Home
Mobile

6400mAh భారీ బ్యాటరీ, 6.78 అంగుళాల భారీ డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల..!

ఐకూ నియో 10R స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌ లో (iQOO Neo 10R Smartphone Launched) విడుదల అయింది. రెండు కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. డిజైన్ పరంగా ఆకట్టుకుంటుంది. దీంతోపాటు ఈ ఫోన్ మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది. గేమింగ్‌ కోసం ప్రత్యేక ఫీచర్‌ను కలిగి ఉంది. మిడ్‌ రేంజ్ ధరలో ఈ ఫోన్‌ విడుదల అయింది. ప్రస్తుతం ప్రీ బుకింగ్‌ చేసుకొనేందుకు అందుబాటులో ఉంది.

ఐకూ నియో 10R స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఐకూ స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల (1260*2800 పిక్సల్స్‌) 1.5K డిస్‌ప్లేతో లాంచ్ అయింది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 4500 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 300Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే HDR10+ సపోర్టు చేస్తుంది. మరియు Schott Xensation Up గ్లాస్‌ రక్షణను పొందుతుంది.

iQOO Neo 10R Smartphone Launched

ఈ స్మార్ట్‌ఫోన్‌ స్మాప్‌డ్రాగన్ 8s జెన్‌ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ Adreno 735 GPU, 12GB LPDDR5X ర్యామ్‌, 256GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 ను కలిగి ఉంది. గేమింగ్‌ కోసం ఈ-స్పోర్ట్‌ మోడ్‌ ఫీచర్‌ ఉంది.

గేమింగ్‌, మల్టీ టాస్కింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు 6043mm వేపర్‌ కూలింగ్‌ ఛాంబర్‌ను కలిగి ఉంది. అడ్వాన్సడ్‌ కూలింగ్‌ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ లో లాంచ్‌ అయింది.

iQOO Neo 10R Smartphone Launched

ఈ ఫోన్ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP CMOS సెన్సార్‌ను అమర్చి ఉంది. 60fps వద్ద 4K రికార్డింగ్‌ను ఈ ఫోన్‌ సపోర్టు చేస్తుంది.

ఈ హ్యాండ్‌సెట్‌ 80W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6400mAh బ్యాటరీని కలిగి ఉంది. భద్రత కోసం ఆప్టికల్ ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. IP65 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. AI Erase, అల్ట్రా క్లియర్‌, instant వంటి ఫీచర్‌లను కలిగి ఉంది.

కనెక్టివిటీ పరంగా ఈ ఐకూ ఫోన్ 5G, బ్లూటూత్ 5.4, వైఫై 7, GPS, NaVlc, GNSS, GALILEO, BeiDou,, GLONASS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. గైరోస్కోప్‌, ప్రాక్సిమిటీ సెన్సార్‌, యాంబియంట్‌ లైట్‌ సెన్సార్‌, యాక్సెలిరోమీటర్‌, ఇన్‌ప్రారెడ్‌ రిమోట్‌ కంట్రోల్‌ వంటి సెన్సార్‌లను అమర్చారు.

ఐకూ నియో 10R స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్ :
ఈ ఫోన్‌ 8GB/128GB వేరియంట్ ధర రూ.24,999, 8GB/256GB ధర రూ.26,999, 12GB/256GB ధర రూ.28,999 గా ఉంది. ఇవాళ 5 గంటల నుంచి ప్రీ బుకింగ్‌ చేసుకొనేందుకు ఐకూ అవకాశం కల్పించింది. వీరికి 12 నెలల వారంటీని అందిస్తోంది.

ముందస్తు బుకింగ్ చేసుకున్న వారు మార్చి 18 నుంచి ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇతరులకు మార్చి 19 నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. ఈ హ్యాండ్‌సెట్‌ను ఐసీఐసీఐ, HDFC, SBI కార్డులతో కొనుగోలు చేస్తే రూ.2,000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఐకూ ఇండియా ఇ-స్టోర్‌, అమెజాన్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ రేజింగ్‌ బ్లూ, మూన్‌నైట్‌ టైటానియం రంగుల్లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
iQOO Neo 10R Smartphone Launched with 6400mAh battery and snapdragon 8s Gen 3 Chipset in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X