8GB ర్యామ్, 5160mAh బ్యాటరీతో iQoo కొత్త స్మార్ట్‌ఫోన్.. లాంచ్, సేల్ వివరాలు..!
ఐకూ క్రమంలో తన ఫోర్ట్‌ఫోలియోను భారత్‌లో క్రమంగా విస్తరిస్తోంది. వివో సబ్‌బ్రాండ్‌గా మార్కెట్‌లోకి వచ్చిన ఐకూ తన ఉత్పత్తులతో ప్రసిద్ధి చెందింది. తాజాగా ఐకూ సంస్థ ఐకూ నియో 9 ప్రో (iQoo Neo 9 Pro) పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి 22న విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్ విడుదలను ఐకూ సంస్థ విడుదలను అధికారికంగా ధ్రువీకరించింది.
ఐకూ నియో 9 ప్రో స్మార్ట్ ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ గురించి ఐకూ సంస్థ ఎటువంటి వివరాలు వెల్లడించకపోయినా.. అమెజాన్ పేజీ ద్వారా కొన్ని వివరాలు అందుబాటులోకి వచ్చాయి.

ఐకూ నియో 9 ప్రో స్పెసిఫికేషన్లు : ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఆధారంగా ఐకూ నియో 9 ప్రో స్మార్ట్‌ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌లో ఐకూ సంస్థకు చెందిన Q1 సూపర్‌కంప్యూటింగ్ చిప్ కూడా ఉంటుంది. ఈ చిప్ 144 fps ఫ్రేమ్ రేట్ మరియు 900p రిజల్యూషన్‌తో వస్తుంది. మరియు మెరుగైన గేమింగ్ అనుభూతిని అందిస్తుందని తెలుస్తోంది.
అమెజాన్ లిస్టింగ్ పేజీ ఆధారంగా ఈ ఐకూ కొత్త స్మార్ట్‌ఫోన్ రెండు ర్యామ్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. 8GB, 12GB ర్యామ్ వేరియంట్లతోపాటు 256GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉండనుంది. ఐకూ నియో 9 ప్రో స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ టోన్ డిజైన్, ప్రీమియం లెథర్ ఫినిష్, యూనిక్ డ్యూయల్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ రెడ్, వైట్ డ్యూయల్ టోన్ రంగును కలిగి ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. నైట్ విజన్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన 50MP సోనీ IMX920 ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. మరియు 8MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అయితే ముందువైపు కెమెరా వివరాలు ఇప్పటివరకు వెల్లడికాలేదు.
బ్యాటరీ, ఛార్జింగ్ పరంగా మెరుగైన సామర్థ్యాలను ఐకూ నియో 9 ప్రో స్మార్ట్‌ఫోన్ కలిగి ఉంది. 120W వైరడ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5160mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌తో వస్తున్న ఛార్జర్‌ను ఇతర నోట్‌బుక్, ఫోన్లను వేగంగా ఛార్జింగ్ చేసేందుకు ఉపయోగించుకోవచ్చని ఐకూ వెల్లడించింది. ఇతర డివైస్‌లకు 65W సామర్థ్యంతో ఛార్జింగ్ చేయవచ్చు.
అయితే iQoo Neo 9 Pro స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే వివరాలను వెల్లడి కాలేదు. మరియు ఎంత ధరకు ఈ హ్యాండ్‌సెట్ కొనుగోలు చేయవచ్చనే వివరాలను సంస్థ, అమెజాన్ ఇంకా వెల్లడించలేదు. ఈ స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి 22న భారత్ మార్కెట్‌లోకి విడుదల కానుంది. లాంచ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications