7000mAh భారీ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్, భారీ డిస్‌ప్లేతో ఐకూ స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ
ఐకూ నుంచి త్వరలో భారత్ మార్కెట్‌లోకి ఐకూ నియో 10 స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. తాజాగా ఇందుకు సంబంధించిన వివరాలను సంస్థ వెల్లడించింది. ఈ ఫోన్ మే 26 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు (iQOO Neo 10 Smartphone Launch Date) విడుదల కానుంది. ఈ ఫోన్ ఐకూ ఇండియా వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్ ద్వారా అందుబాటులోకి రానుంది. దీంతోపాటు అనేక స్పెసిఫికేషన్‌లను కూడా విడుదల చేసింది. ఇప్పటికే భారత్ మార్కెట్‌లో ఐకూ నియో 10R స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది.
భారీ బ్యాటరీ, శక్తివంతమైన చిప్‌సెట్ :
ఐకూ నియో 10 స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ LPDDR5X ర్యామ్ మరియు UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ 7000mm2 వేపర్ కూలింగ్ ఛాంబర్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 120W ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

భారీ డిస్‌ప్లే :
టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ వివరాల ఆధారంగా ఐకూ నియో 10 స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల 1.5k TCL C9+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ డిస్‌ప్లే 2000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. మరియు Schott డైమండ్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్‌ను పొందుతుంది.
50MP ప్రైమరీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 50MP సోనీ LYT 600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16MP కెమెరాతో అందుబాటులోకి రానుందని సమాచారం.
Two powerhouses. One mission — peak performance. ⚡
— iQOO India (@IqooInd) May 8, 2025
The all-new #iQOONeo10 is powered by the Snapdragon 8s Gen 4 and the advanced Supercomputing Chip Q1, working in tandem to deliver flagship-level speed, stable frame rates, and ultra-smooth gameplay.
Built for those who never… pic.twitter.com/pq0jNd21oy
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తుంది. మరియు IP65 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. మెరుగైన ఆడియో క్వాలిటీ కోసం డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర సుమారు రూ.35000 గా ఉంటుందని తెలుస్తోంది.
ఐకూ నియో 10R స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
ఈ సంవత్సరం మార్చి నెలలో ఐకూ నియో 10R స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్లో లాంచ్ అయింది, ఈ ఫోన్ 8GB/128GB ధర రూ.26,999, 8GB/256GB ధర రూ.28,999, 12GB/256GB ధర రూ.30,999 గా ఉంది. ఈ ఐకూ హ్యాండ్‌సెట్ 6.78 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 144Hz రీఫ్రెష్ రేట్, 4500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది.
iQOO Neo 10 is launching in India on May 26, 2025. ✅
— Abhishek Yadav (@yabhishekhd) May 8, 2025
Price under 💰 ₹35,000
Specifications
📱 6.78" 1.5K TCL C9+ OLED display, 120Hz refresh rate, 2000nits HBM, 4320Hz PWM, Schott Diamond Shield glass protection
🔳 Qualcomm Snapdragon 8s Gen 4 chipset
LPDDR5x RAM & UFS 4.0… pic.twitter.com/dxQfCOKz0e
ఐకూ నియో 10R హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. Adreno 735 GPU ను కూడా కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 ను కలిగి ఉంది. అడ్వాన్స్‌డ్ కూలింగ్ టెక్నాలజీతో 6043mm వేపర్ కూలింగ్ ఛాంబర్‌ను కలిగి ఉంది. గేమింగ్ కోసం ఈ-స్పోర్ట్స్ మోడ్‌ను కలిగి ఉంది.
ఈ ఫోన్ 80W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6400mAh బ్యాటరీని కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా 50MP సోనీ IMX882 కెమెరాతోపాటుు 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది. IP65 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








