Home
Mobile

7000mAh భారీ బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, 6.78 అంగుళాల భారీ డిస్‌ప్లేతో 5G స్మార్ట్‌ఫోన్‌.. పూర్తి వివరాలు..!

iQOO Neo 10 Smartphone : ఐకూ నుంచి భారత్‌ మార్కెట్‌లోకి ఇటీవల ఐకూ నియో 10R తోపాటు ఐకూ Z10, ఐకూ Z10x స్మార్ట్‌ఫోన్‌లు కూడా విడుదల అయ్యాయి. ఐకూ Z10 స్మార్ట్‌ఫోన్‌ ఏకంగా 7300mAh బ్యాటరీతో పనిచేస్తోంది. అదే Z10x స్మార్ట్‌ఫోన్‌ 6500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఐకూ నియో 10R స్మార్ట్‌ ఫోన్‌ కూడా 6400mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. గేమింగ్‌ కోసం ఈ ఫోన్‌లో అనేక ప్రత్యేక ఫీచర్‌లు ఉన్నాయి.

ఐకూ నుంచి త్వరలో మరో హ్యాండ్‌సెట్‌ లాంచ్‌ కానుంది. ఐకూ నియో 10 పేరుతో విడుదల కానుంది. టీజర్‌ను విడుదల చేసింది. మరియు ఇప్పటికే ఇందుకు సంబంధించిన డిజైన్‌ ను విడుదల చేసింది. ఆరెంజ్‌, వైట్‌ డ్యూయల్‌ టోన్‌ కలర్ వేరియంట్‌లో ఈ ఫోన్‌ లాంచ్‌ కానుంది. దీంతోపాటు ఈ ఫోన్‌ డ్యూయల్‌ చిప్‌ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

iQOO Neo 10 Smartphone teased

ప్రస్తుతం ఉన్న వివరాల ఆధారంగా ఐకూ నియో 10 స్మార్ట్‌ఫోన్‌.. ఇటీవల చైనాలో లాంచ్ అయిన ఐకూ Z10 టర్బో ప్రో స్మార్ట్‌ఫోన్‌కు రీబ్రాండెడ్‌ వెర్షన్‌గా విడుదల కానుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ ఐకూ ఇండియా వెబ్‌సైట్‌తోపాటు ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ద్వారా అందుబాటులోకి రానుంది.

ఈ ఐకూ నియో 10 స్మార్ట్‌ఫోన్‌ డ్యూయల్‌ చిప్‌సెట్ గేమింగ్‌ ఫోకస్‌గా అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్‌ 8s జెన్‌ 4 SoC చిప్‌సెట్‌ మరియు ఐకూ Q1 గ్రాఫిక్స్‌ చిప్‌సెట్ ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

ఫలితంగా గేమింగ్‌ సమయంలో మెరుగైన పనితీరును అందిస్తుందని తెలుస్తోంది. మల్టీ టాస్కింగ్‌, గేమింగ్‌ సమయంలో థర్మల్‌ మేనేజ్‌మెంట్‌ కోసం ఈ ఫోన్‌ 7K VC లిక్విడ్‌ కూలింగ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన డిస్‌ప్లే, కెమెరా సహా ఇతర అంచనా వివరాలు లీక్‌ అయ్యాయి.

లీక్స్‌ ఆధారంగా ఐకూ Z10 టర్బో ప్రో స్మార్ట్‌ఫోన్‌కు రీబ్రాండెడ్‌ వెర్షన్‌గా వస్తే.. భారత్‌ మార్కెట్‌లో ఐకూ నియో 10 స్మార్ట్‌ఫోన్‌ 6.78 అంగుళాల 1.5K రిజల్యూషన్‌తో అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు ఈ డిస్‌ప్లే 144Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది.

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టేబిలైజేషన్‌) 50MP సోనీ LYT 600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ముందువైపు 32MP కెమెరాను కలిగి ఉంటుందని సమాచారం.

ఇటీవల ఐకూ నుంచి వచ్చిన భారీ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌ల తరహాలోనే ఐకూ నియో 10 స్మార్ట్‌ఫోన్‌ 120W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ IP65 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.

ఐకూ నియో 10 స్మార్ట్‌ఫోన్‌ భారత్ మార్కెట్‌లో ఈ నెల చివర్లో విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే దీనిపై ఐకూ ఎటువంటి ప్రకటన చేయలేదు. అమెజాన్‌ ద్వారా అందుబాటులోకి రానుంది. దీంతోపాటు ధర, ఇతర వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
iQOO Neo 10 Smartphone teased in india may rebranded version of iqoo Z10 turbo pro phone
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X