iQOO Neo 10R లాంచ్ డేట్ ఫిక్స్.. 17 లక్షల AnTuTu స్కోరుతో రికార్డు బద్దలు.. డిజైన్, ఫీచర్లు, ధర చూస్తే షాకవుతా
iQOO Neo 10R: iQOO Neo 10R స్మార్ట్‌ఫోన్ మార్చి 11న ఇండియాలో లాంచ్ అవ్వడానికి రెడీ అయిపోయింది. నియో సిరీస్‌లో \"R\" అనే కొత్త పేరుతో వస్తున్న మొట్టమొదటి ఫోన్ ఇదే. ధర ఎంతో ఇంకా చెప్పకపోయినా, రూ.30,000లోపే ఉంటుందని మాత్రం కంపెనీ స్పష్టం చేసింది. దీంతో మిడ్-రేంజ్ ఫోన్ల మార్కెట్‌లో ఇది పెద్ద సంచలనం సృష్టించబోతోంది. ఈ ఫోన్‌లో అసలు హైలైట్ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు.
ఐకూ సంస్థ ప్రకారం, ఈ ఫోన్ అన్‌టుటు (AnTuTu) టెస్టులో ఏకంగా 17 లక్షలకు పైగా స్కోర్ చేసిందంట. ఈ ప్రైస్ రేంజ్‌లో ఇంత స్కోర్ ఏ ఫోన్‌కీ రాలేదు, అదీ 2025, మార్చి నాటికి. దీనికి కారణం స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్.

ఈ చిప్‌సెట్ వల్ల గేమ్స్ ఆడినా, మల్టీ టాస్కింగ్ చేసినా ల్యాగ్ ఉండదు. బ్యాటరీ కూడా ఎక్కువ సేపు వస్తుందట. ఇది 4nm టెక్నాలజీతో తయారుచేశారు కాబట్టి, బ్యాటరీ లైఫ్ విషయంలో కూడా తిరుగుండదు. తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్లు ఇవ్వడంలో iQOO ఎప్పుడూ ముందుంటుంది. Neo 10Rతో ఆ ట్రెండ్‌ను కంటిన్యూ చేస్తోంది.
ఈ సెగ్మెంట్‌లో ఇదే అత్యంత పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్\" అని X (ట్విట్టర్) లో టీజర్ పోస్ట్ కూడా పెట్టింది కంపెనీ. అయితే, ఇది రూ.30,000 లోపు ఫోన్లలో మార్చి 2025 నాటికి అన్‌టుటు స్కోర్ల ఆధారంగా చేసిన క్లెయిమ్ మాత్రమే. ఇది నిజంగానే అంత పవర్‌ఫుల్ ఫోనా కాదా అనేది రివ్యూలు వచ్చాకే తెలుస్తుంది.
* డిజైన్
Neo 10R డిజైన్ కూడా లీక్ అయిపోయింది. ఇది రెండు కలర్లలో వస్తోంది. 1. మూన్‌నైట్ టైటానియం,ఇది మెటాలిక్ లుక్‌తో మెరిసే సిల్వర్ లేదా గ్రే కలర్‌లో ఉండొచ్చు. 2.రేజింగ్ బ్లూ, ఇది డ్యూయల్ టోన్ డిజైన్‌తో చాలా స్టైలిష్‌గా, వైబ్రెంట్‌గా ఉంటుంది.
* ఫీచర్లు లీక్
ఇప్పటికే లీకైన సమాచారం, పాత iQOO ఫోన్లను చూస్తే డిస్‌ప్లే, కెమెరాలు, బ్యాటరీ ఎలా ఉండొచ్చో ఒక అంచనాకు రావచ్చు. ఈ ఫోన్‌లో 6.78- అంగుళాల OLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్‌తో రావచ్చని అంటున్నారు. గేమింగ్, స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటాయి.
* కెమెరాలు
వెనుకవైపు 50MP మెయిన్ కెమెరా (సోనీ LYT-600 సెన్సార్), 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉండొచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఇవ్వొచ్చు. 6,400mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో ఈ మొబైల్ రావచ్చు. మార్చి 11న ఐకూ ఈ ఫోన్ అసలు ధర, పూర్తి ఫీచర్లను అధికారికంగా ప్రకటించనుంది.
అప్పటివరకు, మంచి పెర్ఫార్మెన్స్ అందించే మొబైల్ కావాలనుకునే వారు వెయిట్ చేయడం మంచిది. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ఫోన్ కోసం చూసేవాళ్లకి Neo 10R ఒక మంచి ఆప్షన్ అవుతుందని చెప్పవచ్చు. పేపర్ పైన ఫీచర్లు బాగానే ఉన్నాయి కానీ అసలైన రివ్యూలు వచ్చాకే దీని సత్తా ఏంటో తెలుస్తుంది.


Click it and Unblock the Notifications








