Home
Mobile

రేపే ఐకూ నియో 10R స్మార్ట్‌ఫోన్‌ విడుదల.. 6400mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్‌ 8s జెన్‌ 3, గేమింగ్‌ ఫీచర్‌లు!

ఐకూ నియో 10R స్మార్ట్‌ఫోన్‌ (iQOO Neo 10R Smartphone Launch Date) రేపు (మార్చి 11) సాయంత్రం 4 గంటలకు భారత్‌లో లాంచ్‌ కానుంది. ఈ హ్యాండ్‌సెట్‌ ఐకూ ఇండియా స్టోర్‌, అమెజాన్‌ ద్వారా అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి అనేక వివరాలు వెల్లడయ్యాయి. డిస్‌ప్లే. కెమెరాలు, బ్యాటరీ, చిప్‌సెట్‌ సహా అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్ రూ.30,000 ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఐకూ నియో 10R స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా ఈ స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల 1.5K అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఎక్కువ సమయం ఫోన్ వినియోగించినా కళ్లకు హాని జరగకుండా ఉండేందుకు ప్రత్యేక ఫీచర్‌లను కలిగి ఉంటుంది.

iQOO Neo 10r Smartphone

ఈ డిస్‌ప్లే 4500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 144Hz రీఫ్రెష్‌ రేట్‌, 3840Hz PWM డిమ్మింగ్‌, 2000Hz ఇన్‌స్టంట్‌ టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌తో అందుబాటులోకి వస్తుంది. 0.798cm అల్ట్రా స్లిమ్‌ థిక్‌నెస్‌తో లాంచ్‌ కానుంది.

స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ :
ఈ ఐకూ స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 8s జెన్‌ 3 చిప్‌సెట్‌ తో పనిచేస్తుందని ఐకూ తెలిపింది. ఈ చిప్‌సెట్ LPDDR5X ర్యామ్, UFS 4.1 (256GB) స్టోరేజీతో జతచేసి ఉంటుందని వెల్లడించింది. ఈ ఫోన్ 1.7Mn+ AnTuTU స్కోర్‌ను కలిగి ఉంది.

నాలుగు సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Funtouch OS పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 3 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ అందిస్తామని చెబుతోంది. మరియు IP65 రేటింగ్‌ తో డస్ట్ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

ఈ హ్యాండ్‌సెట్ గేమింగ్‌ కోసం ప్రత్యేకంగా అల్ట్రా గేమ్ మోడ్‌ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. మరియు ఇన్‌ బిల్ట్‌ FPS మీటర్‌ను అమర్చి ఉంది. మల్టీ టాస్కింగ్‌, గేమింగ్‌ సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు 60000mm2 వేపర్‌ కూలింగ్ ఛాంబర్‌ను కలిగి ఉంది.

50MP కెమెరా :
ఐకూ నియో 10R స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 8MP సెకండరీ కెమెరాలను కలిగి ఉంటుంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాను అమర్చి ఉంటుందని ఐకూ వెల్లడించింది.

భారీ బ్యాటరీ :
భారీ బ్యాటరీతో ఈ ఫోన్‌ లాంచ్‌ కానుంది. 80W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6400mAh బ్యాటరీతో లాంచ్‌ కానుందని ఇప్పటికే ఐకూ వెల్లడించింది. మరియు ఈ హ్యాండ్‌సెట్ ధర సుమారుగా రూ.30,000 గా ఉండే అవకాశం ఉంది. అమెజాన్‌ ద్వారా సేల్ ప్రారంభం కానుంది.

ఈ ఐకూ స్మార్ట్‌ఫోన్ రెండు కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది. రేజింగ్‌ బ్లూ, మాంక్‌నైట్‌ టైటానియం రంగుల్లో అందుబాటులోకి రానుంది. మరియు అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ఫీచర్‌లను కలిగి ఉంటుందని అమెజాన్‌ లైవ్‌ పేజీ ద్వారా వెల్లడైంది.

More from GizBot

Best Mobiles in India

English summary
iQOO Neo 10r Smartphone launching on tomorrow in india with 6400mAh and gaming features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X