7000mAh భారీ బ్యాటరీ, గేమింగ్ చిప్‌సెట్, 1.5k అమోలెడ్ డిస్‌ప్లేతో iQOO స్మార్ట్‌ఫోన్.. లాంచ్ వివరాలు
iQOO Neo 10 Smartphone : ఐకూ నుంచి భారత్ మార్కెట్‌లోకి ఇటీవల 7300mAh భారీ బ్యాటరీతో ఐకూ Z10 స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. అయితే త్వరలో ఐకూ నుంచి భారీ బ్యాటరీ, బెస్ట్ గేమింగ్ పెర్ఫామెన్స్‌తో ఐకూ నియో 10 స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ఈ సంవత్సరం మార్చి నెలలో ఐకూ నియో 10R స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది. మే 26 వ తేదీన ఐకూ నియో 10 స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. మరియు అమెజాన్ ద్వారా అందుబాటులోకి రానుంది.
ఐకూ నియో 10 స్మార్ట్‌ఫోన్ గురించి తాజాగా అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్ AnTuTu స్కోర్‌తోపాటు కెమెరా, చిప్‌సెట్, బ్యాటరీ, డిస్‌ప్లే వంటి వివరాలు వెల్లడయ్యాయి. దీంతోపాటు అమెజాన్ ల్యాండింగ్ పేజీ ఆధారంగా ఈ ఫోన్ ధర వివరాలు వెల్లడయ్యాయి.

ఐకూ నియో 10 స్మార్ట్‌ఫోన్ 144Hz రీఫ్రెష్ రేట్, 5500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తో 1.5K రిజల్యూషన్‌తో కూడిన అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 8.09mm థిక్‌నెస్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ టైటానియం క్రోమ్, Inferno రెడ్ వంటి రెండు కలర్ వేరియంట్స్‌లో అందుబాటులోకి వస్తుంది.
ఐకూ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. మరియు గేమింగ్ కోసం ప్రత్యేకంగా Q1 చిప్‌సెట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ చిప్‌సెట్ LPDDR5X ర్యామ మరియు UFS 4.1 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. మరియు మెరుగైన థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం 7000mm Sq వేపర్ కూలింగ్ ఛాంబర్‌ను కలిగి ఉంటుంది. గేమింగ్ సమయంలో 144fps అందిస్తుంది.
ఈ చిప్‌సెట్ 2.42 మిలియన్ AnTuTu స్కోర్‌ను కలిగి ఉన్నట్లు ఐకూ తెలిపింది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ భారీ బ్యాటరీతో అందుబాటులోకి రానుంది. 120W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. కేవలం 15 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీని ఛార్జింగ్ చేయవచ్చని ఐకూ చెబుతోంది.
కెమెరా విభాగం పరంగా ఈ ఐకూ నియో 10 స్మార్ట్‌ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP సోనీ పొర్ట్రెయిట్ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను అమర్చి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న వివరాల ఆధారంగా ఐకూ నియో 10 స్మార్ట్‌ఫోన్ రూ.35 వేల ధర సెగ్మెంట్‌లో అందుబాటులోకి రానుంది.
* ఈ సంవత్సరం మార్చి నెలలో విడుదల అయిన స్మార్ట్‌ఫోన్ ఐకూ నియో 10R స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.26,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.28,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.30,999 గా ఉంది.
ఐకూ నియో 10R స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 ను కలిగి ఉంది. అడ్వాన్స్‌డ్ కూలింగ్ టెక్నాలజీతో కూడిన 6043mm వేపర్ కూలింగ్ ఛాంబర్‌ను కలిగి ఉంది.
ఐకూ ఫోన్ 50MP సోనీ IMX882 కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌తోపాటు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 80W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6400mAh బ్యాటరీని కలిగి ఉంది. IP65 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.


Click it and Unblock the Notifications







