10 స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.31999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.33999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.35999 గా ఉంది. ఈ ఫోన్ 16GB ర్యామ్ వేరియంట్‌లోనూ అందుబాటులో ఉంటుంది.
ఐకూ నియో 10 హ్యాండ్‌సెట్ 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.40999 గా ఉంది. మే 26 మధ్యాహ్నం 1PM నుంచి ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. అయితే జూన్ 3 నుంచి సేల్ ప్రారంభం కానుంది. ఐకూ ఇండియా ఇ-స్టోర్, అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








