Home
Mobile

7000mAh భారీ బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్‌ప్లేతో 5G స్మార్ట్‌ఫోన్‌.. రూ.2 వేల డిస్కౌంట్‌తో జూన్‌ 3 నుంచి సేల్‌!

ఐకూ సంస్థ భారత్‌ మార్కెట్‌లో గత వారం ఐకూ నియో 10 స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్‌ సేల్‌ జూన్‌ 3 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈ ఫోన్ 6.78 అంగుళాల డిస్‌ప్లే, 7000mAh భారీ బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. ఈ ఫోన్‌ పూర్తి డిస్కౌంట్‌ల వివరాలు.

ఐకూ నియో 10 స్మార్ట్‌ఫోన్‌ను ఐకూ ఇండియా స్టోర్‌తోపాటు అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.31999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.33999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.35999, 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.40999 గా ఉంది.

iQOO Neo 10 Smartphone sale

సేల్‌ జూన్‌ 3 వ తేదీ ప్రారంభం కానుంది. సేల్‌లో (iQOO Neo 10 Smartphone Sale) భాగంగా HDFC, SBI బ్యాంకు క్రెడిట్‌ కార్డులతో రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా ఈ ఫోన్‌ ప్రారంభ ధర రూ.29,999 గా ఉంటుంది. జూన్‌ 1 అర్ధరాత్రి వరకు ఈ ఫోన్‌ను ముందస్తు బుకింగ్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంది.

డిస్‌ప్లే, బ్యాటరీ :
ఐకూ నియో 10 స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.78 అంగుళాల 1.5k అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 5500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 360Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్ కలిగి ఉంది. ఈ ఫోన్‌ 120W వైర్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 7000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది.

డ్యూయల్ చిప్‌సెట్ :
ఈ ఫోన్‌ డ్యూయల్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్‌ 8s జెన్ 4 చిప్‌సెట్‌తోపాటు గేమింగ్‌ కోసం Q1 చిప్‌సెట్‌ను కూడా అమర్చారు. స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌ గరిష్ఠంగా 16GB LPDDR5x ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది.

ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత FuntouchOS 15 పైన పనిచేస్తుంది. గేమింగ్‌, మల్టీ టాస్కింగ్‌ సమయాల్లో ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు 7000mm Sq కూలింగ్‌ ఛాంబర్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌ 3 సంవత్సరాల OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ పొందుతుందని ఐకూ తెలిపింది.

50MP కెమెరా :
ఐకూ నియో 10 హ్యాండ్‌సెట్ వెనుక వైపు 50MP సోనీ IMX882 (OIS) ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ కెమెరాలతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP కెమెరాను అమర్చి ఉంది. 4K వీడియోలను రికార్డు చేయవచ్చు. సర్కిల్ టు సెర్చ్‌, AI Note Assist, Live Text, AI డాక్యుమెంట్‌, AI Erase, AI Photo Enhance, AI స్క్రీన్‌ ట్రాన్సిలేషన్‌, AI Image Expander సహా మరిన్ని ఫీచర్‌లున్నాయి. బైపాస్‌ ఛార్జింగ్‌, నైట్‌ విజన్ మోడ్‌ వంటి ఫీచర్లున్నాయి.

కనెక్టివిటీ పరంగా ఈ ఫోన్‌ వైఫై 7, బ్లూటూత్‌ 5.4, NFC, USB-C ఫీచర్‌లున్నాయి. సెక్యూరిటీ కోసం ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. IP65 రేటింగ్‌తో డస్ట్‌, స్ల్పాష్‌ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్‌ టైటానియం క్రోమ్, ఇన్‌ఫెర్నో రెడ్‌ కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
iQOO Neo 10 Smartphone sale to start from june 3 via amazon here is the bank deal
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X