Home
Mobile

ఏకంగా రూ.5 వేల డిస్కౌంట్‌.. 6400mAh బ్యాటరీ, గేమింగ్‌ ఫీచర్లు, 50MP కెమెరా 5G స్మార్ట్‌ఫోన్‌!

ఐకూ సంస్థ భారత్ మార్కెట్‌లో అనేక స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఎంట్రీ లెవల్‌ నుంచి మిడ్‌ రేంజ్ వరకు అనేక మోడల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సంవత్సరం తొలిభాగంలో ఐకూ నియో 10R స్మార్ట్‌ఫోన్‌ను (iQOO Neo 10R 5G Smartphone) లాంచ్‌ చేసింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారీ డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది. ఈ స్మా్‌ర్ట్‌ఫోన్‌ 6400mAh బ్యాటరీ, 50MP ప్రైమరీ కెమెరా సహా అనేక ప్రత్యేక ఫీచర్‌లను కలిగి ఉంది.

విడుదల ధరతో పోలిస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉండగా.. అమెజాన్‌లో మరింత అదనపు డిస్కౌంట్‌ను పొందవచ్చు. రానున్న రోజుల్లో మరింత డిస్కౌంట్‌ను పొందే అవకాశం ఉంది. ఐకూ నియో 10R స్మార్ట్‌ఫోన్‌ విడుదల సమయంలో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.26,999 గా ఉండేది.

iQOO Neo 10R 5G Smartphone

అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.28,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.30,999 గా ఉండేది. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ వేరియంట్స్‌ ధరలు రూ.24998, రూ.26998, రూ.28998 గా ఉన్నాయి. అంటే రూ.2000 డిస్కౌంట్‌ను పొందాయి.

ప్రస్తుతం అమెజాన్‌లో కూపన్‌ కోడ్‌ ద్వారా బేస్‌ వేరియంట్‌ పైన రూ.2000, మిగిలిన రెండు వేరియంట్స్‌పై కూపన్‌ కోడ్‌ ద్వారా రూ.3000 అదనపు తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా 8GB/128GB ధర రూ.22,998, 8GB/256GB ధర రూ.23,998, 12GB/256GB ధర రూ.25,998 గా ఉంది.

ఏకంగా రూ.5 వేలు డిస్కౌంట్ :
ఐకూ నియో స్మార్ట్‌ఫోన్‌ బేస్‌ వేరియంట్‌పైన మొత్తంగా రూ.4000, అదే మిగిలిన రెండు స్టోరేజీ వేరియంట్స్‌పైన రూ.5000 చొప్పున డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ రేజింగ్‌ బ్లూ, మూన్‌లైట్‌ టైటానియం కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

iQOO Neo 10R 5G Smartphone

ఐకూ నియో 10R స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఐకూ నియో 10R స్మార్ట్‌ఫోన్‌ 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.78 అంగుళాల 1.5K అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 4500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 300Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 80W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6400mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్‌ 8s జెన్‌ 3 చిప్‌సెట్‌, Adreno 735 GPU ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తోంది. 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ పొందుతుంది. అడ్వాన్సడ్‌ కూలింగ్‌ టెక్నాలజీతో 6043mm వేపర్‌ కూలింగ్‌ ఛాంబర్‌ను కలిగి ఉంది.

కెమెరా విభాగం పరంగా 50MP సోనీ IMX882, 8MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరాలు, 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో AI Erase, Ultra Clear వంటి ఫీచర్‌లున్నాయి. గేమింగ్‌ కోసం ప్రత్యేకంగా ఈ స్పోర్ట్‌ మోడ్‌ను కలిగి ఉంది. IP65 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. భద్రత కోసం ఆప్టికల్‌ ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు.

Best Mobiles in India

English summary
iQOO Neo 10R 5G Smartphone with 6400mAh battery Gets Rs5000 discount on amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X