ఇండియాలో ఐకూ నియో 10R లాంచ్ ఫిక్స్.. ధర రూ.30 వేలే.. స్నాప్‌డ్రాగన్ 8s Gen 3తో రచ్చ రచ్చే!!
iQOO Neo 10R: ఐకూ మొబైల్ లవర్స్‌కి, గేమింగ్ ప్రియులకు గుడ్ న్యూస్. ఐకూ కంపెనీ ఇండియాలో తమ కొత్త స్మార్ట్‌ఫోన్ ఐకూ నియో 10Rని లాంచ్ చేయబోతోంది. ఈ విషయాన్ని ఐకూ ఇండియా హెడ్ నిపుణ్ మర్యా స్వయంగా ప్రకటించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. లాంచ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నవారికి త్వరలోనే ఆ శుభవార్త వినపడుతుంది. 2025, ఫిబ్రవరి మొదటి రెండు వారాల్లోనే ఈ ఫోన్ లాంచ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
* ధర మీ బడ్జెట్‌లోనే..
ఐకూ Neo 10R ఫోన్‌లో పవర్ఫుల్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 చిప్‌సెట్ ఉండబోతుంది. ఈ ప్రాసెసర్‌తో ఫోన్ చాలా ఫాస్ట్‌గా పని చేస్తుందని కంపెనీ చెబుతోంది. నిపుణులు అంచనా ప్రకారం ఐకూ నియో 10R ధర ఇండియాలో రూ.30,000లోపే ఉండే ఛాన్స్ ఉంది. సో, బడ్జెట్ ఫ్రెండ్లీ పవర్ ప్యాక్డ్ ఫోన్ కానుంది.

* డిజైన్ అదిరింది, కలర్స్ కూడా సూపర్..
iQOO Neo 10R చూడగానే ఫిదా అయిపోతారు. డ్యూయల్-టోన్ డిజైన్‌తో వస్తోంది. పర్పుల్, వైట్ కలర్స్ కాంబినేషన్‌లో ఫోన్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తోంది. ఈ డిజైన్ చూడటానికి అచ్చం iQOO Neo 9 Pro, చైనాలో రిలీజ్ అయిన ఐకూ Z9 టర్బో లాంగ్ బ్యాటరీ లైఫ్ ఎడిషన్ ఫోన్లను పోలి ఉంది.
* స్పెసిఫికేషన్స్ చూస్తే ఫిదా
ఐకూ నియో 10R స్పెసిఫికేషన్స్ చూస్తే మాత్రం నిజంగానే షాక్ అవుతారు. ఒక్కొక్క ఫీచర్ అదిరిపోయేలా ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
1. ప్రాసెసర్ & పర్ఫార్మెన్స్
ఈ ఫోన్ మెయిన్ హైలైట్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్. ఈ చిప్‌సెట్ ఫోన్‌కి సూపర్ ఫాస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. గేమ్స్ ఆడినా, వీడియోలు చూసినా, మల్టీ టాస్కింగ్ చేసినా ఎక్కడా లాగ్ అనేదే ఉండదు. పర్ఫార్మెన్స్ విషయంలో ఈ ఫోన్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు.
2. డిస్‌ప్లే
ఐకూ నియో 10R స్క్రీన్ క్వాలిటీ 6.78- అంగుళాల AMOLED డిస్‌ప్లే, 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్‌తో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వీడియోలు చూస్తున్నా, గేమ్స్ ఆడుతున్నా ప్రతి విజువల్ క్లియర్‌గా, కలర్‌ఫుల్‌గా ఉంటుంది. 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ దీని సొంతం. రాత్రిపూట కళ్లకి ఇబ్బంది లేకుండా 3840Hz PWM డిమ్మింగ్ ఫీచర్ కూడా ఉంది.
3. ఆపరేటింగ్ సిస్టమ్, బ్యాటరీ & ఛార్జింగ్
iQOO Neo 10R ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. దానితో పాటు ఫన్‌టచ్ OS 15 యూజర్ ఇంటర్‌ఫేస్ ఉంటుంది. ఇది 6,400 mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీతో వస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా హ్యాపీగా వాడుకోవచ్చు. ఛార్జింగ్ స్పీడ్ విషయానికొస్తే, 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఫోన్ నిమిషాల్లో ఫుల్‌ఛార్జ్ అయిపోతుంది.
4. కెమెరాలు
ఫోన్ వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50MP సోనీ LYT-600 సెన్సార్, OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్)తో వస్తుంది. దీనివల్ల ఫోటోలు చాలా క్లారిటీగా, షార్ప్‌గా వస్తాయి. ఇంకో కెమెరా 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16MP కెమెరా ఉంటుంది.
* స్టోరేజ్ & ర్యామ్
iQOO Neo 10R లో 12GB వరకు ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ ఆప్షన్స్ కూడా 256GB వరకు ఉండొచ్చు. అంటే ఫోన్‌లో ఫొటోలు, వీడియోలు, గేమ్స్, యాప్స్ ఇలా ఏది కావాలంటే అది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్టోరేజ్ గురించి అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.


Click it and Unblock the Notifications








