Home
Mobile

భారీ బ్యాటరీ, శక్తివంతమైన చిప్‌సెట్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా..?

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ల తయారీ సంస్థ ఐకూ (iQOO India) ఎట్టకేలకు కొత్త స్మార్ట్‌ ఫోన్‌ తేదీని వెల్లడించింది. ఐకూ నియో 10R స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్‌ ల గురించి ఇటీవల లీక్స్‌ వచ్చాయి. అయితే తాజాగా ఈ హ్యాండ్‌సెట్‌ ఇండియా లాంచ్‌ డేట్‌ ను ఐకూ అధికారికంగా వెల్లడించింది. మిడ్‌ రేంజ్‌ ధర సెగ్మెంట్‌ లో భారీ బ్యాటరీతో ఈ స్మార్ట్‌ఫోన్‌ విడుదల కానుందని తెలుస్తోంది. దీంతోపాటు ఇటీవలే కలర్‌ వేరియంట్‌ వివరాలు కూడా వెల్లడయ్యాయి. ఈ హ్యాండ్‌సెట్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్‌ ల వివరాలు.

ఎప్పుడు విడుదల కానుంది? :
ఐకూ ఇండియా అధికారిక X హ్యాండిల్‌ ద్వారా ఐకూ నియో 10R స్మార్ట్‌ఫోన్‌ (iQOO Neo 10R Smartphone) విడుదల తేదీని ప్రకటన చేసింది. భారత్‌ మార్కెట్‌ లో ఈ ఫోన్‌ మార్చి 11న లాంచ్ కానుందని తెలిపింది. ఐకూ అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం అమెజాన్‌ (Amazon) ద్వారా అందుబాటులోకి రానున్నాయి.

iQOO Neo 10R Smartphone

చిప్‌సెట్‌ వివరాలు :
అమెజాన్‌ ల్యాండింగ్‌ పేజీ ఆధారంగా ఈ ఫోన్‌ స్పెసిఫికేషన్‌ ల వివరాలు వెల్లడయ్యాయి. దీని ఆధారంగా ఐకూ నియో 10R స్మార్ట్‌ఫోన్‌ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 8s జెన్‌ 3 SoC చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. మరియు ఈ చిప్‌సెట్ LPDDR5X ర్యామ్‌ మరియు UFS 4.0 స్టోరేజీతో జతచేసి ఉంటుందని తెలుస్తోంది.

ఈ చిప్‌సెట్‌ Adreno 735 GPU చిప్‌సెట్‌ ను కూడా కలిగి ఉంటుందని సమాచారం. ఈ ఐకూ హ్యాండ్‌సెట్‌ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీతో వేరియంట్‌లో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్‌ OS వెర్షన్ వివరాలు తెలియాల్సి ఉంది.

iQOO Neo 10R Smartphone

సోనీ కెమెరాలతో విడుదల! :
ఐకూ నియో 10R స్మార్ట్‌ఫోన్‌ 144Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 1.5K OLED TCL C8 డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలతో విడుదల కానుంది. 50MP సోనీ LYT-600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ సహా సెల్ఫీ వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

భారీ బ్యాటరీ :
దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ భారీ బ్యాటరీతో లాంచ్ కానుందని తెలుస్తోంది. 80W PD ఛార్జింగ్ సపోర్టుతో 6400mAh బ్యాటరీ తో పనిచేసే అవకాశం ఉంది. రూ.30,000 ధరలో లాంచ్ కానుందని తెలుస్తోంది. అయితే పైన తెలిపిన స్పెసిఫికేషన్లు, ఫీచర్‌ లపై ఐకూ సంస్థ అధికారిక ప్రకటన చేయలేదు. విడుదల సమయం దగ్గరపడుతున్న కొద్దీ మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

గత సంవత్సరం డిసెంబర్‌ నెలలో భారత్‌ మార్కెట్‌ లోకి ఐకూ 13 స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. 6.82 అంగుళాల 2K LTPO అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. క్వాల్‌కాం 3nm స్నాప్‌డ్రాగన్‌ 8 Elite చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Funtouch OS ను కలిగి ఉంది. 120W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

ఈ ఫోన్‌ OIS, EIS సపోర్టుతో 50MP సోనీ IMX921 ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్‌ శాంసంగ్ JN1 కెమెరా మరియు 2X ఆప్టికల్ జూమ్‌ సామర్థ్యంతో 50MP సోనీ IMX816 కెమెరాను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.54999 గా ఉంది.

Best Mobiles in India

English summary
iQOO Neo 10R Smartphone launch date revealed in india with Snapdragon 8s Gen 3 Chipset
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X