Home
Mobile

7000mAh భారీ బ్యాటరీ, 144Hz రీఫ్రెష్ రేట్‌, 50MP ప్రైమరీ కెమెరాతో 5G స్మార్ట్‌ఫోన్‌.. రేపే విడుదల..!

ఐకూ నియో 10 స్మార్ట్‌ఫోన్ (iQOO Neo 10 Smartphone) భారత్‌ మార్కెట్‌లో రేపు విడుదల కానుంది. ఈ ఫోన్‌ గురించి ఇప్పటికే అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్ 1.5K రిజల్యూషన్‌తో అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. అయితే ఈ ఫోన్ 7000mAh భారీ బ్యాటరీతో విడుదల కానుంది. మార్చి నెలలో విడుదల అయిన ఐకూ నియో 10R స్మార్ట్‌ఫోన్ 6400mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌ అమెజాన్ ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటుంది.

5500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ :
ఐకూ నియో 10 స్మార్ట్‌ఫోన్ డిజైన్ ఇప్పటికే విడుదల అయింది ఈ ఫోన్ ఇన్‌ఫెన్నోరెడ్‌ మరియు టైటానియం క్రోమ్ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది. మరియు ఈ ఫోన్ 8.09mm థిక్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 1.5K రిజల్యూషన్‌తో అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 5500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది.

iQOO Neo 10 Smartphone

స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌ :
ఈ హ్యాండ్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్‌ 8s జెన్‌ 4 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీంతోపాటు సూపర్‌ కంప్యూటింగ్‌ చిప్‌ Q1 ను కూడా కలిగి ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌ గరిష్ఠంగా LPDDR5x ర్యామ్‌, UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌ 7000mm Sq వేపర్‌ కూలింగ్‌ ఛాంబర్‌ను కలిగి ఉంటుంది.

ఈ ఫోన్‌ గేమింగ్‌ సమయంలో 144fps తో అందుబాటులోకి వస్తుంది. దీంతోపాటు 2.42 మిలియన్‌ AnTuTu స్కోర్‌ను కలిగి ఉంటుందని ఐకూ చెబుతోంది. మల్టీ టాస్కింగ్‌, గేమింగ్‌ కోసం ఈ ఫోన్లు అత్యంత అనుకూలంగా ఉంటాయని తెలుస్తోంది.

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో OIS సపోర్టుతో 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరాలు 60fps వద్ద 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తాయి.

7000mAh భారీ బ్యాటరీ :
ఐకూ స్మార్ట్‌ఫోన్‌ 120W ఫ్లాష్‌ ఛార్జ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ విడుదల అనంతరం ఐకూ ఇ-స్టోర్‌, అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఐకూ స్మార్ట్‌ఫోన్ రూ.35 వేల ధరలో లాంచ్‌ కానుందని తెలుస్తోంది.

ఈ సంవత్సరం మార్చి నెలలో ఐకూ నియో 10R స్మార్ట్‌ఫోన్‌ 6.78 అంగుళాల 1.5K అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 8s జెన్‌ 3 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 తో పనిచేస్తోంది. థర్మల్‌ మేనేజ్‌మెంట్‌ కోసం 6043mm వేపర్‌ కూలింగ్‌ ఛాంబర్‌ను కలిగి ఉంది.

ఈ ఫోన్ 80W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6400mAh బ్యాటరీని కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా 50MP సోనీ IMX882 కెమెరా, 8MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.26,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.28,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.30,999 గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
iQOO Neo 10 Smartphone launching on tomorrow in india with 7000mAh battery
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X