Home
Mobile

6400mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ 5G ఫోన్‌ సేల్‌.. రూ.3000 డిస్కౌంట్‌..!

భారత్‌ మార్కెట్‌లో ఈ నెల 11 వ తేదీ ఐకూ నియో 10R స్మా్ర్ట్‌ఫోన్‌ లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ సేల్‌ రేపటి నుంచి (iQOO Neo 10R 5G Smartphone Sale) ప్రారంభం కానుంది. ఈ ఫోన్‌ అనేక మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది. భారీ డిస్‌ప్లే, భారీ బ్యాటరీని కలిగి ఉంది. గేమింగ్‌ కోసం ప్రత్యేక ఫీచర్‌లను కలిగి ఉంది. ప్రారంభ సేల్‌లో భాగంగా డిస్కౌంట్‌ను అందిస్తోంది.

స్టోరేజీ వేరియంట్స్‌ :
ఐకూ నియో 10R స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.26,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.28,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.30,999 గా ఉంది. ఈ ఫోన్‌ రేజింగ్‌ బ్లూ, మూన్‌లైట్‌ టైటానియం కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

iQOO Neo 10R 5G Smartphone sale

రూ.3000 డిస్కౌంట్‌ :
తొలి సేల్‌లో భాగంగా అమెజాన్‌లో కూపన్‌ కోడ్‌ డిస్కౌంట్‌ ద్వారా రూ.1000 తగ్గింపును పొందవచ్చు. మరియు ICICI, SBI, HDFC బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఐకూ ఇండియా ఇ-స్టోర్‌ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.

4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ :
ఐకూ నియో 10R స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తోంది. 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని ఐకూ తెలిపింది. స్నాప్‌డ్రాగన్‌ 8s జెన్‌ 3 ప్రాసెసర్‌ ను కలిగి ఉంది.

ఈ చిప్‌సెట్‌ Adreno 735 GPU, 12GB LPDDR5X ర్యామ్‌, 256GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంది. అడ్వాన్సడ్‌ కూలింగ్‌ టెక్నాలజీతో కూడిన 6043mm వేపర్‌ కూలింగ్‌ ఛాంబర్‌ను అమర్చారు. గేమింగ్‌ కోసం ప్రత్యేకంగా ఈ-స్పోర్ట్‌ మోడ్‌ను కలిగి ఉంది. AI Erase, అల్ట్రా క్లియర్‌ వంటి ఫీచర్‌లు ఉన్నాయి.

Take a Poll

భారీ డిస్‌ప్లే :
ఈ హ్యాండ్‌సెట్‌ 6.78 అంగుళాల 1.5K అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1260*2800 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, 144Hz రీఫ్రెష్‌ రేట్‌, 4500 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 300Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌తో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే HDR10+ సపోర్టును కలిగి ఉంది.

6400mAh బ్యాటరీ :
ఐకూ హ్యాండ్‌సెట్‌ 50MP సోనీ IMX882 ప్రైమరీ, 8MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరాలను కలిగి ఉంది. మరియు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 80W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6400mAh బ్యాటరీతో పనిచేస్తోంది. స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువ సమయం ఉపయోగించే వారికి ఈ భారీ బ్యాటరీ ఫోన్‌ అనుకూలంగా ఉంటుంది.

కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్ 5.4, వైఫై 7, GPS, NaVlc, BeiDou, GNSS, GALILEO, GLONASS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. యాంబియంట్‌ లైట్‌ సెన్సార్‌, గైరోస్కోప్‌, ప్రాక్సిమిటీ సెన్సార్‌, యాక్సెలిరోమీటర్‌, IR వంటి సెన్సార్‌లను కలిగి ఉంది. ఆప్టికల్ ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌, IP65 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
iQOO Neo 10R 5G Smartphone sale to start from tomorrow, rs3000 Discount on First sale
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X