7500mAh భారీ బ్యాటరీ, 6.82 అంగుళాల భారీ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 Elite ప్రాసెసర్‌తో ఫోన్..!
ఐకూ నుంచి మరో ఫోన్ విడుదల అయింది. ఇటీవలే చైనాలో ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. తాజాగా ఐకూ నియో 11 పేరుతో చైనా మార్కెట్ లో అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. మరియు ప్రత్యేకంగా Q2 గేమింగ్ చిప్ కూడా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ భారీ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. ఐకూ నియో 11 స్మార్ట్‌ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు.
ఐకూ నియో 11 స్మార్ట్‌ఫోన్ (iQOO Neo 11 Smartphone) చైనాలో 144Hz రీఫ్రెష్ రేట్‌తో 6.82 అంగుళాల 2K BOE Q10+ ఫ్లాట్ అమోలెడ్ 8T LTPO డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 1800 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 2592 Hz PWM డిమ్మింగ్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ యాంటీ రిఫ్లక్షన్ కోటింగ్‌తో అందుబాటులోకి వచ్చింది.

స్నాప్‌డ్రాగన్ ప్రాససెర్, ఆండ్రాయిడ్ 16 OS :
ఈ ఐకూ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ 16GB LPDDR5x అల్ట్రా ర్యామ్, 1TB UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 పైన పనిచేస్తుంది.
కెమెరా వివరాలు :
కెమెరా విభాగం పరంగా ఐకూ నియో 11 హ్యాండ్‌సెట్ 50MP సోనీ LYT 700V OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ Omnivision OV08D లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP గెలాక్సీ కోర్ GC16B3 కెమెరాను కలిగి ఉంది.
ఈ ఐకూ హ్యాండ్‌సెట్ 100W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7500mAh బ్యాటరీని కలిగి ఉంది. భద్రత కోసం 3D అల్ట్రాసోనిక్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. IP68/69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. మెరుగైన ఆడియో కోసం డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా బ్లూటూత్ 5.4, వైఫై 7, NFC. IR బ్లాస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఐకూ నియో 11 స్మార్ట్‌ఫోన్ ధర :
ఈ ఫోన్ చైనా మార్కెట్‌లో 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 16GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ, 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ, 16GB ర్యామ్ + 1TB స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తోంది. ఈ ఫోన్ ప్రారంభ ధర 2599 Yuan (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.32,400 గా ఉంటుంది).
ఐకూ నియో 11 స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్లో 2026 ఫిబ్రవరి నెలలో విడుదల అయ్యే అవకాశం ఉంది. భారత్‌లో ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ నవంబర్ 26 వ తేదీన విడుదల కానుంది. ఈ ఫోన్ గురించి ఇప్పటికే అనేక వివరాలు వెల్లడయ్యాయి.


Click it and Unblock the Notifications








