Home
Mobile

iQOO Neo 10R ఇండియా ఎడిషన్: లీకైన వివరాలు.. అదిరిపోయే డిస్‌ప్లే, ఫాస్ట్ ప్రాసెసర్ కన్ఫర్మ్.. ధర ఎంతంటే?

వివో సబ్-బ్రాండ్ అయిన ఐకూ (iQOO) దూకుడు మీద ఉంది. ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో తన టాప్-ఎండ్ ఫోన్ ఐకూ 13ని రిలీజ్ చేసిన ఈ కంపెనీ, ఇప్పుడు మిడ్-రేంజ్ సెగ్మెంట్‌పై కన్నేసింది. అందులో భాగంగా చైనాలో దుమ్మురేపుతున్న ఐకూ నియో 10 (iQOO Neo 10), నియో 10 ప్రో (Neo 10 Pro) మోడళ్లను ఇక్కడ కూడా లాంచ్ చేయడానికి రెడీ అవుతోంది.

అంతే కాదు, వీటికి తోడు 'R' సిరీస్‌లో మొట్టమొదటి ఫోన్‌గా ఐకూ నియో 10R (iQOO Neo 10R) అనే సరికొత్త ఫోన్‌ను కూడా ఇండియాలో విడుదల చేయనుంది. దీంతో మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ మరింత హీటెక్కడం ఖాయమని చెప్పొచ్చు.

iQOO Neo 10R India Edition  Leaked Details Confirm Impressive Display  Fast Processor  and More

* ఐకూ నియో 10R లీక్స్

అయితే, ప్రస్తుతం ఐకూ నియో 10R గురించిన లీకులు టెక్ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి. టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ ప్రకారం, ఈ ఫోన్ 2025, ఫిబ్రవరిలో మార్కెట్లోకి రానుంది. దీని మోడల్ నంబర్ I2221గా ఉండనుంది.

స్పెసిఫికేషన్ల విషయానికొస్తే, ఈ ఫోన్ 6.78 అంగుళాల అమోలెడ్ (AMOLED) స్క్రీన్‌తో రానుందని సమాచారం. అంతేకాదు, 144Hz రిఫ్రెష్ రేట్‌ ఆఫర్ చేయనుందని టాక్. దీంతో చాలా స్మూత్‌, ఫాస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందుకోవచ్చు.

లీక్స్ ప్రకారం, ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 (Qualcomm Snapdragon 8s Gen 3) చిప్‌సెట్‌తో లాంచ్ కానుంది. మెమరీ, స్టోరేజ్ విషయానికి వస్తే, 8GB లేదా 12GB ర్యామ్ ఆప్షన్స్‌తో పాటు 256GB లేదా 512GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఈ ఫోన్ రావచ్చు.

* కెమెరాలు

బ్యాక్ సైడ్ 50MP సోనీ LYT 600 మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్‌తో డ్యూయల్ కెమెరా సెటప్ ఉండనుంది. సెల్ఫీల కోసం ముందువైపు 16MP కెమెరా ఇవ్వనున్నారు. 6,400mAh బ్యాటరీతో ఈ ఫోన్ రానుంది. ఇది ఐకూ 13లో ఉన్న 6,000mAh బ్యాటరీ కంటే ఎక్కువే. దీంతో పాటు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయనుంది.

ఈ ఫోన్ బ్లూ వైట్ స్లైస్ (Blue White Slice), లూనార్ టైటానియం (Lunar Titanium) అనే రెండు రంగుల్లో లభించనుంది. ఈ ఫోన్ ధర ఇండియాలో రూ.30,000లోపే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

* ఐకూ నియో 10 ప్రో

ఇది కూడా 2025, ఫిబ్రవరిలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీని స్పెసిఫికేషన్లు దాదాపుగా చైనాలో విడుదలైన మోడల్‌కు దగ్గరగా ఉండే అవకాశం ఉంది. డిస్‌ప్లే విషయానికొస్తే, 6.78 అంగుళాల LTPO AMOLED స్క్రీన్‌తో పాటు 144Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో రానుంది.

క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 (Qualcomm Snapdragon 8 Gen 3) ప్రాసెసర్‌తో పనిచేసే అవకాశం ఉంది. ఇది గరిష్టంగా 16GB LPDDR5X ర్యామ్, 1TB UFS 4.1 స్టోరేజ్‌తో రావచ్చు.

దీని బ్యాక్‌సైడ్‌లో డ్యూయల్ 50MP సెన్సార్లతో కూడిన కెమెరా సెటప్ ఉండనుంది. అందులో ఒకటి మెయిన్ కెమెరా కాగా, మరొకటి అల్ట్రా-వైడ్ లెన్స్. ముందువైపు 16MP కెమెరా ఇవ్వనున్నారు. దీని చైనా మోడల్‌లో 6,100mAh బ్యాటరీ ఉండగా, ఇండియన్ వేరియంట్‌లో కాస్త తక్కువ కెపాసిటీ ఉండొచ్చు.

అయితే, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఇది మార్కెట్లో ఎంట్రీస్తుందని సమాచారం. 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు వంటి ప్రీమియం ఫీచర్లు కూడా దీని సొంతం అవ్వచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
iQOO plans to launch its Neo 10R and Neo 10 Pro in India around February 2025. The Neo 10R features a Snapdragon 8s Gen 3, a large battery, and is priced under Rs 30,000. The Neo 10 Pro boasts a Snapdragon 8 Gen 3
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X