iQOO Neo 10R Vs Realme P3 Ultra రూ.30 వేల కంటే తక్కువ ధరలో ఈ రెండు ఫోన్స్‌లో ఏది కొనుగోలు చేయాలి..?
భారత్ మార్కెట్‌లో మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లకు క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా రూ.25000 నుంచి రూ.30000 మధ్య ధరలు కలిగిన ఫోన్‌లకు డిమాండ్ ఉంటోంది. మల్టీ టాస్కింగ్, గేమింగ్ కోసం వీటిని అధిక శాతం మంది కొనుగోలు చేస్తున్నారు. ఈనెలలో ఈ ధర సెగ్మెంట్‌లో రెండు స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. ఐకూ నియో 10R 5G, రియల్‌మి P3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ రెండింటిలో ఏ హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేయాలో తెలియక చాలా మంది తెగ ఆలోచన చేస్తుంటారు. వారి కోసం ఈ ప్రత్యేక కథనం.
ఐకూ నియో 10R, రియల్‌మి P3 అల్ట్రా 5G (iQOO Neo 10R Vs Realme P3 Ultra) ఫోన్‌ల ప్రారంభ ధర రూ.26,999 గా ఉంది. అయితే ఈ రెండు కూడా అనేక ప్రత్యేక ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. ఐకూ ఫోన్ సేల్ ఇప్పటికే ప్రారంభం కాగా.. రియల్‌మి ఫోన్ ఇవాళ్టి నుంచి సేల్ ప్రారంభం అయింది.

* ఐకూ నియో 10R స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ (iQOO Neo 10R Smartphone) స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్ తో పనిచేస్తోంది. ఈ చిప్‌సెట్ Adreno 735 GPU తోపాటు గరిష్ఠంగా 12GB LPDDR5X ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 ను కలిగి ఉంది.
ప్రత్యేక ఫీచర్‌లు :
ఈ హ్యాండ్‌సెట్ గేమింగ్ కోసం ఇ-స్పోర్ట్స్ మోడ్ ను కలిగి ఉంది. మరియు మల్టీ టాస్కింగ్, గేమింగ్ సమయంలో స్మార్ట్‌ఫోన్ వేడెక్కకుండా అడ్వాన్సడ్ కూలింగ్ టెక్నాలజీతో 6043mm వేపర్ కూలింగ్ ఛాంబర్‌ను కలిగి ఉంది. 80W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6400mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
డిస్‌ప్లే వివరాలు :
ఈ ఐకూ నియో 10R హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల (1260*2800 పిక్సల్స్) 1.5K డిస్‌ప్లేను కలిగి ఉంది. 4500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే Schott Xensation Up గ్లాస్ రక్షణను పొందుతుంది. మరియు HDR10+ సపోర్టు చేస్తుంది.
కెమెరా ఫీచర్‌లు :
ఈ ఫోన్ 50MP సోనీ IMX882 మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 60fps వద్ద 4K రికార్డింగ్‌ను చేయవచ్చు. AI Erase, అల్ట్రా క్లియర్ ఫీచర్‌లను కలిగి ఉంది. IP65 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
ఐకూ నియో 10R స్మార్ట్‌ఫోన్ ధర :
ఐకూ నియో 10R స్మార్ట్‌ఫోన్ 8GB/128GB ధర రూ.26999, 8GB/256GB ధర రూ.28999, 12GB/256GB ధర రూ.30999 గా ఉంది.
రియల్‌మి P3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
ఈ ఫోన్ (Realme P3 Ultra Smartphone) ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 OS ను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్ట్రా చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 12GB LPDDR5X ర్యామ్ మరియు 256GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంటుంది.
బ్యాటరీ :
ఈ ఫోన్ 6050mm2 ఏరోస్పేస్ గ్రేడ్ VC కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ AI మోషన్ కంట్రోల్, AI అల్ట్రా టచ్ కంట్రోల్ వంటి AI ఆధారిత GT బూస్ట్ గేమింగ్ ఫీచర్లను కలిగి ఉంది. 80W AI బైపాస్ ఛార్జింగ్ టెక్నాలజీతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.
డిస్‌ప్లే :
ఈ హ్యాండ్‌సెట్ 6.83 అంగుళాల 1.5K క్వాడ్ కర్వడ్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 2500Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ లెదర్ ఫినిష్‌ను కలిగి ఉంది. మరియు గ్లోయింగ్ లూనార్ డిజైన్ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. అంటే చీకట్లో ఈ ఫోన్ బ్యాక్ ప్యానల్ మెరుస్తుంది.
కెమెరా వివరాలు :
కెమెరా విభాగం పరంగా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) 50MP సోనీ IMX896 మెయిన్ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాలను అమర్చారు. ఈ ఫోన్ IP66+ IP68+ IP69 రేటింగ్‌తో కూడిన డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుంది.
ధర వివరాలు :
రియల్‌మి P3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం మూడు స్టోరేజీ వేరియంట్స్‌లో భారత్ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.26999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.27,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.29,999 గా ఉంది.
ఈ రెండింటిలో ఏ ఫోన్‌ను ఎంచుకోవాలి :
ఐకూ ఫోన్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 144Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. డిస్‌ప్లే బ్రైట్‌నెస్, రీఫ్రెష్ రేట్‌ను మీరు ప్రాధాన్యతగా తీసుకుంటే ఐకూ ఫోన్ వైపు మొగ్గుచూపవచ్చు. భారీ డిస్‌ప్లే కావాలంటే రియల్‌మిని ఎంచుకోండి. దీంతోపాటు చిప్‌సెట్ పరంగా ఐకూ బెటర్ ఫెర్ఫామెన్స్‌ను అందిస్తుంది.
కెమెరా విభాగం పరంగా రియల్‌మి 16MP సెల్ఫీ కెమెరాను, ఐకూ 32MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. వెనుక వైపు రెండు ఫోన్‌లు కూడా 50MP కెమెరాలను కలిగి ఉన్నాయి. వెనుక వైపు కెమెరాల పరంగా రియల్‌మి, సెల్ఫీ కెమెరా పరంగా ఐకూ బెస్ట్ ఫెర్ఫామెన్స్‌ను అందిస్తుంది.
బ్యాటరీ పరంగా చూస్తే ఐకూ 6400mAh బ్యాటరీ, రియల్‌మి 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఫోన్ ఎక్కువగా వినియోగించే వారు ఐకూ పై ఆసక్తి చూపే అవకాశం ఉంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల ప్రారంభ ధర రూ.26999 గా ఉంది. ఎక్కువ రోజుల మన్నిక, భారీ డిస్‌ప్లే ఫోన్ కోసం అయితే రియల్‌మి.. మెరుగైన గేమింగ్ సహా భారీ బ్యాటరీ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఐకూ ను ఎంచుకోవచ్చు.


Click it and Unblock the Notifications








